Nursing Officer Jobs : భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన పుదుచ్చేరిలోని జవహర్ లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (Jawaharlal Institute of Postgraduate Medical Education and Research-JIPMER) నర్సింగ్ ఆఫీసర్ (Nursing Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Admn-I/DR/1(3)/2022) జారీ చేసింది. మొత్తం 433 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం పోస్టులు – 433
అన్ రిజర్వుడ్ (UR) – 175
ఈడబ్ల్యూఎస్ (EWS) – 43
ఓబీసీ (OBC) – 116
ఎస్సీ (SC) – 66
ఎస్టీ (ST) – 33
ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్/యూనివర్సిటీలో B.Sc.(Honours) Nursing/ B.Sc. Nursing చేసిన వారు అర్హులు.
అలాగే, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్/యూనివర్సిటీలో B.Sc. (Post-certificate) / Post Basic B.Sc. Nursing చేసిన వారు కూడా అర్హులే. వీరు ఇండియన్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో నర్స్ అండ్ మిడ్ వైఫ్ గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
అలాగే, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్/ బోర్డులో Diploma in General Nursing and Midwifery (GNM) చేసి, ఇండియన్/ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో నర్స్ అండ్ మిడ్ వైఫ్ గా రిజిస్ట్రేషన్ చేసుకొని 50 పడకల ఆసుపత్రిలో రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం: నెలకు రూ.44,900 (Level 7 of Pay Matrix of 7th CPC)
ఈ పోస్టులకు అభ్యర్థుల వయసు డిసెంబర్ 01, 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదు (05) సంవత్సరాలు, ఓబీసీలకు మూడు (03) సంవత్సరాలు, PWBD (UR/EWS) – పది (10) సంవత్సరాలు, PWBD + OBC – పదమూడు (13) సంవత్సరాలు, PWBD + SC/ST – పదమూడు (13) సంవత్సరాల సడలింపు ఉంది.
ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు JIPMER వెబ్ సైట్ (https:://www.jipmer.edu.in) ను ఓపెన్ చేసి “Recruitment To The Post Of Nursing Officer, JIPMER-Puducherry” లింక్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత Application Apply Online link లింక్ పై క్లిక్ చేయాలి. అందులో వివరాలన్నీ నింపి అన్ లైన్ అప్లికేషన్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అన్ లైన్ అప్లికేషన్ ప్రిక్రియ నవంబర్ 07, 2022 నుంచి ప్రారంభం అవుతుంది.
అన్ లైన్ అప్లికేషన్ ప్రక్రియలో అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాలి. అన్ రిజర్వుడ్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులు రూ.1500, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.1200 చెల్లించాల్సి దివ్యాంగులు (పీడబ్ల్యూబీడీ) ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే చెల్లించాలి. అప్లికేషన్ హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం లేదు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షకు ఆహ్వానిస్తారు.
ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాల కోసం క్రింది నెంబర్లు.
ఈ-మెయిన్ ను సంప్రదించవచ్చు.
ఫోన్ నెంబర్స్ :
0413-2296022 (అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్)
+91-7353945551 (ఫీజు చెల్లింపు, ఇతర టెక్నికల్ సమస్యల పరిష్కారం కోసం)
(పై ఫోన్ నెంబర్లకు ఉదయం 9 గంటల నుంచి ఒంటి గంట వరకు, 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు మాత్రమే కాల్ చేయాలి.)
ఈ-మెయిల్ : jipmergrpbandc@gmail.com, admn 1recttbc@gmail.com
చిరునామా:
The Deputy Director (Admn.),
Administration – I (Rect. Cell)
JIPMER Administrative Block,
Dhanvantri Nagar P.O,
Puducherry – 605006.
Website : https:://www.jipmer.edu.in
– Nursing Officer Jobs
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…