Regular Jobs in CDFD : హైదరాబాద్ లోని భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో గల బయోటెక్నాలజీ విభాగానికి చెందిన సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (Centre for DNA Fingerprinting and Diagnostics-CDFD) శాశ్వత ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Advertisement No. 01/2022) జారీచేసింది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
1. టెక్నికల్ ఆఫీసర్-II (Technical Officer – II)
2. టెక్నికల్ అసిస్టెంట్ (Technical Assistant)
3. జూనియర్ మేనేజిరియల్ అసిస్టెంట్ (Junior Managerial Assistant)
4. జూనియర్ అసిస్టెంట్-II (Junior Assistant – II)
5. జూనియర్ అసిస్టెంట్-II (Junior Assistant – II)
6. స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్-II (Skilled Work Assistant – II)
పోస్టు కోడ్: 01
పోస్టు పేరు: టెక్నికల్ ఆఫీసర్-II
వయసు: 30 సంవత్సరాలు
పోస్టుల సంఖ్య: 01 (ఈడబ్ల్యూఎస్)
జీతం: నెలకు బేసిక్ పే రూ.44,900 (మొత్తం జీతం: రూ.77,113)
అర్హతలు: బీ.ఎస్సీ పస్ట్ క్లాస్ లో పాసై సంబంధిత విభాగంలో ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉండాలి. లేదా ఎమ్మెస్సీ పాసై సంబంధిత విభాగంలో నాలుగు సంవత్సరాల అనుభవం ఉండాలి. లేదా బీ.టెక్ పాసై సంబంధిత విభాగంలో నాలుగు సంవత్సరాల అనుభవం ఉండాలి.
పోస్టు కోడ్: 02
పోస్టు పేరు: టెక్నికల్ అసిస్టెంట్
వయసు: 30 సంవత్సరాలు
పోస్టుల సంఖ్య: 01 (ఈడబ్ల్యూఎస్)
జీతం: నెలకు బేసిక్ పే రూ.35,400 (మొత్తం జీతం: రూ.61,818)
అర్హతలు: బీ.ఎస్సీ లేదా బీ.టెక్ పస్ట్ క్లాస్ లో పాసై సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి. లేదా సైన్స్/ టెక్నాలజీలో పోస్ట్
గ్రాడ్యుయేషన్ లేదా సైన్స్/టెక్నాలజీలో డిప్లొమా చేసి ఏడాది అనుభవం ఉండాలి.
పోస్టు: 03
పోస్టు పేరు: జూనియర్ మేనేజిరియల్ అసిస్టెంట్
వయసు: 25 సంవత్సరాలు
పోస్టుల సంఖ్య: 01 (ఈడబ్ల్యూఎస్)
జీతం: నెలకు బేసిక్ పే రూ.29,200 (మొత్తం జీతం: రూ.51,836)
అర్హతలు: ఏదైనా డిగ్రీ పాసై ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగ సంస్థలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి. టైప్ రైటింగ్ లో నిమిషానికి 30 ఇంగ్లిష్ పదాలు టైప్ చేయగలగాలి. అదేవిధంగా షార్ట్ హ్యాండ్ లో నిమిషానికి 80 ఇంగ్లిష్ పదాలు టైప్ చేయగలగాలి.
పోస్టు కోడ్: 04 & 05
పోస్టు పేరు: జూనియర్ అసిస్టెంట్-II
వయసు: 25 సంవత్సరాలు
పోస్టుల సంఖ్య: 02 (ఈడబ్ల్యూఎస్-01, అన్ రిజర్వుడ్-01)
జీతం: నెలకు బేసిక్ పే రూ.19,900 (మొత్తం జీతం: రూ.33,858)
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీలో 12వ తరగతి లేదా అందుకు సమానమైన కోర్సు పాసై ఉండాలి. కంప్యూటర్ లో నిమిషానికి 35 ఇంగ్లిష్ పదాలు లేదా 30 హిందీ పదాలు టైప్ చేయగలగాలి.
పోస్టు కోడ్: 06
పోస్టు పేరు: స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్-II
వయసు: 25 సంవత్సరాలు
పోస్టుల సంఖ్య: 01 (అన్ రిజర్వుడ్)
జీతం: నెలకు బేసిక్ పే రూ.18,000 (మొత్తం జీతం: రూ.30,789)
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా అందుకు సమానమైన కోర్సు పాసై ఉండాలి. బయోలాజికల్ R&D సెంటర్ లో మీడియా ప్రిపేరింగ్, ఆటోక్లేవింగ్ లో ఒకటి లేదా రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు వయసులో ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్, దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
అర్హులైన ఆసక్తిగల అభ్యర్థులు సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ వెబ్ సైట్ (http://www.cdfd.org.in) లో పొందుపరిచిన నిర్ణీత ఫార్మాట్ ప్రకారం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం అప్లికేషన్ ఫాం హార్డ్ కాపీని సీడీఎఫ్ డీ కి పంపించాలి. అభ్యర్థులు ముందుగా ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫాం పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనుగడలో ఉన్న ఈ-మెయిల్, ఫోన్ నెంబర్, రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోనే ఉపయోగించాలి. ఈ పోస్టులకు సంబంధించిన ఉత్తరపత్యుత్తరాలన్నీ ఈ-మెయిల్ ద్వారానే తెలియజేస్తారు.
ఆ తర్వాత అభ్యర్థులు సీడీఎఫ్ డీ వెబ్ వెబ్ సైట్ లో ఇచ్చిన లింక్ (https://www.onlinesbi.com/sbicollect/icollecthome.htm) ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళ, ఎక్స్ సర్వీస్ మెన్, దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ ఐడీతో లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫాంను పూర్తిచేసి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫాం వెనక వైపు రిజిస్ట్రేషన్ ఐడీ నెంబర్, అభ్యర్థి పేరు, అప్లై చేసిన పోస్ట్ కోడ్, కేటగిరీ రాయాలి.
సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానికి అప్లికేషన్ ఫీజు రశీదు, రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, సెల్ఫ్ అటెస్ట్ చేసిన పుట్టిన తేదీ సర్టిఫికెట్, ఇతర అన్ని ధ్రువీకరణ పత్రాలు జతచేయాలి. వాటిని ఎనవలప్ కవర్ లో పెట్టి, కవర్ పైన పోస్ట్ పేరు, పోస్ట్ కోడ్ రాయాలి. ఆ కవర్ ను జూలై 15, 2022లోపు The Head-Administration, Centre for DNA Fingerprinting and Diagnostics, Inner Ring Road,
Uppal, Hyderabad – 500039, Telangana చిరునామాకు పంపించాలి.
Last Date for Receipt of online applications : 30 June, 2022
Last date for receipt of hard copy appl icat ions : 15 July, 2022
– Regular Jobs in CDFD
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…