Medical Consultant Jobs in SCCLA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Medical Consultant Jobs in SCCL : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ రంగ సంస్థ అయిన ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (The Singareni Collieries Company Limited-SCCL) కాంట్రాక్టు ప్రాతిపదికన (Contract Basis) జనరల్ మెడికల్ కన్సల్టెంట్ (General Medical Consultant) పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్ జారీ (Employment Notification No.03/2022) చేసింది. మొత్తం 30 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Salary : నెలకు రూ.85,000. లేదా గంటకు రూ.400

Vacancies

మొత్తం – 30 (అన్ రిజర్వుడ్-01, లోకల్-29)
Unreserved – 01 (OC(W))
Local – 29
OC-07
OC(W)-04
BC(A)-02, BC(A)(W)-01
BC(B)-01, BC(B)(W)-01
BC(C)-01)
BC(D)(W)-01
BC(E)(W)-01
SC-03, SC(W)-02
ST-01, ST(W)-01
EWS-02, EWS(W)-01

Qualification & Experience

MBBS (Bachelor of Medicine, Bachelor of Surgery) ఉత్తీర్ణులై, తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (Telangana State Medical Council) లో రిజిస్ట్రేషన్ చేసుకొన్న వారు అర్హులు.
కనీసం మూడు (03) సంవత్సరాల అనుభవం ఉండాలి.
ప్రభుత్వ/ఎసీసీఎల్/పీఎస్య (Govt/SCCL/PSU) లలో పనిచేసి పదవీ విరమణ చేసిన డాక్టర్లు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.

How to Apply

అర్హులైన అభ్యర్థులు సింగరేణి వెబ్ సైట్ (http://www.scclmines.com)ను ఓపెన్ చేసి అందులోని CAREERSపై క్లిక్ చేసి RECRUITMENT పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కుడి పక్కన ఉన్న Click here for Details & Apply Online పై క్లిక్ చేయాలి. అనంతరం కుడి వైపున కనిపించే Click here for Details & Apply Online పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత Apply Online పై క్లిక్ చేయాలి. అప్పుడు ఆన్ లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అందులోని వివరాలన్నీ ఎంటర్ చేసి, ఇటీవల తీసిన పాస్ పోర్ట్ సైజ్ ఫొటో కింద సంతకం చేసి దానిని స్కాన్ చేసి (10 కేబీ నుంచి 50 కేబీ నైజ్) అప్ లోడ్ చేసి అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోవాలి. ఇంటర్వ్యూ సమయంలో దానిని సమర్పించాల్సి ఉంటుంది.

Important Points
ఇవి కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులు.
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం పాటు పనిచేయాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు టీఏ, డీఏ లాంటివి ఇవ్వరు. అభ్యర్థులు సొంత ఖర్చులతో హాజరు కావాల్సి ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మహబుబాబాద్, జనగామ, హనుమకొండ జిల్లాల అభ్యర్థులు 29 (లోకల్)
పోస్టులకు అర్హులు. ఒక పోస్టు (అన్ రిజర్వుడ్) నాన్ లోకల్ పరిధిలోకి వస్తుంది. ఈ పోస్టులకు లోకల్ తో పాటు నాల్ లోకల్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Documents to be Produced at the Interview

ఇంటర్వ్యూ సమయంలో ఈ క్రింది ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాలి.
1. పదో తరగతి, ఎంబీబీఎస్, తెలంగాణ వైద్య మండలి రిజిస్ట్రేషన్ సర్టిఫిటికెట్
2. కులం సర్టిఫికెట్ (నోటిఫికేషన్ తేదీకి 6 నెలల లోపు తీసుకొని ఉండాలి)
3. స్టడీ సర్టిఫికెట్లు (1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు)
4. ఆదాయం మరియు ఆస్తుల సర్టిఫికెట్ (ఈడబ్యూఎస్ అభ్యర్థులు)
5. సర్వీస్ సర్టిఫికెట్ (ప్రభుత్వ/ఎసీసీఎల్/పీఎసూలలో పనిచేసి పదవీ విరమణ చేసిన డాక్టర్లు
6. అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్
7. ఆన్ లైన్ లో సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫాం
8. పై అన్ని సర్టిఫికెట్లు రెండు నెట్లు జిరాక్స్ కాపీలు

Important Dates

ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: ఆగస్టు 13, 2022 (సాయంత్రం 5 గంటల వరకు)
ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ ఆగస్టు 16, 2022 (ఉదయం 9:30 గంటల నుంచి)

ఇంటర్వ్యూ నిర్వహించు స్థలం:
O/o. Director (PA&W)
The SCCL, Head Office,
Bhadradri Kothagudem (Dist).

– Medical Consultant Jobs in SCCL