Jobs in SPMCIL : భారత ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Security Printing & Minting Corporation of India Limited-SPMCIL) డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Advt.No.03/2022) జారీ చేసింది. మొత్తం 37 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. Dy. Manager (Environment)
2. Assistant Manager (Marketing)
3. Assistant Manager (Finance & Accounts)
4. Assistant Manager (Legal)
5. Assistant Manager (HR)
6. Assistant Manager (Environment)
7. Assistant Manager (Materials Management)
8. Assistant Manager (Civil)
9. Assistant Manager (Information Technology)
పోస్టుల సంఖ్య : ఒకటి (01) (అన్ రిజర్వుడ్) (UR)
పోస్టు లెవల్ : E-2
పే స్కేల్: రూ.50,000- రూ.1,60,000
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీలో కెమిస్ట్రీ/ కెమికల్ ఇంజినీరింగ్/ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ లో ఫస్ట్ క్లాస్ లో మాస్టర్స్ డిగ్రీ (ఫుల్ టైం) ఉత్తీర్ణులైనవారు అర్హులు. సంబంధిత విభాగంలో మూడు (03) సంవత్సరాల అనుభవం తప్పనిసరి.
పోస్టుల సంఖ్య : పదహారు (16) (UR-08, OBC-04, SC-02, ST-01, EWS-01)
పోసు లెవల్ : E-1
పే స్కేల్: రూ.40,000 – రూ.1,40,000,
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ లో మార్కెటింగ్ మేనేజ్మెంట్/ ఎంబీఏ ఫస్ట్ క్లాస్ లో మాస్టర్స్ డిగ్రీ (ఫుల్ టైం) ఉత్తీర్ణులైనవారు అర్హులు.
పోస్టుల సంఖ్య : పది (10) (UR-05, OBC-03, ST-01, EWS-01)
పోసు లెవల్ : E-1
పే స్కేల్: రూ.40,000 – రూ.1,40,000,
అర్హతలు: CA/ICWA తో పాటు బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (B.Com) డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులు.
పోస్టుల సంఖ్య : మూడు (03) (UR-02, EWS-01)
పోస్టు లెవల్ : E-1
పే స్కేల్: రూ.40,000 – రూ. 1,40,000
అర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇనిస్టిట్యూట్ లో లా డిగ్రీ (రెగ్యులర్ కోర్సు) ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన నేషనల్ లా స్కూల్/ లా ఫ్యాకల్టీ నుంచి లా డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
పోస్టుల సంఖ్య : మూడు (03) (UR-02, SC-01)
పోసు లెవల్ : E-1
పే స్కేల్: రూ.40,000 – రూ.1,40,000
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ లో PM & IR/MSW/MBA (ఫుల్ టైం) ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులైనవారు అర్హులు. మేనేజ్మెంట్ లో రెండు సంవత్సరాల (ఫుల్ టైం) పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన వారు కూడా అర్హులే.
పోస్టుల సంఖ్య: ఒకటి (01) (OBC)
పోస్టు లెవల్ : E-1
పే స్కేల్: రూ.40,000- రూ.1,40,000
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీలో కెమిస్ట్రీ/ కెమికల్ ఇంజినీరింగ్/ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ లో ఫస్ట్ క్లాస్ లో మాస్టర్స్ డిగ్రీ (ఫుల్ టైం) ఉత్తీర్ణులైనవారు అర్హులు.
పోస్టుల సంఖ్య : ఒకటి (01) (OBC)
పోస్టు లెవల్ : E-1
పే స్కేల్: రూ.40,000 – రూ.1,40,000
అర్హతలు: మెకానికల్/ ఎలక్ట్రికల్/ పల్ఫ్ అండ్ పేపర్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ప్రింటింగ్ టెక్నాలజీ విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులైనవారు అర్హులు. అలాగే, మేటీరియల్ మేనేజ్మెంట్/ స్టోర్స్ మేనేజ్మెంట్/పర్చేజ్/ ఆపరేషన్స్ మేనేజ్మెంట్/ సప్లై చైన్ మేనేజ్మెంట్/ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ విభాగంలో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా/ ఎంబీఏ చేసి ఉండాలి.
పోస్టుల సంఖ్య: ఒకటి (01) (UR)
పోస్టు లెవల్ : E-1
పే స్కేల్: రూ.40,000 – రూ.1,40,000
అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో B.Tech/B.E ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులైనవారు అర్హులు.
పోస్టుల సంఖ్య : ఒకటి (01) (UR)
పోస్టు లెవల్ : E-1
పే స్కేల్: రూ.40,000 – రూ.1,40,000
అర్హతలు: MCA (ఫుల్ టైం కోర్సు) / B.Tech (Computer Engineering/IT) ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణులైనవారు అర్హులు.
డిప్యూటీ మేనేజర్ (ఎన్విరాన్మెంట్) పోస్టుకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల గరిష్ట వయసు అక్టోబర్ 03, 2022 నాటికి 35 సంవత్సరాలు ఉండాలి. మిగిలిన అన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు ఉండాలి.
ఓబీసీ అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది. మాజీ సైనికులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు SPMCIL వెబ్ సైట్ (www.spmcil.com) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని. ఆ తర్వాత ఆన్ లైన్ అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి. విద్యార్హతలు, అనుభవంకు సంబంధించిన సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఎగ్జామినేషన్ ఫీజు నిమిత్తం జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులు రూ.200, ఆన్ లైన్ లో చెల్లించాలి.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 03, 2022
– Jobs in SPMCIL
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…