Govt Job

Nursing Assistant Jobs in Indian Army

Nursing Assistant Jobs in Army : ఇండియన్​ ఆర్మీ (Indian Army) కి చెందిన చెన్నై జోనల్​ రిక్రూటింగ్​ ఆఫీస్ (Zonal Recruiting Office(ZRO), Chennai) 2023–24 సంవత్సరానికి సోల్జర్​ టెక్నికల్​ నర్సింగ్​ అసిస్టెంట్​/ నర్సింగ్​ అసిస్టెంట్​ వెటర్నరీ (Soldier Technical Nursing Assistant/ Nursing Assistant Veterinary) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ జారీ చేసింది. పెళ్లి కాని పురుష అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్​లైన్​ కంప్యూటర్​ బేస్డ్​ రాత పరీక్ష, రిక్రూట్​మెంట్​ ర్యాలీ (ఫిజికల్​ ఫిట్​నెస్​ టెస్ట్​, ఫిజికల్​ మెజర్​మెంట్​ టెస్ట్​), మెడికల్​ టెస్టులు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్​ నిర్వహించి అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Posts & Categories

1. సోల్జర్​ టెక్నికల్​ నర్సింగ్​ అసిస్టెంట్​/ నర్సింగ్​ అసిస్టెంట్​ వెటర్నరీ (Soldier Technical Nursing Assistant/ Nursing Assistant Veterinary)

పై పోస్టులకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి (కరైకల్, యానాం & పుదుచ్చేరి) మరియు అండమాన్ & నికోబార్ ద్వీపం (నికోబార్, నార్త్ & మిడిల్ అండమాన్ మరియు దక్షిణ అండమాన్)కు చెందిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Qualification

ఫిజిక్స్​, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్​ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్​ 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. అలాగే, ప్రతి సబ్జెక్టులో 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి. లేదా

ఫిజిక్స్​, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ ఇంగ్లిష్​ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్​ 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. అలాగే, ప్రతి సబ్జెక్టులో 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి.

Age Limit

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు పదిహేడున్నర సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. అక్టోబర్​ 01, 2000 నుంచి ఏప్రిల్​ 01, 2006 మధ్య జన్మించిన వారు అర్హులు.

Physical standards

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి చెందిన అభ్యర్థుల ఎత్తు 165 సెం.మీ, ఛాతీ 77 సెం.మీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ విస్తరించాలి.

How to Apply

  • ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు మార్చి 15 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • www.joinindianarmy.nic.in ను ఓపెన్​ చేసి అందులో Agnipath పై క్లిక్​ చేయాలి.
  • అందులో ముందుగా ఎలిజిబిలిటీ చెక్​ చేసుకొని ఆ తర్వాత రిజిస్ట్రేషన్​ చేసుకొని అప్లై చేసుకోవాలి.
  • పరీక్ష ఫీజు నిమిత్తం రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
  • ఏప్రిల్ 17 నుంచి ఆన్​లైన్​ కంప్యూటర్ బేస్డ్​ రాత పరీక్షలు ఉంటాయి.
  • వీటిలో అర్హత సాధించిన వారికి శారీరక సామర్ధ్య, వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 044-25675262 (Zonal Recruiting Office (ZRO), Chennai) నెంబర్​కు కాల్​ చేసి తెలుసుకోవచ్చు.

Website : www.joinindianarmy.nic.in

– Nursing Assistant Jobs in Army

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago