Nursing Officer Jobs in RIMS : మణిపూర్ (Manipur) రాష్ట్రంలోని ఇంఫాల్ (Imphal) సిటీలో గల రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Regional Institute of Medical Sciences – RIMS)లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ (Direct Recruitment) ప్రాతిపదికన నర్సింగ్ ఆఫీసర్ (Nursing Officer) ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం 54 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. భారత ప్రభుత్వంలోని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ.
పోస్ట్ పేరు : నర్సింగ్ ఆఫీసర్
మొత్తం పోస్టుల సంఖ్య : యాభై నాలుగు (54)
అన్‌రిజర్వుడ్ (UR) – 31
అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (OBC) – 11
షెడ్యూల్డ్ క్యాస్ట్ (SC) – 09
షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ST) – 03
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,900 వరకు చెల్లిస్తారు. (Level – 7 of 7th CPC)
గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు/కౌన్సిల్ నుంచి Pre-University Course (PUC) లేదా stands for Higher Secondary School Leaving Certificate (HSSLC) లేదా ఇంర్మీడియెట్ లేదా దానికి సమానమైన కోర్సు చదివి ఉండాలి. అలాగే, గుర్తింపు పొందిన నర్సింగ్ స్కూల్/ఇన్‌స్టిట్యూట్ లో జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీ (GNM)లో డిప్లొమా లేదా దానికి సమానమైన కోర్సు పూర్తి చేసి ఉండాలి. అదే విధంగా అభ్యర్థి తప్పనిసరిగా ఏదైనా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో “ఎ గ్రేడ్” నర్సుగా రిజిస్టర్ చేసుకొని ఉండాలి. అలాగే, అభ్యర్థులు భారత పౌరులై ఉండాలి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. ప్రస్తుతం రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న అన్‌రిజర్వుడ్ (UR) అభ్యర్థులకు 45 సంవత్సరాల వరకు, ఇతర వెనుకబడిన తరగతులకు (OBC) చెందిన అభ్యర్థులకు 48 సంవత్సరాల వరకు మరియు షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగల (SC/ST)కు చెందిన అభ్యర్థులకు 50 సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది.
అర్హతలు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) వెబ్సైట్ (http://www.rims.edu.in/) ను ఓపెన్ చేయాలి. అందులో కుడి వైపున ఉన్న Recruitment పై క్లిక్ చేయాలి. అందులో కొంచెం కిందికి స్క్రోల్ చేసి ADVERTISEMENT FPR THE POST OF NURSING OFFICER పై క్లిక్ చేయాలి. అందులో Application Form పై క్లిక్ చేసి దానిని డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో వివరాలన్నీ నింపాలి. దానికి విద్యార్హతల సర్టిఫికెట్లు, పుట్టిన తేదీ సర్టిఫికెట్, కేటగిరీ (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ) సర్టిఫికెట్లు, రెండు రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు జతచేయాలి. అలాగే, అన్‌రిజర్వుడ్, ఓబీసీ అభ్యర్థులు ఇంఫాల్‌లో చెల్లుబాటు అయ్యేలా Director, Rims పేరిట రూ.500 డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) తీయాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు డీడీ తీయాల్సిన అవసరం లేదు. ఈ డీడీని అప్లికేషన్ ఫాంకు జతచేసి ఆ మొత్తం సర్టిఫికెట్లను మార్చి 28వ తేదీ లోపు Regional Institute of Medical Sciences (RIMS), Lamphelpat, Imphal – 795004, Manipur చిరునామాకు పంపించాలి.
– Nursing Officer Jobs in RIMS
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…