Nursing Assistant Jobs in Army : ఇండియన్ ఆర్మీ (Indian Army) కి చెందిన చెన్నై జోనల్ రిక్రూటింగ్ ఆఫీస్ (Zonal Recruiting Office(ZRO), Chennai) 2023–24 సంవత్సరానికి సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/ నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ (Soldier Technical Nursing Assistant/ Nursing Assistant Veterinary) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పెళ్లి కాని పురుష అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, రిక్రూట్మెంట్ ర్యాలీ (ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్), మెడికల్ టెస్టులు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించి అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Posts & Categories
1. సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/ నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ (Soldier Technical Nursing Assistant/ Nursing Assistant Veterinary)
పై పోస్టులకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి (కరైకల్, యానాం & పుదుచ్చేరి) మరియు అండమాన్ & నికోబార్ ద్వీపం (నికోబార్, నార్త్ & మిడిల్ అండమాన్ మరియు దక్షిణ అండమాన్)కు చెందిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Qualification
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. అలాగే, ప్రతి సబ్జెక్టులో 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి. లేదా
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. అలాగే, ప్రతి సబ్జెక్టులో 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
Age Limit
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు పదిహేడున్నర సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అక్టోబర్ 01, 2000 నుంచి ఏప్రిల్ 01, 2006 మధ్య జన్మించిన వారు అర్హులు.
Physical standards
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి చెందిన అభ్యర్థుల ఎత్తు 165 సెం.మీ, ఛాతీ 77 సెం.మీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ విస్తరించాలి.
How to Apply
- ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు మార్చి 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- www.joinindianarmy.nic.in ను ఓపెన్ చేసి అందులో Agnipath పై క్లిక్ చేయాలి.
- అందులో ముందుగా ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకోవాలి.
- పరీక్ష ఫీజు నిమిత్తం రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
- ఏప్రిల్ 17 నుంచి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షలు ఉంటాయి.
- వీటిలో అర్హత సాధించిన వారికి శారీరక సామర్ధ్య, వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 044-25675262 (Zonal Recruiting Office (ZRO), Chennai) నెంబర్కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.
Website : www.joinindianarmy.nic.in
– Nursing Assistant Jobs in Army