Office Subordinate Jobs : తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీసు (Telangana Judicial Ministerial Service)లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ (Direct Recruitment) ద్వారా ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ (Office Subordinate) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు (Telangana High Court) నోటిఫికేషన్ (06/2023) జారీ చేసింది. జిల్లాలతో పాటు ఇతర న్యాయస్థానాల్లో మొత్తం 1,226 పోస్టులు భర్తీకి ప్రకటన విడుదల చేసింది. సీబీటీ/ ఓఎమ్మార్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 11వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
Detalis and Vacancies of Posts
ఆఫీస్ సబార్డినేట్. మొత్తం పోస్టులు 1,226
జిల్లాల వారీగా ఖాళీలు:
ఆదిలాబాద్- 10, భద్రాద్రి కొత్తగూడెం- 19, కోర్ట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఫర్ సీబీఐ కేసెస్, హైదరాబాద్- 36, సిటీ సివిల్ కోర్టు, హైదరాబాద్ – 125, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు, హైదరాబాద్- 26, హనుమకొండ-19, జగిత్యాల- 32, జనగామ-13, జయశంకర్ భూపాలపల్లి – 18, జోగులాంబ గద్వాల- 25, కామారెడ్డి-14, కరీంనగర్- 12, ఖమ్మం – 13, కుమ్రం భీం ఆసిఫాబాద్- 11, మహబూబాబాద్ – 13, మంచిర్యాల- 14, మహబూబ్ నగర్ – 33, మెదక్- 16, మేడ్చల్-మల్కాజిగిరి- 92, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు, హైదరాబాద్- 128, ములుగు- 14, నాగర్ కర్నూలు- 28, నల్గొండ- 55, నారాయణపేట – 11, నిర్మల్- 18, నిజామాబాద్- 20, పెద్దపల్లి- 41, రాజన్న సిరిసిల్ల- 26, రంగారెడ్డి- 150, సంగారెడ్డి- 30, సిద్దిపేట – 25, సూర్యాపేట – 38, వికారాబాద్ – 27, వనపర్తి 19, వరంగల్- 21, యాదాద్రి భువనగిరి- 34.
Qualification
7వ తరగతి నుంచి 10వ తరగతి మధ్యలో ఏదైనా ఒక తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
10వ తరగతి కంటే ఎక్కువ విద్యార్హత ఉంటే అనర్హులు.
వృత్తిపరమైన నైపుణ్యాలతో పాటు స్థానిక భాషలు తెలిసి ఉండాలి.
Age Limit
01-07-2022 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు (05)సంవత్సరాలు, దివ్యాంగులకు (10) సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
Salary
రూ. రూ.19,000-రూ.58,850
Method of Recruitment
సీబీటీ/ ఓఎమ్మార్ పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)/ ఓమ్మార్ పరీక్షలో 45 ప్రశ్నలుంటాయి. జనరల్ నాలెడ్జ్ విభాగంలో 30, జనరల్ ఇంగ్లిష్ విభాగంలో 15 ప్రశ్నలుంటాయి. ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. పరీక్ష
వ్యవధి 60 నిమిషాలు ఉంటుంది.
How to apply
ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ (https://tshc.gov.in/) ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు ఓసీ/ ఓబీసీ అభ్యర్థులకు రూ.600 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.400) చెల్లించాలి. దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే 040-23688394 నెంబర్ కు ఫోన్ చేయవచ్చు. లేదా [email protected] కు మెయిల్ చేసి పరిష్కారం పొందవచ్చు.
Important Dates
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం: 11-01-2023.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2023.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష హాల్ టిక్కెట్ డౌన్లోడ్ ప్రారంభం: 15-02-2023.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: మార్చి 2023
– Office Subordinate Jobs