Bank Jobs

Pochampally Bank Recruitment

Pochampally Bank Recruitment : తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో గల పోచంపల్లి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ (Pochampally Co-Operative Urban Bank LTD-PCUBL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం పదహారు (16) ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఈ-మెయిల్ లేదా పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Details Of Posts

1. మేనేజర్లు (Managers)
2. అకౌంటెంట్లు/అసిస్టెంట్ మేనేజర్లు (Accountants/Asst. Managers)
3. ఐటీ ప్రొఫెషనల్స్ (I.T.Professionals)
4. స్టాఫ్ అసిస్టెంట్స్/జూనియర్ ఆఫీసర్స్ (Staff Assistants/Junior Officers)

Managers

పోస్టు పేరు: మేనేజర్
పోస్టుల సంఖ్య: నాలుగు (04)
అర్హతలు: ఏదైనా విభాగంలో 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన వారు అర్హులు. అలాగే, మిడిల్ లేదా సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో ఫైనాన్షియల్ సెక్టార్లో కనీసం ఆరు (16) సంవత్సరాల అనుభవం ఉండాలి. వీఆర్ఎస్ తీసుకున్న వారికి, పదవీ విరమణ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ పోస్టు ఎంపికకు ఎలాంటి పరీక్ష నిర్వహించారు.

Accountants/Asst. Managers

పోస్టు పేరు: అకౌంటెంట్లు/అసిస్టెంట్ మేనేజర్లు
పోస్టుల సంఖ్య: రెండు (02)
అర్హతలు: ఏదైనా విభాగంలో 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. అలాగే, ఫైనాన్షియల్ సెక్టార్లో కనీసం మూడు (03) సంవత్సరాల అనుభవం ఉండాలి. కామర్స్ గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యం ఇస్తారు.

I.T.Professionals

పోస్టు పేరు: ఐటీ ప్రొఫెషనల్స్
పోస్టుల సంఖ్య: రెండు (02)
అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చేసిన వారు అర్హులు. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

Staff Assistants/Junior Officers

పోస్టు పేరు: స్టాఫ్ అసిస్టెంట్స్/జూనియర్ ఆఫీసర్స్
పోస్టుల సంఖ్య: ఎనిమిది (08)
అర్హతలు: ఏదైనా విభాగంలో 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. MBA(Finance) చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.

Age Limit

జూన్ 30, 2022 నాటికి అభ్యర్థుల వయసు 34 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయో పరిమితి 56 సంవత్సరాలు. మేనేజర్ పోస్టుకు వయోపరిమితి
లేదు.

Selection Procedure

ఈ ఉద్యోగాల ఎంపికకు ముందుగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రాత పరీక్షలో జనరల్ నాలెడ్జ్/అవేర్నెస్, బ్యాంకింగ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఆ రెండు టెస్టులలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తారు.
కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండి, ఇంగ్లిష్, హిందీ భాషలలో మంచి కమ్యూనికేషన్ ఉండి, Junior Associate of the Indian Institute of the Bankers (JAIIB)/Certified Associate of Indian Institute of Bankers(CAIIB) ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. అభ్యర్థులు సొంత ఖర్చులతో పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.

How to Apply

అభ్యర్థులు ముందుగా రూ.300 పరీక్ష ఫీజు చెల్లించాలి. పరీక్ష ఫీజు NEFT ద్వారా మాత్రమే చెల్లించాలి. PCUBL RECRUITMENT APPLI-CATION FEE పేరిట PCUBL అకౌంట్ (Account No. 100011010000692, Name of the Bank : Pochampally Cooperative Urban Bank Limited. IFSC Code: HDFC0CPCUBL (5th letter ZERO)) లో జమ చేయాలి.
ఆ తర్వాత PCUBL వెబ్ సైట్ లో నిర్ణీత ఫార్మాట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను అంటించి, దరఖాస్తు చేయదలుచుకున్న పోస్టు పేరు, అభ్యర్థి పేరు, తండ్రి పేరు, ప్రస్తుత, శాశ్వత చిరునామా, ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, ఆధార్ కార్డు నెంబర్, పాన్ నెంబర్, విద్యార్హతలు, మార్కుల శాతం, పాసైన సంవత్సరం. అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం, తెలిసిన భాషలు, పరీక్ష ఫీజు చెల్లించిన యూటీఆర్ నెంబర్ తదితర వివరాలు ఎంటర్ చేయాలి. ఆ ఫాంను ఈ-మెయిల్ ద్వారా గానీ, పోస్టు ద్వారాగానీ పంపించాలి. కవర్ పైన ఏ పోస్టుకు అప్లై చేస్తున్నది రాయాలి. అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి రాత పరీక్ష, ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు అటెస్టెడ్ చేయించిన వయసు/పుట్టిన తేదీ, విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.
అభ్యర్థి విద్యార్హతలు, అనుభవం ప్రాతిపదికగా తీసుకొని వేతనం ఇస్తారు.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: జూలై 30, 2022 (సాయంత్రం 5 గంటల వరకు)
దరఖాస్తులు పంపాల్సిన ఈ-మెయిల్ : recruitment@pochampallybank.com
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Pochampally Co-Operative Urban Bank LTD,
H.No.3-188, Main Road, Head Office: Pochampally,
Dist. Yadadri Bhonagiri-508284.

Website: www.pochampallybank.com

– Pochampally Bank Recruitment

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

3 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

12 months ago