Staff Nurse Jobs in CCRH : ఢిల్లీలోని భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (Central Council for Research in Homoeopathy-CCRH) స్టాఫ్ నర్స్ (Staff Nurse) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Advt.No.16/2022) జారీ చేసింది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం పోస్టులు ఎనిమిది (08). (అన్ రిజర్వుడ్ (UR)-06, ఓబీసీ(OBC) – 02)
నెలకు రూ.44,900-1,42,400 (Level-7). ఇవి గ్రూప్-బీ పోస్టులు.
దరఖాస్తు ప్రక్రియ ముగిసే నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు మించకూడదు. రిజర్వేషన్ కేటరిగీల వారికి భారత ప్రభుత్వ నిబంధనల మేరకు వయసులో సడలింపు ఉంటుంది.
ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్/యూనివర్సిటీలో B.Sc.(Honours) Nursing / B.Sc. Nursing చేసి ఉండాలి. లేదా, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్/యూనివర్సిటీలో B.Sc. (Post-certificate) / Post Basic B.Sc. Nursing చేసి ఉండాలి. స్టేట్/ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో నర్స్ లేదా నర్స్ అండ్ మిడ్ వైఫ్ గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. కోర్సు పూర్తిచేసిన తర్వాత 50 పడకల ఆసుపత్రిలో ఆరు నెలలు పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్/బోర్డులో డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (Diploma in General Nursing and Midwifery (GNM) చేసి, ఇండియన్ / స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో నర్స్ అండ్ మిడ్ వైఫ్ గా రిజిస్ట్రేషన్ చేసుకొని, స్టేట్/ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో నర్స్ లేదా నర్స్ అండ్ మిడ్ వైఫ్ గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. కోర్సు పూర్తిచేసిన తర్వాత 50 పడకల ఆసుపత్రిలో కనీసం రెండు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలి.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.300 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులు/ దివ్యాంగులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. Director General, CCRH పేరిట న్యూ ఢిల్లీలో చెల్లుబాటు అయ్యో డీడీ తీయాలి. డీడీ వెనకాల అభ్యర్థి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ రాయాలి.
ఈ పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు CCRH వెబ్ సైట్ (https://www.ccrhindia.nic.in/) లో నోటిఫికేషన్ తో పాటు నిర్ణీత ఫార్మాట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిపై రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అంటించి, ఫాంలోని వివరాలు పూర్తిగా నింపాలి.
అప్లికేషన్ ఫాంకు వయసు ధ్రువీకరణ కోసం ఎస్సెస్సీ మెమో, విద్యార్హతలకు సంబంధించిన మెమోలు, స్టేట్/ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లు, కులం సర్టిఫికెట్, వైకల్య సర్టిఫికెట్, అప్లికేషన్ ఫీజు డీడీ, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, అప్లికేషన్ కింద ఉన్న అడ్మిషన్ టికెట్ లో కూడా వివరాలు పూరించి జతచేయాలి.
ఈ మొత్తం సర్టిఫికెట్లను ఒక ఎనవలప్ కవర్ లో పెట్టి, ఆ కవర్ పైన “Application for the post of Staff Nurse” అని పెద్ద అక్షరాలతో రాసి, Director General, Central Council for Research in Homoeopathy, 61-65, Institutional Area, opposite D-Block, Janakpuri, New Delhi-110058 చిరునామాకు పంపించాలి.
రిజిస్టర్/ స్పీడ్ పోస్టు ద్వారా పంపిస్తే మంచిది. పోస్టల్ జాప్యానికి కౌన్సిల్ బాధ్యత వహించదు.
Website – https://www.ccrhindia.nic.in/
– Staff Nurse Jobs in CCRH
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…