Junior Assistant Jobs in Singareni : తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ రంగ సంస్థ అయిన ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (The Singareni Collieries Company Limited) జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant GR-II) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Open to All (Local + Non Local) – 08.
OC-3, OC(W)-1, EWS-1, BC(D)-2, SC-1
Local-160+9*
OC-36, OC(W)-21+1*
EWS-11, EWS(W)-5
PWD-5, PWDW-1
BC(A)-8, BC(A) (W)-3,
BC(B)-10+1*, BC(B)(W)-7+1*
BC(C)-1
BC(D)-8, BC(D)(W)-3
BC(E)-6+1*, BC(E)(W)-1
SC-16+4*, SC(W)-9+1*
ST-6, ST(W)-3
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మహబుబాబాద్, జనగామ, హనుమకొండ జిల్లాల అభ్యర్థులు లోకల్ పరిధిలోకి వస్తారు. ఇతర జిల్లాల వారు నాన్ లోకల్ పరిధిలోకి వస్తారు. స్టార్(*) గుర్తులో సూచించినవి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు.
గుర్తింపు పొందిన యూనివర్సిటీలో కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. లేదా ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఆరు నెలల సర్టిఫికెట్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా లేదా డిగ్రీ కోర్సు చేసి ఉండాలి.
దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు జనవరి 1, 2022 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది. ప్రస్తుతం సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులకు వయసు పరిమితి లేదు. అయితే, ఉద్యోగులు అపాయింట్మెంట్ అయిన తర్వాత ఏడాదిలో ఉపరితల గనుల్లో 240 మస్టర్లు. భూగర్భగనుల్లో 190 మస్టర్లు చేసి ఉండాలి.
నెలకు రూ.29460.30. జీతంతో పాటు బోనస్, ఇన్సెంటివ్స్, ఉచిత ఎల్పీజీ సిలిండర్, ఇతర ప్రత్యేకమైన అలవెన్సులు ఉంటాయి.
అర్హులైన అభ్యర్థులు సింగరేణి వెబ్ సైట్ (http://www.scclmines.com)ను ఓపెన్ చేసి అందులోని CAREERSపై క్లిక్ చేసి RECRUITMENT పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఎడమ పక్కన ఉన్న ఆప్షన్లలో Online Registration పై క్లిక్ చేయాలి. అనంతరం కుడి వైపున కనిపించే Click here for Details & Apply Online పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత Fill Online Application పై క్లిక్ చేయాలి. అక్కడ అప్లికేషన్ ప్రాసెసింగ్, పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ, సింగరేణి ఉద్యోగులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ యాప్ లతో కూడా అప్లికేషన్ ఫీజు చెల్లించవచ్చు.
అప్లికేషన్ ప్రాసెసింగ్, పరీక్ష ఫీజు చెల్లించిన తర్వాత అన్ని వివరాలతో అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేయాలి. ఇటీవల తీసిన పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను 10 కేబీ నుంచి 50 కేబీ సైజ్ లో అప్ లోడ్ చేయాలి. అదే విధంగా 10 కేబీ నుంచి 50 కేబీ సైజ్ లో సంతకం అప్ లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోవాలి. ప్రస్తుతం మనుగడలో ఉన్న ఈ-మెయిల్, ఫోన్ నెంబర్ నే అప్లికేషన్ ఫాంలో ఇవ్వాలి. ఈ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాలు మీరు ఇచ్చిన ఈ-మెయిల్, ఫోన్ నెంబర్ కే పంపిస్తారు. కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదు.
రాత పరీక్ష 120 మార్కులకు నిర్వహిస్తారు. అర్థమెటిక్ ఆప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఆప్టిట్యూడ్, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. మల్లిపుల్ చాయిస్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఒక్కో జవాబుకు ఒక మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కట్ చేస్తారు. క్వాలిఫై కావడానికి ఓసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు 30 శాతం, బీసీ అభ్యర్థులు 25 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 15 శాతం మార్కులు సాధించాలి.
ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం, సందేహాల నివృత్తికి 08744-249992, టెక్నికల్ సమస్యల పరిష్కారానికి 9573359292 నెంబర్లకు అన్ని పనిదినాలలో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేయవచ్చు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం చిరునామా :
The Singareni Collieries Company Limited,
Kothagudem Collieries -507101,
Bhadradri Kothagudem District,
Telangana State, India.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 10 జూలై, 2022 (సాయంత్రం 5 వరకు)
– Junior Assistant Jobs in Singareni
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…