Nursing Officer JobsA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Nursing Officer in AIIMS : ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​(All India Institute of Medical Sciences-AIIMS)తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్​ లలో నర్సింగ్​ ఆఫీసర్ (Nursing Officer)​ పోస్టుల భర్తీకి సంబంధించిన నర్సింగ్​ ఆఫీసర్​ రిక్రూట్​మెంట్​ కామన్​ ఎలిజిబిలిటీ టెస్ట్​ (నార్​సెట్​)‌‌-5 (Nursing Officer Recruitment Common Eligibility Test (NORCET)-5) ప్రకటన విడుదలైంది. ఈ టెస్ట్​లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​ తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్​లలో ఖాళీగా ఉన్న నర్సింగ్​ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. ప్రిలిమినరీ, మెయిన్స్​ పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

AIIMS in India

01. ఎయిమ్స్ భటిండా
02. భోపాల్
03. భువనేశ్వర్
04. బీబీనగర్
05. బిలాస్​ పూర్
06. దేవఘర్
07. గోరఖ్​పూర్
08. జోధ్​పూర్​
09. కల్యాణి
10. మంగళగిరి
11. నాగ్​పూర్​
12. రాయ్ బరేలీ
13. న్యూఢిల్లీ
14. పట్నా
15. రాయ్​పూర్
16. రాజ్​కోట్
17. రిషికేశ్
18. విజయ్​పూర్

Qualification

ఇండియన్​ నర్సింగ్​ కౌన్సిల్​ లేదా స్టేట్​ నర్సింగ్​ కౌన్సిల్​ గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్​ లేదా యూనివర్సిటీలో B.Sc. (Hons.) Nursing లేదా B.Sc. Nursing లేదా B.Sc. (Post Certificate) లేదా Post-Basic B.Sc. Nursing ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, స్టేట్​ లేదా ఇండియన్​ నర్సింగ్​ కౌన్సిల్​లో నర్స్​ అండ్​ మిడ్​వైఫ్​గా రిజిస్టర్​ అయి ఉండాలి.

లేదా.. ఇండియన్​ నర్సింగ్​ కౌన్సిల్​ లేదా స్టేట్​ నర్సింగ్​ కౌన్సిల్​ గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్​ లేదా బోర్డు లేదా కౌన్సిల్​లో General Nursing Midwifery (GNM) లో డిప్లొమా చేసి ఉండాలి. అలాగే, స్టేట్​ లేదా ఇండియన్​ నర్సింగ్​ కౌన్సిల్​లో నర్స్​ అండ్​ మిడ్​వైఫ్​గా రిజిస్టర్​ అయి ఉండాలి. వీటితో పాటు కనీసం 50 పడకల ఆసుపత్రిలో రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.

Age Limit

అభ్యర్థుల వయసు దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడు సంవత్సరాలు, మాజీ సైనికులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, దివ్యాంగులకు పది సంవత్సరాల సడలింపు ఉంది.

Salary

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.9,300 – రూ.34,800తో పాటు రూ.4,600 గ్రేడ్ పే చెల్లిస్తారు.

How to Apply

అభ్యర్థులు నార్​సెట్​–5 కు ఆన్​లైన్​లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా ఆలిండియా ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​ కు చెందిన వెబ్​సైట్​ (https://www.aiimsexams.ac.in/) ను ఓపెన్​ చేయాలి. అందులో అందులో Recruitments పై క్లిక్​ చేయాలి. అందులో Nursing Officer పై క్లిక్​ చేయాలి. దాంట్లో Online registration For Nursing Officer Recruitment Common Eligibility Test(NORCET-5) పై క్లిక్​ చేసి అందులో New Registration పై క్లిక్​ చేసి అందులో వివరాలన్నీ ఎంటర్​ చేసి రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి.

అప్లికేషన్​ ఫీజు నిమిత్తం జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.3వేలు, ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.2,400 చెల్లించాలి. పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రిజల్ట్స్​ ప్రకటించిన అనంతరం ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు రీఫండ్​ చేస్తారు.

Selection Procedure

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను నార్​సెట్​‌‌-4లో సాధించిన మార్కుల్లో మెరిట్​, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Scheme of Examination

పరీక్ష ఆన్​లైన్​లో (కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్ (CBT) ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఆబ్జెక్టివ్ విధానంలో 200 ప్రశ్నలు ఇస్తారు. ఒక జవాబుకు ఒక మార్కు చొప్పున 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. నర్సింగ్​ సబ్జెక్ట్​ నుంచి 180 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్ ఆప్టిట్యూడ్ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. నెగెటివ్​ మార్కింగ్​ కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు కట్​ చేస్తారు.

ఈ ఎగ్జామ్​లో క్వాలిఫై కావడానికి అన్​రిజర్వుడ్​, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఓబీసీలు 45 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి. దివ్యాంగులకు 5 శాతం సడలింపు ఉంటుంది.

Important Dates

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 25, 2023 సాయంత్రం 5 గంటల వరకు
దరఖాస్తు సవరణ: 26.08.2023 నుంచి 28.08.2023 వరకు.
సీబీటీ ప్రిలిమినరీ పరీక్ష : 17.09.2023.
సీబీటీ మెయిన్స్ పరీక్ష : 07.10.2023.

– Nursing Officer in AIIMS