Tradesman Jobs in ECIL : హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Electronics Corporation of India Limited-ECIL) ట్రేడ్స్ మెన్-బీ (Tradesman-B(WG-III)) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Advt.No.11/2022) జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Posts Details
1. ఎలక్ట్రానిక్ మెకానిక్/ఆర్అండ్వీ (Electronic Mechanic/R&TV)
2. ఫిటర్ (Fitter)
3. ఎలక్ట్రిషియన్ (Electrician)
4. మెషినిస్ట్ (Machinist)
5. టర్నర్ (Turner)
Number of Posts
మొత్తం పోస్టులు నలభై (40). అన్ రిజర్వుడ్ (Unreserved-UR)-20, ఈడబ్ల్యూఎస్ (Economically Weaker Sections-EWS)-03, ఓబీసీ (Other Backward Classes-OBC)-13, ఎస్సీ (Scheduled Castes-SC)-03, ఎస్టీ (Scheduled Tribes-ST)-01. భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దివ్యాంగులు, మాజీ సైనికులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.
Age Limit
దరఖాస్తు చేసుకొనే నాటికి అన్ రిజర్వుడ్ అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకూడదు. ECILలో గతంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న
కాంట్రాక్టు లేబర్ కు వయసులో సడలింపు ఇచ్చారు. వారి వయసు దరఖాస్తు చేసుకొనే నాటికి 40 సంవత్సరాలు మించకూడదు. వారు కాంట్రాక్టుకు సంబంధించిన సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది. దివ్యాంగుల వైకల్యం 40 శాతం కంటే ఎక్కువగా ఉండాలి.
Qualification
అభ్యర్థులు మెట్రిక్యులేషన్/ఎస్సెస్సీ లేదా అందుకు సమానమైన కోర్సు పూర్తి చేసి ఉండాలి. అలాగే, NAC (National Apprentice Certificate)తో ITI సర్టిఫికెట్(National Trade Certificate-NTC) కలిగి ఉండాలి. లేదా మెట్రిక్యులేషన్/ఎస్సెస్సీ లేదా అందుకు సమానమైన కోర్సు పూర్తిచేసి, ITI సర్టిఫికెట్(NTC) కలిగి ఉండి సంబంధిత మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో ఒక సంవత్సరం అనుభవం ఉన్నవారు కూడా అర్హులే. ITI సర్టిఫికెట్(NTC) సంబంధిత ట్రేడ్స్ లోనే ఉండాలి.
Salary
నెలకు రూ.20,480. ప్రతి సంవత్సరం 3 శాతం ఇంక్రిమెంట్ ఉంటుంది. వేతనంతో పాటు పీఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి.
Selection Criteria
- అభ్యర్థుల ఎంపిక రెండు దశలలో ఉంటుంది. రాత పరీక్ష మరియు ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ఉండదు.
- అర్హులైన అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా 1:4 నిష్పత్తిలో ట్రేడ్ టెస్ట్ కు అహ్వానిస్తారు.
- రాత పరీక్ష తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించి ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్కు పిలుస్తారు.
- రాతపరీక్ష ఇంగ్లిష్, హిందీ భాషలలో నిర్వహిస్తారు. పరీక్ష అబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానికి 0.25 మార్కు కట్ చేస్తారు. ఓఎంఆర్ షీట్ లో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
- రాత పరీక్ష తేదీ, స్థలం, సమయం ఈ-మెయిల్ లేదా ఎస్సెమ్మెస్ ద్వారా తెలియజేస్తారు.
- అభ్యర్థులు హాల్ టికెట్లు ECIL వెబ్ సైట్ (http//careers.ecil.co.in.) నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు అధార్ కార్డ్, పాన్ కార్డ్, వోటర్ ఐడీ, డైవింగ్ లైసెన్స్లలో ఏదైనా ఒక ఐడీ ప్రూఫ్ తో పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.
Application Fee
అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ లేదా అఫ్ లైన్ మోడ్ లో చెల్లించవచ్చు. అన్ రిజర్వుడ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ECIL వెబ్ సైట్ లో పొందుపరిచిన లింక్ ల ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఒక్కసారి చెల్లించిన ఫీజు ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఇవ్వబడదు.
How to Apply
అర్హులైన అభ్యర్థులు మరియు ECIL ఇంటర్నల్ అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ECIL వెబ్ సైట్ (http://careers.ecil.co.in, www.ecil.co.in) లలోకి లాగిన్ అయి సంబంధిత నోటిఫికేషన్ (Advt.No.11/2022)పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, సంతకం జేపీజీ ఫార్మాట్ లో అప్ లోడ్ చేయాలి. ఫొటో 4×3 సెం.మీ. సైజ్ లో బ్లూ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి. సైజ్ 100 కేబీలోపు ఉండాలి. సంతకం 50 కేబీలోపు ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీ 25 జూన్, 2022 (మధ్యాహ్నం 2గంటల వరకు). దరఖాస్తు చేసిన తర్వాత అభ్యర్థులు ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోవాలి.
అభ్యర్థులు సరిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ ఫాం, ఫీజు చెల్లించిన రశీదు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, అనుభవం, కులం, వైకల్య సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అందజేయాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: 25 జూన్, 2022 (మధ్యాహ్నం 2 గంటల వరకు)
– Tradesman Jobs in ECIL