LDC Jobs in ECIL : హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Electronics Corporation of India Limited- ECIL) లోయర్ డివిజినల్ క్లర్క్ (Lower Divisional Clerk-LDC) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Advt.No.09/2022) జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు అన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టు పేరు: లోయర్ డివిజినల్ క్లర్క్ (Lower Divisional Clerk-LDC)
మొత్తం పోస్టులు పదకొండు (11). అన్ రిజర్వుడ్ (Unreserved-UR)-05, ఈడబ్ల్యూఎస్ (Economically Weaker Sections-EWS)-01, ఓబీసీ (Other Backward Classes-OBC)-04, ఎస్సీ (Scheduled Castes-SC)-01. భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దివ్యాంగులు, మాజీ సైనికులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.
దరఖాస్తు చేసుకొనే నాటికి అన్ రిజర్వుడ్ అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకూడదు. ECILలో గతంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న
కాంట్రాక్టు లేబర్ కు వయసులో సడలింపు ఇచ్చారు. వారి వయసు దరఖాస్తు చేసుకొనే నాటికి 40 సంవత్సరాలు మించకూడదు. వారు కాంట్రాక్టుకు సంబంధించిన సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది. దివ్యాంగుల వైకల్యం 40 శాతం కంటే ఎక్కువగా ఉండాలి.
అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. టైప్ రైటింగ్ లో నిమిషానికి 40 పదాలు టైప్ చేయగలగాలి. కంప్యూటర్ ఆపరేటింగ్ లో సర్టిఫికెట్ కూడా ఉండాలి. ఎస్సీ, ఎస్టీలు పాసైనా సరిపోతుంది. అలాగే, టైప్ రైటింగ్ లో నిమిషానికి 25 పదాలు టైప్ చేయగలగాలి.
నెలకు రూ.20,480. ప్రతి సంవత్సరం 3 శాతం ఇంక్రిమెంట్ ఉంటుంది. వేతనంతో పాటు పీఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి.
అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ మోడ్ లో చెల్లించవచ్చు. అన్ రిజర్వుడ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 అప్లికేషన్
ఫీజు చెల్లించాలి. ECIL వెబ్ సైట్ లో పొందుపరిచిన లింక్ ల ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఒక్కసారి చెల్లించిన ఫీజు ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఇవ్వబడదు.
అర్హులైన అభ్యర్థులు మరియు ECIL ఇంటర్నల్ అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ECIL వెబ్ సైట్ (http://careers.ecil.co.in, www.ecil.co.in) లలోకి లాగిన్ అయ్యి సంబంధిత నోటిఫికేషన్ (Advt.No.09/2022)పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, సంతకం జేపీజీ ఫార్మాట్ లో అప్ లోడ్ చేయాలి. ఫొటో 4×3 సెం.మీ. సైజ్ లో బ్లూ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి. సైజ్ 100 కేబీలోపు ఉండాలి. సంతకం 50 కేబీలోపు ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీ 25 జూన్, 2022 (మధ్యాహ్నం 2గంటల వరకు). దరఖాస్తు చేసిన తర్వాత అభ్యర్థులు ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోవాలి.
అభ్యర్థులు సరిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ ఫాం, ఫీజు చెల్లించిన రశీదు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, అనుభవం, కులం, వైకల్య సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అందజేయాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: 25 జూన్, 2022 (మధ్యాహ్నం 2 గంటల వరకు)
– LDC Jobs in ECIL
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…