Staff Nurse Posts Zone WiseA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Staff Nurse Posts Zone Wise : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా పెద్ద సంఖ్యలో స్టాఫ్ నర్స్ (Staff Nurse) పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (Medical Health Services Recruitment Board-MHSRB) నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 5,204 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులను రాష్ట్రంలోని ఏడు జోన్ లకు ఈ కింది విధంగా కేటాయించింది.

DPH&FW/DME

పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్/ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (Director of Public Health and Family Welfare/ Director of Medical Education) పరిధిలో మొత్తం 3,823 పోస్టులు ఉన్నాయి. అందులో Zone-I కు 436 పోస్టులు, Zone-II కు 672 పోస్టులు, Zone-III కి 220 పోస్టులు, Zone-IV కు 681 పోస్టులు, Zone-Vకు 342 పోస్టులు, Zone-VI కు 888 పోస్టులు, Zone-VIIకు 584 పోస్టులు కేటాయించింది.

TVVP

తెలంగాణ వైద్య విధాన పరిషత్ (Telangana Vaidya Vidhana Parishad) పరిధిలో మొత్తం 757 పోస్టులు ఉన్నాయి. అందులో Zone-I కు 45 పోస్టులు, Zone-II కు 90 పోస్టులు, Zone-III కి 115 పోస్టులు, Zone-IV కు 55 పోస్టులు, Zone-Vకు 100 పోస్టులు, Zone-VI కు 262 పోస్టులు, Zone-VIIకు 90 పోస్టులు కేటాయించింది.

MNJIO&RCC

ఎం ఎన్ జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజినల్ క్యాన్సర్ సెంటర్ (MNJ Institute of Oncology & Regional Cancer Centre-MNJIO&RCC) కు 81 పోస్టులు కేటాయించింది.

DDSCW

వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ (Department for Disabled and Senior Citizens Welfare) పరిధిలో మొత్తం 8 పోస్టులు ఉన్నాయి. అందులో Zone-II కు ఒకటి (01), Zone-III కి 02 పోస్టులు, Zone-IV కు ఒకటి (01), Zone-Vకు ఒకటి (01), Zone-VI కు ఒకటి (01), Zone-VIIకు 02 పోస్టులు కేటాయించింది.

TMREIS

తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Minorities Residential Educational Institutions Society) పరిధిలో మొత్తం 127 పోస్టులు ఉండగా.. అందులో Zone-I కు 6 పోస్టులు, Zone-II కు 22 పోస్టులు, Zone-III కి 15 పోస్టులు, Zone-IV కు 14 పోస్టులు, Zone-Vకు 9 పోస్టులు, Zone-VI కు 49 పోస్టులు, Zone-VIIకు 12 పోస్టులు కేటాయించింది.

MJPTBCWREIS

మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (Mahatma Jyothiba Phule Telangana backward Classes Welfare Residential Educational Institutions Society) పరిధిలో మొత్తం 197 పోస్టులు ఉన్నాయి. అందులో Zone-I కు 15 పోస్టులు, Zone-II కు 22 పోస్టులు, Zone-III కి 30 పోస్టులు, Zone-IVకు 27 పోస్టులు, Zone-Vకు 23 పోస్టులు, Zone-VI కు 58 పోస్టులు, Zone-VIIకు 22 పోస్టులు కేటాయించింది.

TTWREIS (Gurukulam)

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం) (Telangana Tribal Welfare Residential Educational Institutions Society (Gurukulam)) పరిధిలో మొత్తం 74 పోస్టులు ఉండగా.. అందులో Zone-I కు 7 పోస్టులు, Zone-II కు 9 పోస్టులు, Zone-III కి 14 పోస్టులు, Zone-IVకు 15 పోస్టులు, Zone-Vకు 11 పోస్టులు, Zone-VI కు 12 పోస్టులు, Zone-VIIకు 6 పోస్టులు కేటాయించింది.

TSWREIS

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare Residential Educational Institutions Society) పరిధిలో మొత్తం 124 పోస్టులు ఉన్నాయి. అందులో Zone-I కు 16 పోస్టులు, Zone-II కు 13 పోస్టులు, Zone-III కి 19 పోస్టులు, Zone-IVకు 17 పోస్టులు, Zone-Vకు 18 పోస్టులు, Zone-VI కు 22 పోస్టులు, Zone-VIIకు 19 పోస్టులు కేటాయించింది.

TREIS

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషనల్ సొసైటీ (Telangana Residential Education Institutional Society) పరిధిలో మొత్తం 13 పోస్టులు ఉన్నాయి. అందులో Zone-I కు ఒకటి (01), Zone-II కు 02 పోస్టులు, Zone-III కి 02 పోస్టులు, Zone-IVకు 03 పోస్టులు, Zone-Vకు 02 పోస్టులు, Zone-VI కు 02 పోస్టులు, Zone-VIIకు ఒక పోస్టు కేటాయించింది.

Districts in Zones

Zone-I (కాళేశ్వరం జోన్) : ఆసిఫాబాద్-కుమ్రంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్-భూపాలపల్లి, ములుగు
Zone-II (బాసర జోన్) : ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల
Zone-III (రాజన్న జోన్) : కరీంనగర్, సిరిసిల్ల-రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి
Zone-IV (భద్రాద్రి జోన్) : కొత్తగూడెం-భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హనుమకొండ (వరంగల్ అర్బన్), వరంగల్ (వరంగల్ రూరల్)
Zone-V (యాదాద్రి జోన్) : సూర్యాపేట, నల్గొండ, భోంగీర్-యాదాద్రి, జనగాం
Zone-VI (చార్మినార్ జోన్) : మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్
Zone-VII (జోగులాంబ జోన్) : మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ-గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్

అభ్యర్థులు తమ జోన్ పరిధిలోని పోస్టులను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.

– Staff Nurse Posts Zone Wise