Nursing Officer Jobs in AIIMS : ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(All India Institute of Medical Sciences-AIIMS)తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ లలో నర్సింగ్ ఆఫీసర్ (Nursing Officer) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం 3,055 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్రంలోని బీబీనగర్ ఎయిమ్స్‌లో 150 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్‌లో 117 పోస్టులు ఉన్నాయి. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్సెట్)-4 (Nursing Officer Recruitment Common Eligibility Test (NORCET)-4)ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. ఎయిమ్స్ భటిండా – 142
2. భోపాల్ – 51
3. భువనేశ్వర్ – 169
4. బీబీనగర్ – 150
5. బిలాస్పూర్ – 178
6. దేవఘర్- 100
7. గోరఖ్‌పూర్ – 121
8. జోధ్‌పూర్ – 300
9. కల్యాణి – 24
10. మంగళగిరి – 117
11. నాగ్‌పూర్ – 87
12. రాయ్ బరేలీ- 77
13. న్యూఢిల్లీ- 620
14. పట్నా- 200
15. రాయ్‌పూర్ – 150
16. రాజ్‌కోట్- 100
17. రిషికేశ్- 289
18. విజయ్‌పూర్ – 180
Bibinagar AIIMS :
Unreserved (UR) – 60
Female – 45
Male – 11
Female (PwBD) – 03
Male (PwBD) – 01
OBC (Non Creamy Layer) – 41
Female – 32
Male – 07
Female (PwBD) – 01
Male (PwBD) – 01
Scheduled Castes (SC) – 23
Female – 18
Male – 05
Scheduled Tribes (ST) – 11
Female – 09
Male – 02
Economically Weaker Section (EWS) – 15
Female – 12
Male – 03
Mangalagiri AIIMS :
UR – 48
Female – 38
Male – 09
Female (PwBD) – 01
OBC (NCL) – 31
Female – 23
Male – 06
Female (PwBD) – 02
SC – 18
Female – 14
Male – 04
ST – 09
Female – 07
Male – 02
EWS – 11
Female – 08
Male – 02
Female (PwBD) – 01
ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ లేదా యూనివర్సిటీలో B.Sc. (Hons.) Nursing లేదా B.Sc. Nursing లేదా B.Sc. (Post Certificate) లేదా Post-Basic B.Sc. Nursing ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో నర్స్ అండ్ మిడ్‌వైఫ్‌గా రిజిస్టర్ అయి ఉండాలి.
లేదా.. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ లేదా బోర్డు లేదా కౌన్సిల్లో General Nursing Midwifery (GNM) లో డిప్లొమా చేసి ఉండాలి. అలాగే, స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో నర్స్ అండ్ మిడ్‌వైఫ్‌గా రిజిస్టర్ అయి ఉండాలి. వీటితో పాటు కనీసం 50 పడకల ఆసుపత్రిలో రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
అభ్యర్థుల వయసు దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడు సంవత్సరాలు, మాజీ సైనికులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, దివ్యాంగులకు పది సంవత్సరాల సడలింపు ఉంది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.9,300 – రూ.34,800తో పాటు రూ.4,600 గ్రేడ్ పే చెల్లిస్తారు.
అభ్యర్థులు నార్సెట్–4 కు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన వెబ్సైట్ (https://www.aiimsexams.ac.in/) ను ఓపెన్ చేయాలి. అందులో అందులో Recruitments పై క్లిక్ చేయాలి. అందులో Nursing Officer పై క్లిక్ చేయాలి. దాంట్లో Online registration For Nursing Officer Recruitment Common Eligibility Test(NORCET-4) పై క్లిక్ చేసి అందులో New Registration పై క్లిక్ చేసి అందులో వివరాలన్నీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు నిమిత్తం జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.3వేలు, ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.2,400 చెల్లించాలి. పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రిజల్ట్స్ ప్రకటించిన అనంతరం ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు రీఫండ్ చేస్తారు.
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను నార్సెట్-4లో సాధించిన మార్కుల్లో మెరిట్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష ఆన్లైన్లో (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఆబ్జెక్టివ్ విధానంలో 200 ప్రశ్నలు ఇస్తారు. ఒక జవాబుకు ఒక మార్కు చొప్పున 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. నర్సింగ్ సబ్జెక్ట్ నుంచి 180 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్ ఆప్టిట్యూడ్ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు కట్ చేస్తారు.
ఈ ఎగ్జామ్‌లో క్వాలిఫై కావడానికి అన్‌రిజర్వుడ్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఓబీసీలు 45 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి. దివ్యాంగులకు 5 శాతం సడలింపు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 05, 2023 సాయంత్రం 5 గంటల వరకు
దరఖాస్తు సవరణ: 06.05.2023 నుంచి 08.05.2023 వరకు.
రాత పరీక్ష (సీబీటీ) తేదీ: 03.06.2023.
– Nursing Officer Jobs in AIIMS
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…