Govt Job

Jobs in Postal Department

Jobs in Postal Department : భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్​ మంత్రిత్వ శాఖలోని తపాలా శాఖ (Government of India, Ministry of Communications, Department of Posts) దేశ వ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో మొత్తం 40,889 గ్రామీణ డాక్​ సేవక్​ (Gramin Dak Sevaks – GDS) ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనే 3,746 (ఆంధ్రప్రదేశ్​‌‌-2,480, తెలంగాణ-1,266) పోస్టులు ఉన్నాయి. పదో తరగతి మార్కుల్లో మెరిట్​ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ఏబీపీఎం), డాక సేవక్ లుగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Details of Posts

1. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (Branch Postmaster-BPM)
2. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (Assistant Branch Postmaster-ABPM)
3. డాక్​ సేవక్ (Dak Sevak)

Reservation Wise Vacancies

ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh) : మొత్తం – 2,480
అన్​రిజర్వుడ్​ (UR)-1,131, ఓబీసీ (OBC)-483, ఎస్సీ(SC)-298, ఎస్టీ(ST)-158, ఈడబ్ల్యూఎస్​(EWS)-340, పీడబ్ల్యూడీఏ(PWDA)-09, పీడబ్ల్యూడీబీ(PWDB)-29, పీడబ్ల్యూడీసీ (PWDC) -27, పీడబ్ల్యూడీఈ(PWDDE)-5

తెలంగాణ (Telangana) : మొత్తం – 1,266
అన్​రిజర్వుడ్​ (UR)-528, ఓబీసీ (OBC)-300, ఎస్సీ(SC)-190, ఎస్టీ(ST)-78, ఈడబ్ల్యూఎస్​(EWS)-141, పీడబ్ల్యూడీఏ(PWDA)PWDA-05, పీడబ్ల్యూడీబీ(PWDB)-07, పీడబ్ల్యూడీసీ (PWDC)-16, పీడబ్ల్యూడీఈ(PWDDE)-01

Salary

1. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) – రూ.12,000 – రూ.29,380
2. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్/డాక్​ సేవక్​ – రూ.10,000 – రూ.24,470

Eligibility

పదో తరగతి పాసై ఉండాలి.
మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష తప్పనిసరి చదివి ఉండాలి.
ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదివి ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి.

Age Limit

పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు ఫిబ్రవరి 16, 2023 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ఓబీసీలకు 03 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీలకు 05 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఓబీసీ దివ్యాంగులకు 13 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 15 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఎకనమికల్లీ వీకర్​ సెక్షన్​కు ఎలాంటి సడలింపు లేదు.

Job Profile

బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM):

ఈ పోస్టుకు ఎంపికైనవారు సంబంధిత బ్రాంచ్ కార్యకలాపాలు పర్యవేక్షించాలి.                   పోస్టల్ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి.
రికార్డుల నిర్వహణ, ఆన్​ లైన్ ట్రాన్సాక్షన్​ లు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలి.
ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూసుకోవాలి.
తపాలాకు సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలూ చక్కబెట్టాలి.
గ్రూప్​ లీడర్​గా సంబంధిత బ్రాంచ్​ను నడిపించాలి.
పోస్టల్ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.

అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ఏ(ABPM):

ఈ జాబ్​ లో చేరినవాళ్లు స్టాంపులు/ స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూడాలి.
ఇండియన్ పోస్టు పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, ఇతర లావాదేవీలు నిర్వహించాలి.
బ్రాంచ్ పోస్టుమాస్టర్ నిర్దేశించిన పనులు పూర్తి చేయాలి.
వివిధ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి.

డాక్​ సేవక్ (Dak Sevak):

ఈ జాబ్​లో చేరినవారు ఉత్తరాలు పంపిణీ చేయాలి.
స్టాంపులు/ స్టేషనరీ విక్రయించాలి.
బీపీఎం, ఏబీపీఎం సూచించిన పనులు పూర్తిచేయాలి.
రైల్వే మెయిల్ సర్వీస్, పోస్టల్ పేమెంట్ బ్యాంకు విధులు చూసుకోవాలి.
పోస్టల్ పథకాలపై ప్రచారం చేయాలి.

Selection Criteria

అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ఖాళీ ఉన్న పోస్టులు, బ్రాంచీలు, రిజర్వ్/ అన్ రిజర్వుడ్​ వివరాలు పరిశీలించి ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి.
మొదటి ప్రాధాన్యం ఇచ్చే దానికి ఆప్షన్ 1 ఆ తర్వాత దానికి ఆప్షన్ 2, ఆ తర్వాత ఆప్షన్​ 3 అలా అప్లై చేయాలి.
ఖాళీలను బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్ ఇయిస్తారు.
ఎంపికైనవారికి ఎస్ఎంఎస్/ ఈ-మెయిల్/ పోస్టు ద్వారా సమాచారం ఇస్తారు.

How to Apply

అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇండియా పోస్ట్​కు సంబంధించిన వెబ్​ సైట్​ https://indiapostgdsonline.gov.in/ ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్​ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తుకు చివరి తేదీ : ఫిబ్రవరి 16, 2023.
దరఖాస్తు సవరణలకు అవకాశం: 17.02.2023 నుంచి 19.02.2023 వరకు

వెబ్​ సైట్​ : https://indiapostgdsonline.gov.in/

– Jobs in Postal Department

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago