Staff Nurse Jobs in CCRHA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Staff Nurse Jobs in CCRH : ఢిల్లీలోని భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (Central Council for Research in Homoeopathy-CCRH) స్టాఫ్ నర్స్ (Staff Nurse) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Advt.No.16/2022) జారీ చేసింది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

Vacancies

మొత్తం పోస్టులు ఎనిమిది (08). (అన్ రిజర్వుడ్ (UR)-06, ఓబీసీ(OBC) – 02)

Salary

నెలకు రూ.44,900-1,42,400 (Level-7). ఇవి గ్రూప్-బీ పోస్టులు.

Age Limit

దరఖాస్తు ప్రక్రియ ముగిసే నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు మించకూడదు. రిజర్వేషన్ కేటరిగీల వారికి భారత ప్రభుత్వ నిబంధనల మేరకు వయసులో సడలింపు ఉంటుంది.

Qualifications

ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్/యూనివర్సిటీలో B.Sc.(Honours) Nursing / B.Sc. Nursing చేసి ఉండాలి. లేదా, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్/యూనివర్సిటీలో B.Sc. (Post-certificate) / Post Basic B.Sc. Nursing చేసి ఉండాలి. స్టేట్/ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో నర్స్ లేదా నర్స్ అండ్ మిడ్ వైఫ్ గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. కోర్సు పూర్తిచేసిన తర్వాత 50 పడకల ఆసుపత్రిలో ఆరు నెలలు పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్/బోర్డులో డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (Diploma in General Nursing and Midwifery (GNM) చేసి, ఇండియన్ / స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో నర్స్ అండ్ మిడ్ వైఫ్ గా రిజిస్ట్రేషన్ చేసుకొని, స్టేట్/ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో నర్స్ లేదా నర్స్ అండ్ మిడ్ వైఫ్ గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. కోర్సు పూర్తిచేసిన తర్వాత 50 పడకల ఆసుపత్రిలో కనీసం రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.

Application Fee

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.300 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులు/ దివ్యాంగులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. Director General, CCRH పేరిట న్యూ ఢిల్లీలో చెల్లుబాటు అయ్యో డీడీ తీయాలి. డీడీ వెనకాల అభ్యర్థి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ రాయాలి.

How to Apply

ఈ పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు CCRH వెబ్ సైట్ (https://www.ccrhindia.nic.in/) లో నోటిఫికేషన్ తో పాటు నిర్ణీత ఫార్మాట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిపై రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అంటించి, ఫాంలోని వివరాలు పూర్తిగా నింపాలి.
అప్లికేషన్ ఫాంకు వయసు ధ్రువీకరణ కోసం ఎస్సెస్సీ మెమో, విద్యార్హతలకు సంబంధించిన మెమోలు, స్టేట్/ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లు, కులం సర్టిఫికెట్, వైకల్య సర్టిఫికెట్, అప్లికేషన్ ఫీజు డీడీ, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, అప్లికేషన్ కింద ఉన్న అడ్మిషన్ టికెట్ లో కూడా వివరాలు పూరించి జతచేయాలి.
ఈ మొత్తం సర్టిఫికెట్లను ఒక ఎనవలప్ కవర్ లో పెట్టి, ఆ కవర్ పైన “Application for the post of Staff Nurse” అని పెద్ద అక్షరాలతో రాసి, Director General, Central Council for Research in Homoeopathy, 61-65, Institutional Area, opposite D-Block, Janakpuri, New Delhi-110058 చిరునామాకు పంపించాలి.
రిజిస్టర్/ స్పీడ్ పోస్టు ద్వారా పంపిస్తే మంచిది. పోస్టల్ జాప్యానికి కౌన్సిల్ బాధ్యత వహించదు.

Selection Procedure

  • ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియను రాత పరీక్ష ఆధారంగా నిర్వహిస్తారు.
  • రాత పరీక్షలో జనరల్/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 45 శాతం, దివ్యాంగులు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
  • రాత పరీక్షకు హాజరయ్యే వారికి కౌన్సిల్ ఎలాంటి టీఏ/డీఏ చెల్లించదు. అభ్యర్థులు తమ సొంత ఖర్చులతోనే హాజరు కావాలి.
  • ఈ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాలు ఈ-మెయిల్, ఫోన్ నెంబర్ కు పంపిస్తారు. కాబట్టి ప్రస్తుతం మనుగడలో ఉన్న ఈ-మెయిల్, ఫోన్ నెంబర్ నే అప్లికేషన్ ఫాంలో ఇవ్వాలి.
  • వాటిని ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదు.
  • అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోవాలి.

Website – https://www.ccrhindia.nic.in/

– Staff Nurse Jobs in CCRH