Nursing Officer X Ray Technician Jobs : భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన పుదుచ్చేరిలోని జవహర్ లాల్ ఇనిస్టిట్యూట్ అఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (Jawaharlal Institute of Postgraduate Medical Education and Research-JIPMER) నర్సింగ్ ఆఫీసర్ (Nursing Officer), ఎక్స్ రే టెక్నీషియన్ (X-Ray Technician), రెస్పిరేటరీ లాబోరేటరీ టెక్నీషియన్ (Respiratory Laboratory Technician) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Admn-I/DR/1(2)/2022) జారీ చేసింది. షార్ట్ లిస్టింగ్, ఆన్ లైన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
1. నర్సింగ్ ఆఫీసర్ (Nursing Officer)
2. ఎక్స్ రే టెక్నీషియన్ (X-Ray Technician (Radiotherapy))
3. ఎక్స్ రే టెక్నీషియన్ (X-Ray Technician (Radio-Diagnosis))
4. రెస్పిరేటరీ లాబోరేటరీ టెక్నీషియన్ (Respiratory Laboratory Technician)
పోస్టు కోడ్: 212022
పోస్టు పేరు: నర్సింగ్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: మొత్తం 128 (అన్ రిజర్వుడ్-65, ఈడబ్ల్యూఎస్-16, ఓబీసీ-24, ఎస్సీ-10, ఎస్టీ-13)
జీతం: నెలకు రూ.44,900 (Level 7 of Pay Matrix of 7th CPC)
వయసు: ఆగస్టు 11, 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హతలు: ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్/యూనివర్సిటీలో B.Sc.(Honours) Nursing / B.Sc. Nursing చేసిన వారు అర్హులు.
అలాగే, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్/యూనివర్సిటీలో B.Sc. (Post-certificate) / Post Basic B.Sc. Nursing చేసిన వారు కూడా అర్హులే. వీరు ఇండియన్/ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో నర్స్ అండ్ మిడ్ వైఫ్ గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
అలాగే, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్/బోర్డులో Diplom a in General Nursing and Midwifery (GNM) చేసి, ఇండియన్/ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో నర్స్ అండ్ మిడ్ వైఫ్ గా రిజిస్ట్రేషన్ చేసుకొని 50 పడకల ఆసుపత్రిలో రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
(ఇవి గ్రూప్-బీ పోస్టులు. 80 శాతం పోస్టులు మహిళలకు, 20 శాతం పోస్టులు పురుషులకు కేటాయించారు. 128 పోస్టులలో 8 పోస్టులు దివ్యాంగులకు (పీడబ్ల్యూబీడీ) కేటాయించారు.)
పోస్టు కోడ్: 222022
పోస్టు పేరు: ఎక్స్ రే టెక్నీషియన్ (రేడియోథెరపీ)
పోస్టుల సంఖ్య: మొత్తం మూడు (03) (ఈడబ్ల్యూఎస్-1, ఎస్సీ-1, ఎస్టీ-1)
జీతం: నెలకు రూ.35,400 (Level 6 of Pay Matrix of 7th CPC)
వయసు: ఆగస్టు 11, 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇనిస్టిట్యూట్ లో రేడియేషన్ టెక్నాలజీలో బీఎస్సీ లేదా రేడియోథెరపీ టెక్నాలజీలో బీఎస్సీ (B.Sc. in Radiation Technology or B.Sc. in Radiotherapy Technology) చేసిన వారు అర్హులు.
అలాగే, AERB e-LORA రిజిస్ట్రేషన్ తో పాటు రేడియోథెరపీ పరికరాల నిర్వహణలో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
పోసు కోడ్: 232022
పోస్టు పేరు: ఎక్స్ రే టెక్నీషియన్ (రేడియో డయాగ్నోసిస్)
పోస్టుల సంఖ్య: మొత్తం ఆరు (06) (ఈడబ్ల్యూఎస్-3, ఎస్సీ-1, ఎస్టీ-2)
జీతం: నెలకు రూ.35,400 (Level 6 of Pay Matrix of 7th CPC)
వయసు: అగస్టు 11, 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇనిస్టిట్యూట్ లో రేడియోగ్రఫీ/ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీలో బీఎస్సీ (B.Sc. in Radiography / Medical Imaging Technology) చేసిన వారు, లేదా అందుకు సమానమైన మూడు సంవత్సరాల కోర్సున చేసిన వారు అర్హులు.
