Permanent Jobs in MIDHANI : హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ సంస్థ అయిన మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (Mishra Dhatu Nigam Limited-MIDHANI) శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Advt.No:MDN/HR/E/1/22) జారీ చేసింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Details of Posts
1. అసిస్టెంట్ మేనేజర్ (సివిల్)
2. అసిస్టెంట్ మేనేజర్ (మెటీరియల్ మేనేజ్మెంట్)
3. అసిస్టెంట్ మేనేజర్ (పర్చేజ్)
Assistant Manager (Civil)
పోస్టుల సంఖ్య: ఒకటి (01), అన్ రిజర్వుడ్ (UR)
జీతం: రూ.40,000-3%-1,40,000,
వయసు: జూన్ 1, 2022 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
పని ప్రదేశం: హర్యానా రాష్ట్రంలోని రోహక్
అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్ లో 60 శాతం మార్కులతో బీ.ఈ (B.E) లేదా బీ.టెక్ (B.Tech) పాసై ఉండాలి. అలాగే, నిర్మాణరంగ పనులలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
Assistant Manager (Materials Management)
పోస్టుల సంఖ్య: ఒకటి (01), అన్ రిజర్వుడ్ (UR)
జీతం: రూ.40,000-3%-1,40,000
వయసు: జూన్ 1, 2022 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
పని ప్రదేశం: హర్యానా రాష్ట్రంలోని రోహక్
అర్హతలు: 60 శాతం మార్కులతో బీ.ఈ (B.E) లేదా బీ.టెక్ (B.Tech) పాసై ఉండాలి. మరియు మెటీరియల్స్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ లేదా పీజీ డిప్లొమా చేసి ఉండాలి. లా డిగ్రీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే, సంబంధిత విభాగాలలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
Senior Manager (Purchase)
పోస్టుల సంఖ్య: ఒకటి (01), అన్ రిజర్వుడ్ (UR)
జీతం: రూ.70,000-3%-2,00,000
వయసు: జూన్ 1, 2022 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు
అర్హతలు: 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో డిగ్రీ పాసై ఉండాలి. మరియు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థలో మెటీరియల్స్ మేనేజ్మెంట్ లేదా పొడక్షన్ మేనేజ్మెంట్ లేదా ఆపరేషన్ మేనేజ్మెంట్ లేదా సప్లై చైన్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ స్పెషలైజేషన్ చేసి ఉండాలి. లేదా మెటీరియల్స్ మేనేజ్మెంట్ లో పీజీ డిప్లొమా చేసి ఉండాలి. లా డిగ్రీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే, సంబంధిత విభాగాలలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
అలాగే, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత గడిచిన 10 సంవత్సరాలలో మెటీరియల్స్ మేనేజ్మెంట్ లేదా పర్చేజ్ లో కనీసం నాలుగు (04) సంవత్సరాల అనుభవం ఉండాలి. మరియు ఎంబీఏ లేదా పీజీ డిప్లొమా పూర్తిచేసిన వారికి మెటీరియల్స్ మేనేజ్మెంట్ లేదా పర్చేజ్ లో కనీసం రెండు (02) సంవత్సరాల అనుభవం ఉండాలి.
పైన సూచించిన గరిష్ఠ వయో పరిమితి కేవలం అన్ రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే. ఇతర కేటగిరీల వారికి భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. అయితే, వారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
How to Apply
- అభ్యర్థులు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి.
- ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ముందుగా ఈ-మెయిల్, ఫోన్ నెంబర్ తో MIDHANI వెబ్ నైట్ (https://midhani-india.in) లోకి లాగిన్ కావాలి. ప్రస్తుతం మనుగడలో ఉన్న ఈ-మెయిల్, ఫోన్ నెంబర్ నే ఉపయోగించాలి.
- రాత పరీక్ష ఇంటర్వ్యూ తేదీ, సమయం, స్థలం అన్ని వివరాలు మీరు ఇచ్చిన ఈ-మెయిల్, ఫోన్ నెంబర్లకు మాత్రమే పంపిస్తారు.
- ఆ తర్వాత జనరల్ అభ్యర్థులు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్ లైన్ లోనే రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అనంతరం అప్లికేషన్ ఫాంను అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫాంతో పుట్టిన తేదీ ప్రూఫ్ కోసం పదో తరగతి సర్టిఫికెట్, విద్యార్హతలు, పర్సంటేజ్ ప్రూఫ్స్, కేటగిరీ, అనుభవం, పే స్కేల్ తదితర సర్టిఫికెట్లు కూడా అప్ లోడ్ చేయాలి.
- సర్టిఫికెట్లు పూర్తిస్థాయిలో అప్ లోడ్ చేయని దరఖాస్తులను రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
- ప్రస్తుతం ఏదైనా ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న అభ్యర్థులు రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ సమయంలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.
- అప్లికేషన్ ఫాం, సంబంధిత ధ్రువీకరణ పత్రాలు అప్ లోడ్ చేసిన అనంతరం ప్రింట్ తీసుకొని దగ్గర ఉంచుకోవాలి.
Selection Criteria
అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంటే ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్ష ఇంగ్లిష్ భాషలో మాత్రమే ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తేదీ, సమయం, ప్రదేశం కేవలం మిధాని వెబ్ సైట్ లో మాత్రమే ఉంచుతారు. అభ్యర్థులు తరచూ వెబ్ సైజ్ ను చూస్తుండాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 15 జూన్, 2022
– Permanent Jobs in MIDHANI