Social Security Assistant Jobs : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Employees Provident Fund Organization-EPFO) దేశ వ్యాప్తంగా రీజియన్ల వారీగా రెగ్యులర్ ప్రాతిపదికన సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ (Social Security Assistant (Group-C)) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 2,674 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో తెలంగాణ రీజియన్‌లో 116 పోస్టులు, ఆంధ్రపద్రేశ్ రీజియన్‌లో 39 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Vacancies
తెలంగాణ రీజియన్ – 116
ఎస్సీ–20, ఎస్టీ–06,ఓబీసీ –36,ఈడబ్ల్యూఎస్–33, అన్‌రిజర్వుడ్–21
ఆంధ్రప్రదేశ్ రీజియన్ - 39 పోస్టులు
ఎస్సీ–08, ఓబీసీ – 07, ఈడబ్ల్యూఎస్–19, అన్‌రిజర్వుడ్–05
Qualifications
ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అలాగే, కంప్యూటర్లో నిమిషానికి 35 ఇంగ్లిష్ పదాలు లేదా 30 హిందీ పదాలు టైప్ చేయగలగాలి.
Salary
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.29,900 – రూ.92,300 వరకు చెల్లిస్తారు.
Age Limit
దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, మాజీ సైనికులకు 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
Selection Procedure
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Written Test
రాత పరీక్ష రెండు ఫేజ్‌లలో ఉంటుంది. ఫస్ట్ ఫేజ్‌లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫేజ్-2లో కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ (కంప్యూటర్ డాటా ఎంట్రీ టెస్ట్) ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష అబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. 600 మార్కులు ఉంటాయి. ఒక్కో జవాబుకు నాలుగు మార్కులు ఇస్తారు. జనరల్ అప్టిట్యూడ్ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్/ జనరల్ అవేర్నెస్ నుంచి 30 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లిష్ నుంచి 50 ప్రశ్నలు, కంప్యూటర్ లిటరసీ నుంచి 10 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష రెండున్నర గంటలలో రాయాల్సి ఉంటుంది.
How to Apply
ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు https://recruitment.nta.nic.in వెబ్ సైట్ నుంచి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ నాలుగు స్టెప్‌లలో ఉంటుంది. ఫస్ట్ స్టెప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్‌లో అప్లికేషన్ ఫాం నింపాలి. థర్డ్ స్టెప్‌లో ఫొటో, సంతకం, థంబ్ ఇంప్రెషన్ స్కాన్‌చేసి అప్లోడ్ చేయాలి. ఫోర్త్ స్టెప్‌లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 27.03.2023
దరఖాస్తులకు చివరి తేదీ : 26.04.2023
వెబ్ సైట్లు : http://recruitment.nta.nic.in, www.epfindia.gov.in
నోటిఫికేషన్ లింక్ : https://www.epfindia.gov.in/site_en/Recruitments.php
– Social Security Assistant Jobs