Bank Jobs

Jobs in Punjab National Bank

Jobs in Punjab National Bank : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank-PNB) వివిధ బ్రాంచ్ లలో ఆఫీసర్ (ఫైర్-సేఫ్టీ) (Officer (Fire-safety), మేనేజర్ (సెక్యూరిటీ) (Manager (Security)) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 103 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ ఆన్ లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Details of Posts

1. Officer (Fire-safety), Grade/ scale : JMGS-I
2. Manager (Security), Grade/ scale : MMGS-II

Reservation Wise Vacancies

ఆఫీసర్ (ఫైర్-సేఫ్టీ) మొత్తం పోస్టులు – 23
SC – 03, ST – 01, OBC – 06, EWS – 02, UR – 11
మేనేజర్ (సెక్యూరిటీ) మొత్తం పోస్టులు – 80
SC – 12, ST – 06, OBC – 21, EWS – 08, UR – 33

Scale of Pay

Officer (Fire-safety) : రూ.36,000 – 63,840
Manager (Security) : రూ.48170 69810
జీతంతో పాటు బ్యాంకు నిబంధనల ప్రకారం డీఏ, సీసీఏ, హెచ్ఎస్ఏ/ లీస్డ్ అకామిడేషన్, లీఫ్ ఫేర్ కన్సెషన్, మెడికల్ ఇన్సూరెన్స్, ఇటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తారు.

Eligibility

Officer (Fire-safety) :
నాగ్ పూర్ లోని నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీ (NFSC) లో B.E(Fire) కోర్సు చేసిన వారు, లేదా AICTE/UGC గుర్తింపు పొందిన కాలేజీ/ యూనివర్సిటీలో Fire Technology/Fire Engineering/ Safety and Fire Enginerring లో B.Tech/B.E(నాలుగు సంవత్సరాల గ్రాడ్యుయేషన్ డిగ్రీ) చేసి వారు, లేదా AICTE/UGC గుర్తింపు పొందిన కాలేజీ/ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ చేసి.. నాగ్ పూర్ లోని నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీ డివిజినల్ ఆఫీసర్ (Divisional officer) కోర్సు చేసిన వారు, లేదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజినీర్స్ ఇండియా/ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజినీరింగ్ – యూకేలో గ్రాడ్యుయేషన్ చేసిన వారు, లేదా నాగ్ పూర్ లో ని నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీలో సబ్-ఆఫీసర్ కోర్సు/ స్టేషన్ ఆఫీసర్ కోర్సు చేసి, 60 శాతం మార్కులతో పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
అలాగే, విద్యార్హతలను బట్టి ఒకటి నుంచి మూడు సంవత్సరాల పని అనుభవం ఉండాలి. అదే విధంగా అభ్యర్థులకు అగ్నిమాపక భద్రతా నిబంధనలపై పరిజ్ఞానం ఉండాలి. హిందీ, ఇంగ్లిష్ భాషలు ప్రావీణ్యం, కంప్యూటర్ ఆపరేటింగ్ లో ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండాలి.

Manager (Security) :
AICTE/UGC గుర్తింపు పొందిన ఏదైనా కాలేజీ/ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే, ఆర్మీ లేదా నేవీ లేదా వైమానిక దళంలో  ఐదు (05) సంవత్సరాల కమిషన్ సర్వీస్ చేసి ఉండాలి. లేదా డిప్యూటీ సూపరింటెంటెండ్ ఆఫ్ పోలీస్ లేదా అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్ కు  తక్కువ కాని గెజిటెడ్ పోలీస్ ఆఫీసర్ లేదా సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ లో అందుకు సమానమైన ర్యాంకు కలిగి ఉండి కనీసం ఐదు (05) సంవత్సరాల సర్వీస్ కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

Age Limit

అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలు, 1984 అల్లర్లలో మృతిచెందిన వారి పిల్లలు, కుటుంబ సభ్యులకు మూడు (05) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు ఐదు(05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు
ఉంది.

Selection Procudure

  • అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నిర్వహిస్తారు.
  • దరఖాస్తుల షార్ట్ లిస్ట్ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. లేదా రాత పరీక్ష/ ఆన్ లైన్ టెస్ట్ నిర్వంచి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • పరీక్ష ప్రొఫెషనల్ నాలెడ్జ్ పై నిర్వహిస్తారు. 50 ప్రశ్నలు ఇస్తారు, 100 మార్కులు ఉంటాయి. 60 నిమిషాలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
  • నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.

How to Apply

ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు ముందుగా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.59, ఇతర కేటగిరీల వారు రూ.1003 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును ఆన్ లైన్ లో (Account Name : RECRUITMENT OF FIRE SAFETY OFFICERS AND SECURITY MANAGERS PROJECT 2022-23, Account No. 9762002200000415, IFSC Code PUNB0976200) చెల్లించాలి.  అనంతరం బ్యాంకు వెబ్ సైట్ (www.pnbindia.in) లోకి లాగిన్ అయ్యి Recruitments పై క్లిక్ చేసి అందులో నిర్ణీత ఫార్మాట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫాంలో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించి, అందులోని వివరాలన్నీ నింపాలి. అదే విధంగా విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, కులం సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు జతచేసి వాటన్నింటినీ ఒక ఎనవలప్ కవర్ లో పెట్టి కవర్ పైన ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నది రాయాలి. ఆ కవర్ ను స్పీడ్ పోస్టు లేదా రిజిస్టర్డ్ పోస్టు ఈ క్రింది అడ్రస్ కు పంపించాలి.
CHIEF MANAGER (RECRUITMENT SECTION),
HRD DIVISION, PUNJAB NATIONAL BANK,
CORPORATE OFFICE, PLOT NO 4, SECTOR 10,
DWARKA, NEW DELHI – 110075.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఆగస్టు 30, 2022

– Jobs in Punjab National Bank

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

3 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

12 months ago