Jobs in Telangana Health Department : తెలంగాణ ప్రభుత్వ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (Medical & Health Services Recruitment Board, Government of Telangana-MHSRB) రాష్ట్ర వైద్య శాఖలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Notification N0.01/2022, DATED:15.6.2022) జారీ చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (DPH & FW), డైరెక్టోరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME), తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP), ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM) విభాగాలలో మొత్తం 1,326 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించింది.
Details of Posts
1. సివిల్ అసిస్టెంట్ సర్జన్స్
(పోస్టు కోడ్: 01, పోస్టుల సంఖ్య:751)
2. ట్యూటర్స్
(పోస్టు కోడ్: 02 పోస్టుల సంఖ్య: 357)
3. సివిల్ అసిస్టెంట్ సర్జన్-జనరల్/జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్
(పోస్టు కోడ్: 03, పోస్టుల సంఖ్య: 211)
4. సివిల్ అసిస్టెంట్ సర్జన్స్
(పోస్టు కోడ్: 04, పోస్టుల సంఖ్య:7)
డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ విభాగాలలో సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ (Civil Assistant Surgeons) పోస్టులు భర్తీ చేయనుంది. అలాగే, డైరెక్టోరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ట్యూటర్స్ (Tutors), తెలంగాణ వైద్య విధాన పరిషత్ విభాగంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్-జనరల్/జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (Civil Assistant Surgeon-General/General Duty Medical Officers) పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Multi Zone Wise Vacancies
Civil Assistant Surgeon (in DPH&FW)
MZ-I
OC(G)-105, (W)-55
EWS(G)-32, (W)-15
BC-A(G)-23, (W)-10
BC-B(G)-27, (W)-18
BC-C(G)-4, (W)-1
BC-D(G)-22, (W)-10
BC-E(G)-13, (W)-5
SC(G)-46, (W)-24
ST(G)-18, (W)-10
PH(G)-14(OH), (W)-5(OH)
Sports(G)-9
MZ-II
OC(G)-64, (W)-34
EWS(G)-19, (W)-9
BC-A(G)-15, (W)-6
BC-B(G)-17, (W)-11
BC-C(G)-2, (W)-1
BC-D(G)-13, (W)-6
BC-E(G)-8, (W)-3
SC(G)-28, (W)-14
ST(G)-12, (W)-6
PH(G)-9(OH), (W)-3(OH)
Sports(G)-5
Tutor (in DME)
MZ-I
OC(G)-42, (W)-26
EWS(G)-14, (W)-6
BC-A(G)-10, (W)-4
BC-B(G)-12, (W)-8
BC-C(G)-2, (W)-0
BC-D(G)-10, (W)-4
BC-E(G)-6, (W)-2
SC(G)-20, (W)-10
ST(G)-8, (W)-4
PH(G)-6(OH), (W)-2(OH)
Sports(G)-4
MZ-II
OC(G)-35, (W)-20
EWS(G)-11, (W)-5
BC-A(G)-8, (W)-4
BC-B(G)-8, (W)-6
BC-C(G)-2, (W)-0
BC-D(G)-7, (W)-3
BC-E(G)-4, (W)-2
SC(G)-15, (W)-8
ST(G)-6, (W)-3
PH(G)-5(OH), (W)-2(OH)
Sports(G)-3
Civil Assistant Surgeon -General/General Duty Medical Officer (in TVVP)
MZ-I
OC(G)-23, (W)-14
EWS(G)-7, (W)-3
BC-A(G)-9, (W)-4
BC-B(G)-10, (W)-6
BC-C(G)-2, (W)-0
BC-D(G)-7, (W)-3
BC-E(G)-4, (W)-1
SC(G)-14, (W)-8
ST(G)-7, (W)-3
PH(G)-3(OH), (W)-1(OH)
Sports(G)-2
MZ-II
OC(G)-16, (W)-8
EWS(G)-4, (W)-2
BC-A(G)-4, (W)-3
BC-B(G)-4, (W)-3
BC-C(G)-1, (W)-0
BC-D(G)-4, (W)-3
BC-E(G)-2, (W)-2
SC(G)-9, (W)-5
ST(G)-3, (W)-3
PH(G)-2(OH), (W)-1(OH)
Sports(G)-1
Civil Assistant Surgeon (in IPM)
MZ-I
OC(G)-0, (W)-1
MZ-II
OC(G)-2, (W)-1
BC-A(G)-0, (W)-1
SC(G)-0, (W)-1
PH(W)-1(OH)
Qualifications
ఎంబీబీఎస్ లేదా దానికి సమానమైన కోర్సు పాసై ఉండాలి. తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ లో తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
Age Limit
జూలై 1, 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ,ఈడబ్ల్యూఎస్
కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది. టీఎస్ ఆర్టీసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పనిచేసే ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి రారు. అలాగే, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ ఇన్ స్ట్రక్టర్స్ కు మూడు (03) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.
