Jobs in Telangana Residentials : తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (TELANGANA RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS RECRUITMENT BOARD) విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తం 9,231 పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేసింది.
ఈ పోస్టులు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ(TSWREIS), తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ(TTWREIS), మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (MJPTBCWREIS) పరిధిలోని డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, స్కూళ్లలో ఉన్నాయి. వీటితో పాటు దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ (DEPDSC&TP) లోనూ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.
Details of Posts
1. లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ (డిగ్రీ కాలేజీల్లో)
2. జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ (జూనియర్ కాలేజీల్లో)
3. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ)
4. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ)
5. లైబ్రేరియన్స్ (స్కూల్స్లో)
6. పీజికల్ డైరెక్టర్స్ (స్కూల్స్లో)
7. ఆర్ట్ టీచర్స్, డ్రాయింగ్ టీచర్స్
8. క్రాఫ్ట్ టీచర్స్, క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్స్
9. మ్యూజిక్ టీచర్స్
Vacancies in Degree Colleges
Lecturer, Physical Director, Librarian ( in Degree Colleges) : డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు మొత్తం 868 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల పే స్కేల్ రూ.58,850 – రూ.1,37,050 లు ఉంది. ఖాళీల వివరాలు సబ్జెక్ట్, సొసైటీల వారీగా ఈ కింది పట్టికలో చూడవచ్చు.
Junior Colleges
జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు మొత్తం 2,008 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల పే స్కేల్ రూ.54,220 – రూ.1,33,630 లు ఉంది. ఖాళీల వివరాలు సబ్జెక్ట్, సొసైటీల వారీగా ఈ కింది పట్టికలో చూడవచ్చు.
Schools
Post Graduation Teacher : పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులు మొత్తం 1,276 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల పే స్కేల్ రూ.45,960 – రూ.1,24,150 లు ఉంది. ఖాళీల వివరాలు సబ్జెక్ట్, సొసైటీల వారీగా ఈ కింది పట్టికలో చూడవచ్చు.
Trained Graduation Teacher : ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులు మొత్తం 4,020 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల పే స్కేల్ గురుకు విద్యా సంస్థల్లో రూ.45,960 – రూ.1,24,150 లు ఉంది. అలాగే, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖలో రూ.45,960 – రూ.1,24,150 లు ఉంది. ఖాళీల వివరాలు సబ్జెక్ట్, సొసైటీల వారీగా ఈ కింది పట్టికలో చూడవచ్చు.
Librarians : స్కూళ్లలో లైబ్రేరియన్ పోస్టులు మొత్తం 434 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల పే స్కేల్ రూ.38,890 – రూ.1,12,510 లు ఉంది. ఖాళీల వివరాలు సొసైటీల వారీగా ఈ కింది పట్టికలో చూడవచ్చు.
Physical Directors : స్కూళ్లలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు మొత్తం 275 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల పే స్కేల్ రూ.42,300 – రూ.1,15,270 లు ఉంది. ఖాళీల వివరాలు సొసైటీల వారీగా ఈ కింది పట్టికలో చూడవచ్చు.
Art and Drawing Teachers
ఆర్ట్ టీచర్స్ పోస్టులు మొత్తం 132 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల పే స్కేల్ రూ.31,040 – రూ.92,050 లు ఉంది. అలాగే, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖలో డ్రాయింగ్ టీచర్ పోస్టులు రెండు (02) ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల పే స్కేల్ రూ.33,750 – రూ.99,310 లు ఉంది. ఖాళీల వివరాలు సొసైటీల వారీగా ఈ కింది పట్టికలో చూడవచ్చు.
Craft Teachers and Craft Instructors
స్కూళ్లలో క్రాఫ్ట్ టీచర్స్ పోస్టులు మొత్తం 88 ఖాళీలు ఉన్నాయి. పే స్కేల్ రూ.31,040 – రూ.92,050 లు ఉంది. DEPDSC&TPలో క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు నాలుగు (04) ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల పే స్కేల్ రూ.33,750 – రూ.99,310 లు ఉంది. ఖాళీల వివరాలు సొసైటీల వారీగా ఈ కింది పట్టికలో చూడవచ్చు.
Music Teachers
Music Teachers : మ్యూజిక్ టీచర్స్ పోస్టులు మొత్తం 123 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాల పే స్కేల్ రూ.31,040 – రూ.92,050 లు ఉంది. అలాగే, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖలో ఒక పోస్టు (01) ఖాళీగా ఉంది. ఈ ఉద్యోగానికి పే స్కేల్ రూ.33,750 – రూ.99,310 లు ఉంది. ఖాళీల వివరాలు సొసైటీల వారీగా ఈ కింది పట్టికలో చూడవచ్చు.
Last Date for Apply
డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు మరియు జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, వయో పరిమితి, రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు ఈ నెల 17వ తేదీ నుంచి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ (http://treirb.telangana.gov.in) లో ఉంచుతారు. మే 17, 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
స్కూల్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులు, లైబ్రేరియన్స్, పీజికల్ డైరెక్టర్స్, ఆర్ట్ టీచర్స్, డ్రాయింగ్ టీచర్స్, క్రాఫ్ట్ టీచర్స్, క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్స్, మ్యూజిక్ టీచర్స్ పోస్టులకు సంబంధించిన వివరాలు ఈ నెల 24వ తేదీన వెబ్సైట్లో పెడతారు. మే 24, 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) పోస్టులకు సంబంధించిన వివరాలు ఈ నెల 28వ తేదీన వెబ్సైట్లో పెడతారు. మే 27, 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
– Jobs in Telangana Residentials