Jobs in TS WDCW : తెలంగాణ రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (Women Development and Child Welfare-WDCW) ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ICDS) స్కీమ్ లో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా మహిళా శిశు సంక్షేమ అధికారి (Women and Child Welfare Officer) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana State Public Service Commission-TSPSC) నోటిఫికేషన్ (Notification No.13/2022) జారీ చేసింది. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO), అడిషనల్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ACDPO), వేర్ హౌజ్ మేనేజర్ (Manager of Warehouse) పోస్టులు ఉన్నాయి. మొత్తం 23 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Details of Post
Post Name : Women and Child Welfare Officer
Reservation Wise Vacancies
Multi Zone-I :
OC(W)-07
EWS(W)-01
BC-A(W)-01
BC-B(W)-01
BC-C(W)-01
SC(W)-03
ST(W)-01
PH(W)-02 (VH-01, HH-CF-01)
Multi Zone-II :
OC(W)-03
BC-A(W)-01
SC(W)-01
PH(W)-01(VH)
Qualifications
- Bachelors Degree in Home Science/ Social Work/ Sociology
- B.Sc (Hons) – Food Science & Nutrition
- B.Sc – Food & Nutrition, Botany / Zoology & Chemistry / Bio – Chemistry
- B.Sc – Applied Nutrition & Public Health, Botany / Zoology & Chemistry
- B.Sc – Clinical Nutrition, Botany / Zoology & Chemistry / Bio-Chemistry
- B.Sc – Applied Nutrition, Botany / Zoology & Chemistry / Bio Chemistry
- B.Sc – Food Sciences & Quality Control, Zoology / Botany & Chemistry/ Bio-Chemistry
- B.Sc – Food Sciences & Management, Botany / Zoology & Chemistry
- B.Sc – Food Technology & Nutrition & Botany / Zoology & Chemistry
- B.Sc – Food Technology & Management, Botany /Zoology & Chemistry / Bio-Chemistry
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థలో పైన పేర్కొన్న అర్హతలలో ఏదైనా ఒకటి కలిగి ఉండాలి.
Age Limit
- జూలై 01, 2022 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
- జూలై 01, 2004 తర్వాత, జూలై 02, 1978కి ముందు జన్మించి ఉండకూడదు.
- మాజీ సైనికులు, ఎన్సీసీ అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ
- ఉద్యోగులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.
Salary
నెలకు రూ.51,320 నుంచి రూ.1.27,310.
Selection Procedure
రాత పరీక్షలో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలు కల్పిస్తారు. రాత పరీక్ష మల్టిపుల్ చాయిస్ అబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్ మెంట్ టెస్ట్ (CBRT) గానీ, ఆఫ్ లైన్ లో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ గానీ నిర్వహిస్తారు. రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సబ్జెక్టుల నుంచి 150 ప్రశ్నలు ఇస్తారు. 150 మార్కులు ఉంటాయి. 150 నిమిషాలలో పరీక్ష
రాయాల్సి ఉంటుంది.
పేపర్-2లో సంబంధిత సబ్జెక్ట్ (డిగ్రీ లెవల్) నుంచి 150 ప్రశ్నలు ఇస్తారు. 300 మార్కులు ఉంటాయి. 150 నిమిషాలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. పేపర్-1, పేపర్-2 ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, తెలుగు భాషలలో ఉంటాయి. రాత పరీక్ష అనంతరం మెరిట్ సాధించిన అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఆహ్వానిస్తారు.
రాత పరీక్ష డిసెంబర్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది. హైదరాబాద్ లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. హాల్ టికెట్లు పరీక్షకు ఏడు రోజుల ముందు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
How to Apply
- అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు, TSPSC వెబ్ సైట్ (www.tspsc.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ముందుగా అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ (One Time Registration-OTR) చేసుకోవాలి.
- ఇప్పటికే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే టీఎస్పీఎస్సీ ఐడీ (TSPSC ID), డేట్ ఆఫ్ బర్త్ (Date of Birth) తో దరఖాస్తు చేసుకోవచ్చు.
- అవసరమైన సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 13, 2022 నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 10, 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Application & Examination Fee
ప్రతి అభ్యర్థి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు నిమిత్తం రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు నిమిత్తం రూ.120 చెల్లించాలి. నిరుద్యోగులు ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
Important Dates
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 13, 2022
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: అక్టోబర్ 10, 2022 (సాయంత్రం 5 గంటల వరకు)
Website: https://www.tspsc.gov.in/
– Jobs in TS WDCW