Pay Scale Per Month
సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ (DPH&FW)&(IPM) – రూ.58,850 – రూ.1,37,050
ట్యూటర్స్ – రూ.57,700 – రూ.1,82,400 (UGC Scales-2016)
సివిల్ అసిస్టెంట్ సర్జన్-జనరల్/ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ – రూ.58,850 – రూ.1,37,050
Selection Procedure
- రాత పరీక్ష మరియు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించిన సేవలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
- మొత్తం 100 పాయింట్లలో రాత పరీక్షకు 80 పాయింట్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, సంస్థలు, వివిధ పథకాలలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసిన వారికి గరిష్టంగా 20 పాయింట్లు కేటాయిస్తారు.
- గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారికి ఆరు నెలలకు 2.5 పాయింట్లు కేటాయిస్తారు.
- గిరిజన ప్రాంతాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో పనిచేసిన వారికి ఆరు నెలలకు 2 పాయింట్లు కేటాయిస్తారు.
- ఆరు నెలల కాలం పూర్తిచేసిన వారికి మాత్రమే పై పాయింట్లు కేటాయిస్తారు. ఆరు నెలల కాలం పూర్తికాని వారికి ఎలాంటి పాయింట్లు కేటాయించరు.
- అభ్యర్థులు తాము పనిచేస్తున్న సంస్థ నుంచి అనుభవం (Experience) సర్టిఫికెట్ తీసుకోవాలి.
- ఈ పోస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనే సమయంలో ఆ సర్టిఫికెట్ ను కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
Fee Payment
ప్రతి అభ్యర్థి ఆన్ లైన్ అప్లికేషన్ ఫీజు రూ.200 చెల్లించాలి. అలాగే, పరీక్ష/ప్రాసెసింగ్ ఫీజు రూ.120 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు గల నిరుద్యోగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సంబంధిత కేటగిరీల అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. అప్లికేషన్ ఫీజు, అలాగే పరీక్ష ఫీజు ఒక్కసారి చెల్లిస్తే మళ్లీ తిరిగి ఇవ్వరు.
How to Apply
అన్ లైన్ అప్లికేషన్ ప్రక్రియ జూలై 15, 2022 ఉదయం 10:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 8, 2022. (సాయంత్రం 5 గంటల వరకు). అర్హులైన అభ్యర్థులు తెలంగాణ ప్రభుత్వ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్ సైట్ (https://mhsrb.telangana.gov.in/) లోకి లాగిన్ అయ్యి నిర్ణీత ఫార్మాట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Certficates to be upload
అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
1. ఆధార్ కార్డ్
2. పదో తరగతి/ ఎస్సెస్సీ సర్టిఫికెట్ (పుట్టిన తేదీ ప్రూప్ కోసం)
3. ఎంబీబీఎస్ మార్కుల మెమో
4. ఎంబీబీఎస్ సర్టిఫికెట్
5. ఎఫ్ఎంజీఈ సర్టిఫికెట్ (విదేశాల్లో చదివిన వారు)
6. తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
7. స్టడీ సర్టిఫికెట్ (ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు)
8. నివాస ధ్రువీకరణ పత్రం (ప్రైవేటులో చదివిన వారు)
9. కులం సర్టిఫికెట్
10. నాన్ క్రిమీలేయర్ సర్టిఫికెట్ (బీసీ అభ్యర్థులు)
11. ఆదాయం మరియు ఆస్తుల సర్టిఫికెట్ (ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు)
12. స్పోర్ట్స్ సర్టిఫికెట్ (స్పోర్ట్స్ కేటగిరీ అభ్యర్థులు)
13. సదరమ్ సర్టిఫికెట్ (దివ్యాంగులు)
14. సర్వీస్ సర్టిఫికెట్ (ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ ఇన్ స్ట్రక్టర్స్, ప్రభుత్వ ఉద్యోగులు)
15. రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, సంతకం (జేపీజీ/జేపీఈజీ/పీఎనీ ఫార్మాట్
Important Dates
అన్ లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం : 15 జూలై , 2022 (ఉదయం 10:30 గంటల నుంచి)
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 14 ఆగస్టు, 2022 (సాయంత్రం 5 గంటల వరకు)
– Jobs in Telangana Health Department