అలాగే, ఇనిస్టిట్యూట్ / హాస్పిటల్/ ఇమేజ్ సెంటర్ లో రేడియో డయాగ్నోసిస్ పరికరాల నిర్వహణలో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
(ఇవి గ్రూప్-బీ పోస్టులు. ఆరు పోస్టులలో ఒక పోస్టు దివ్యాంగులకు (పీడబ్ల్యూబీడీ) కేటాయించారు.)
పోస్టు కోడ్: 242022
పోస్టు పేరు: రెస్పిరేటరీ లాబోరేటరీ టెక్నీషియన్
పోస్టుల సంఖ్య: మొత్తం రెండు (02) (అన్ రిజర్వుడ్)
జీతం: నెలకు రూ.29,200 (Level 5 of Pay Matrix of 7th CPC)
వయసు: ఆగస్టు 11, 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీలో B.Sc.(MLT) డిగ్రీ చేసిన వారు అర్హులు.
అలాగే, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ లాబోరేటరీ/ అలర్జీ లాబోరేటరీ/ రెస్పిరేటరీ అలర్జీ మరియు ఇమ్మునోథెరపీ లాబోరేటరీలో ఒక సంవత్సరం పనిచేసిన అనుభవం ఉండాలి. వీటితో పాటు కంప్యూటర్ సాఫ్ట్ వేర్ హ్యాండ్లింగ్ లో ఒక సంవత్సరం శిక్షణ పొంది ఉండాలి.
ఇవి గ్రూప్-సీ పోస్టులు.
పైన సూచించిన వయసు అన్ రిజర్వుడ్ అభ్యర్థులకు మాత్రమే. ఎస్సీ, ఎస్టీలకు ఐదు (05) సంవత్సరాలు, ఓబీసీలకు మూడు (03) సంవత్సరాలు, PWBD (UR/EWS) – పది (10) సంవత్సరాలు, PWBD + OBC – పదమూడు (13) సంవత్సరాలు, PWBD + SC/ST – పదిహేను (15) సంవత్సరాల సడలింపు ఉంది.
ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు JIPMER వెబ్ సైట్ (https:://www.jipmer.edu.in) ను ఓపెన్ చేసి “Apply on-line to the post of Group B & C – July 2022” లింక్ పై క్లిక్ చేసి ఆన్ లైన్ అప్లికేషన్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ అప్లికేషన్ ప్రక్రియ జూలై 21, 2022 నుంచి ప్రారంభం అవుతుంది.
ఆన్ లైన్ అప్లికేషన్ ప్రక్రియలో అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాలి. అన్ రిజర్వుడ్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులు రూ.1500, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.1200 చెల్లించాలి. దివ్యాంగులు (పీడబ్ల్యూబీడీ) ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే చెల్లించాలి. అప్లికేషన్ హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం లేదు.
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 11, 2022
హాల్ టికెట్ల డౌన్ లోడ్: ఆగస్టు 25, 2022 నుంచి..
ఆన్ లైన్ టెస్ట్ తేదీ: సెప్టెంబర్ 04, 2022 (ఆదివారం)
ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాల కోసం క్రింది నెంబర్లు, ఈ-మెయిన్ ను సంప్రదించవచ్చు.
ఫోన్ నెంబర్స్ :
0413–2296022 (అని స్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్)
+91-735335551 (ఫీజు చెల్లింపు, ఇతర టెక్నికల్ సమస్యల పరిష్కారం కోసం)
(పై ఫోన్ నెంబర్లకు ఉదయం 9 గంటల నుంచి ఒంటి గంట వరకు, 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మాత్రమే కాల్ చేయాలి.)
ఈ-మెయిల్స్ : jipmergrpbandc@gmail.com, admn 1recttbc@gmail.com
చిరునామా:
The Deputy Director (Admn.).
Administration – I (Rect. Cell)
JIPMER Administrative Block,
Dhanvantri Nagar P.O.
Puducherry – 605006.
Website – https://jipmer.edu.in
– Nursing Officer X Ray Technician Jobs
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…