Govt Job

Nursing Jobs in Japan

Nursing Jobs in Japan : జపాన్ (Japan) దేశంలో నర్సింగ్ ఉద్యోగాల (Nursing Jobs) కోసం తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (Telangana Overseas Manpower Company Ltd-TOMCOM) నోటిఫికేషన్ జారీ చేసింది. రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఈ శిక్షణకు ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో ఎంపికైన వారికి జపనీస్ భాష, ఆ దేశంలో నర్సింగ్ డ్యూటీకి సంబంధించిన శిక్షణ ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసినవారిని జపాన్ కు పంపిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Details of Job

  • Nursing Care/ Caretaker for elderly patients
  • జపాన్ లోని హాస్పిటల్స్, నర్సింగ్ హోంలలో పనిచేయాల్సి ఉంటుంది.

Qualification

ప్రభుత్వ గుర్తింపు పొందిన నర్సింగ్ కాలేజీలో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (GNM), B.Sc (Nursing) ఉత్తీర్ణులైన వారు అర్హులు. మెడికల్లీ ఫిట్ ఉండాలి. పాస్ పోర్ట్ కలిగి ఉండాలి.

Annual Salary Package

  • 24,00,00 YEN to 28,00,000 YEN
  • సంవత్సరానికి రూ.14 లక్షల నుంచి రూ.28 లక్షలు చెల్లిస్తారు.
  • నిబంధనల మేరకు ఇతర అలవెన్సులు ఉంటాయి.
  • ఐదు (05) సంవత్సరాల వరకు వర్క్ పర్మిట్ ఉంటుంది.

How to Apply

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (Tomcom) వెబ్ సైట్ (http://tomcom.telangana.gov.in) ఓపెన్ చేసి అందులో (Online Registration) పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫాం వస్తుంది. అందులోని
వివరాలన్నీ నింపాలి.

Selecetion Procedure

అన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులలో అర్హులైన వారిని రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. వారికి డిసెంబర్ 15, 2022న ఉదయం 11 గంటలకు పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఎంపికైన వారికి శిక్షణ ఇస్తారు.

Special Traning Course

  • రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు జపాన్ దేశానికి వెళ్లేందుకు కావాల్సిన శిక్షణ ఇస్తారు.
  • జపనీస్ భాష, ఆ దేశంలో నర్సింగ్ డ్యూటీకి సంబంధించిన శిక్షణ ఇస్తారు.
  • Japanese Proficiency Test, JPT Level 3 లో శిక్షణ ఉంటుంది.
  • ఇది పూర్తిగా రెసిడెన్షియల్ శిక్షణ.
  • హైదరాబాద్ లోని మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్ లో శిక్షణ ఇస్తారు.
  • శిక్షణ డిసెంబర్ నెలలోనే ఉండొచ్చు.
  • సీట్లు పరిమిత సంఖ్యలోనే ఉంటాయి.

Important Points

జపాన్ లో నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (Tomcom) ఈ శిక్షణ
ఇస్తోంది.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా 040-2334 2040, 7997973358, 9100798204, 9908830438 నెంబర్లకు ఫోన్ చేస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు.
జపాన్ లో ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు, ఇక్కడ తీసుకోబోయే శిక్షణకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే అప్లై చేసుకో
వడం మంచిది.

– Nursing Jobs in Japan

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago