Para Medical Jobs in BSFA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Para Medical Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India, Ministry of Home Affairs) పరిధిలోని డైరెక్టరేట్​ జనరల్​ బోర్డర్​ సెక్యూరిటీ ఫోర్స్ (Directorate General Border Security Force-BSF) లో పారా మెడికల్​ స్టాఫ్​ గ్రూప్​–బీ, సీ (నాన్​ గెజిటెడ్​ నాన్​ మినిస్టీరియల్​) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. మొత్తం 64 పోస్టులు రెగ్యులర్​ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్ష, ఫిజికల్​ స్టాండర్డ్స్​ టెస్ట్​, ఫిజికల్​ ఎఫిషియెన్సీ టెస్ట్​, నాలెడ్జ్​/ట్రేడ్​ టెస్ట్​, మెడికల్​ ఎగ్జామినేషన్​, డాక్యుమెంట్స్​ వెరిఫికేషన్​ చేసి అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు మహిళలతో పాటు పురుషులు అప్లై చేసుకోవచ్చు.

Details of Posts

1. ఎస్​ఐ/స్టాఫ్ నర్స్ (SI/Staff Nurse) – 10
2. ఏఎస్​ఐ/డెంటల్ టెక్నీషియన్ (ASI/Dental Technician) – 01
3. ఏఎస్​ఐ/ల్యాబ్ టెక్నీషియన్ (ASI/Lab Technician) – 07
4. జూనియర్ ఎక్స్-రే అసిస్టెంట్ (హెడ్ కానిస్టేబుల్) (Junior X-Ray Assistant (Head Constable)) – 40
5. కానిస్టేబుల్ (టేబుల్ బాయ్) (Constable (Table Boy)) – 01
6. సీటీ(వార్డ్ బాయ్/ వార్డ్ గర్ల్/ఆయ) (CT(Ward Boy/ Ward Girl/Aya)) – 05

Reservation Wise Vacancies

Staff Nurse : UR-03, EWS-03, OBC-02, SC-02
Dental Technician : EWS-01
Lab Technician : UR-03, EWS-01, OBC-02, ST-01
Junior X-Ray Assistant : UR-16, EWS-04, OBC-11, SC-06, ST-03
Constable (Table Boy) : EWS-01
CT(Ward Boy/ Ward Girl/Aya) : UR-02, EWS-01, SC-06, ST-03
ఎస్​ఐ/స్టాఫ్ నర్స్, జూనియర్ ఎక్స్-రే అసిస్టెంట్ (హెడ్ కానిస్టేబుల్) పోస్టులలో 10 శాతం పోస్టులు మాజీ సైనికులకు (Ex-servicemen) కేటాయించారు.

Qualifications

స్టాఫ్ నర్స్ :

ఇంటర్మీడియెట్​ పాసై బీ.ఎస్సీ(నర్సింగ్​) లేదా జనరల్​ నర్సింగ్​ అండ్​ మిడ్​ వైఫరీ పూర్తి చేసిన వారు అర్హులు. అలాగే, సెంట్రల్​ లేదా స్టేట్​ నర్సింగ్​ కౌన్సిల్​ రిజిస్ట్రేషన్​ చేసుకొని ఉండాలి. ట్యుబర్క్యులోసిస్​, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, సిస్టర్ ట్యూటర్, పబ్లిక్ హెల్త్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ రంగంలో అనుభవం ఉండాలి.

ఏఎస్​ఐ/డెంటల్ టెక్నీషియన్ :

సైన్స్​ సబ్జెక్టులలో ఇంటర్మీడియెట్​ పాసై కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఇన్‌స్టిట్యూట్ లో డెంటల్ టెక్నీషియన్‌ లో రెండేళ్ల డిప్లొమా చేసి ఉండాలి.

ఏఎస్​ఐ/ల్యాబ్ టెక్నీషియన్ :

సైన్స్​ సబ్జెక్టులలో ఇంటర్మీడియెట్​ పాసై కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఇన్‌స్టిట్యూట్ లో మెడికల్​ ల్యాబోరేటరీ టెక్నాలజీలో డిప్లొమా చేసి ఉండాలి.

జూనియర్ ఎక్స్-రే అసిస్టెంట్ (హెడ్ కానిస్టేబుల్) :

ఇంటర్మీడియెట్​ పాసై కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ లో రేడియోగ్రఫీలో డిప్లొమా లేదా సర్టిఫికెట్​ కోర్సు చేసి ఉండాలి. అలాగే, సంబంధిత విభాగంలో ఆరు నెలల అనుభవం ఉండాలి.

కానిస్టేబుల్ (టేబుల్ బాయ్) :

మెట్రిక్యులేషన్​ పాసై ఉండాలి.

సీటీ(వార్డ్ బాయ్/ వార్డ్ గర్ల్/ఆయ) :

సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల పని అనుభవం ఉండాలి. గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ లేదా వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ నుండి ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు, ట్రేడ్‌లో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి. లేదా గుర్తింపు పొందిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నుండి ట్రేడ్ లేదా సంబంధిత ట్రేడ్‌లో రెండేళ్ల డిప్లొమా ఉండాలి. ట్రేడ్​ టెస్ట్​ తప్పనిసరి పాస్​ కావాల్సి ఉంటుంది. మల్టీ స్కిల్డ్​ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు.

Age Limit

స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే, డెంటల్​ టెక్నీషియన్​, ల్యాబ్​ టెక్నీషియన్​, జూనియర్​ ఎక్స్​రే అసిస్టెంట్​ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. టేబుల్​ బాయ్​, సీటీ(వార్డ్ బాయ్/ వార్డ్ గర్ల్/ఆయ) పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఓబీసీలు, అన్​ రిజర్వుడ్​ మాజీ సైనికులకు మూడు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ మాజీ సైనికులకు ఆరు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ మాజీ సైనికులకు ఎనిమిది సంవత్సరాల సడలింపు ఉంది. అలాగే, ప్రస్తుతం బీఎస్​ఎఫ్​లో పనిచేస్తున్న అన్​ రిజర్వుడ్ ఉద్యోగులు 40 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు 45 సంవత్సరాల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Pay Scale

Staff Nurse : Rs.35,400 – Rs.1,12,400 (Level-6)
Dental Technician : Rs.29,200 – Rs.92,300 (Level-5)
Lab Technician : Rs.29,200 – Rs.92,300 (Level-5)
Junior X-Ray Assistant : Rs.25,500 – Rs.81,100 (Level-4)
Constable (Table Boy) : Rs.21,700 – Rs.69,100 (Level-3)
CT(Ward Boy/ Ward Girl/Aya) : Rs.21,700 – Rs.69,100 (Level-3)

How to Apply

అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు బీఎస్​ఎఫ్​ వెబ్​ సైట్ (http://rectt.bsf.gov.in) ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ మూడు స్టెప్​లలో ఉంటుంది. ఫస్ట్​  స్టెప్​లో వన్​ టైం రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి. సెకండ్​ స్టెప్​లో ఆన్​ లైన్​ అప్లికేషన్​ ను ఫిల్​ చేయాలి. థర్డ్​ స్టెప్​లో అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. స్టాఫ్​ నర్స్​ అభ్యర్థులు రూ.2‌‌‌‌00, మిగిలిన పోస్టుల అభ్యర్థులు రూ.147.20 లు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు  అప్లికేషన్​ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆన్​లైన్​ దరఖాస్తుకు చివరి తేదీ : 13 మార్చి, 2023 (రాత్రి 11:59 వరకు)

– Para Medical Jobs in BSF