TS High Court JobsA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

TS High Court Jobs : హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (High Court For The State of Telangana-TSHC) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా టైపిస్ట్ (Typist), కాపీయిస్ట్ (Copyist) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Notification No.545/2022-RC) జారీ చేసింది. మొత్తం 85 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (Online Copmuter Based Written Examination), ఉమ్మడి టైప్ రైటింగ్ టెస్ట్ (Common Typewriting Examination) (స్కిల్ టెస్ట్), ఓరల్ ఇంటర్వ్యూ (Oral Interview) నిర్వహించి వాటిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.

Reservation Wise Vacancies

టైపిస్ట్ (Typist):
ఓసీ (OC) – 19 (మహిళలకు 7 పోస్టులు)
ఈడబ్ల్యూఎస్ (EWS) – 04 (మహిళకు 1 పోస్టు)
బీసీ-ఏ (BC-A) – 03 (మహిళకు 1 పోస్టు)
బీసీ-బీ (BC-B) – 03 (మహిళకు 1 పోస్టు)
బీసీ- సీ (BC-C) – 01
బీసీ-డీ (BC-D) – 03 (మహిళకు 1 పోస్టు)
బీసీ-ఈ (BC-E) – 01 (మహిళ)
ఎస్సీ (SC) – 06 (మహిళలకు 2 పోస్టులు)
ఎస్టీ (ST) – 03 (మహిళకు 1 పోస్టు)
మొత్తం 43

కాపీయిస్ట్ (Copyist):
ఓసీ (OC) – 19 (మహిళలకు 7 పోస్టులు)
ఈడబ్ల్యూఎస్ (EWS) – 04 (మహిళకు 1 పోస్టు)
బీసీ-ఏ (BC-A) – 03 (మహిళకు 1 పోస్టు)
బీసీ-బీ (BC-B) – 03 (మహిళకు 1 పోస్టు)
బీసీ – సీ (BC-C) – 01
బీసీ-డీ (BC-D) – 02 (మహిళకు 1 పోస్టు)
బీసీ – ఈ (BC-E) – 01 (మహిళ)
ఎస్సీ (SC) – 06 (మహిళలకు 2 పోస్టులు)
ఎస్టీ (ST) – 03 (మహిళకు 1 పోస్టు)
మొత్తం 42

Qualifications

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఆర్ట్స్/సైన్స్/కామర్స్/లా విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • టైప్ రైటింగ్ (ఇంగ్లిష్) హయ్యర్ గ్రేడ్ (నిమిషానికి 45 పదాలు టైప్ చేయగలగాలి)లో ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో ఉత్తీర్ణులైన ఉండాలి.
  • అభ్యర్థులు పై అర్హతలన్నీ నోటిఫికేషన్ వెలువడిన రోజు వరకే కలిగి ఉండాలి.
  • భారతీయ పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • అభ్యర్థులు ఎలాంటి అనారోగ్య సమస్యలు కలిగి ఉండకూడదు.

Scale of Pay : రూ.24,280 – 72,850

Age Limit

అభ్యర్థుల వయసు జూలై 1, 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీ గిరిజనులకు వయసులో ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.
మాజీ సైనికులకు (Ex Servicemem) సబార్డినేట్ సర్వీస్ రూల్స్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.

Application/Examination Fee

ఓసీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్/పరీక్ష ఫీజు రూ.800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి. ఈ పరీక్ష ఫీజును ఆన్ లైన్ లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి చెల్లించిన ఫీజును తిరిగి ఇవ్వరు.

Selection Procedur

ఉద్యోగాల ఎంపికకు అభ్యర్థులకు కంప్యూటర్ లో ఆన్ లైన్ ఉమ్మడి రాత పరీక్ష, ఉమ్మడి టైప్ రైటింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్) నిర్వహిస్తారు. ఉమ్మడి రాత పరీక్ష 40 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లిష్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఒక జవాబుకు ఒక మార్కు ఉంటుంది. ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో ఇస్తారు. పరీక్ష మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 40 నిమిషాలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ లోనే ఉంటుంది.
అలాగే, ఉమ్మడి టైప్ రైటింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్) 40 మార్కులకు నిర్వహిస్తారు. టెస్ట్ 15 నిమిషాల పాటు నిర్వహిస్తారు. నిమిషానికి 45 పదాలు టైప్ చేయగలగాలి.
పై రెండు టెస్టులలో కలిపి ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40 శాతం మార్కులు, బీసీ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30 మార్కులు సాధిస్తేనే క్వాలిఫై అవుతారు.
రాత పరీక్ష, టైప్ రైటింగ్ టెస్టులలో క్వాలిఫై అయిన వారిని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు పిలుస్తారు. ఆ తర్వాత అర్హులైన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో ఓరల్ ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఓరల్ ఇంటర్వ్యూ (Viva-Voce) కు 20 మార్కులు ఉంటాయి.
పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లో ఉంటాయి.

How to Apply

ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు Telangana High Court వెబ్ సైట్ (https://tshc.gov.in) ద్వారా ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా పార్ట్-ఏ లో అభ్యర్థి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్కడ యూసర్ ఐడీ, పాస్వర్డ్ వస్తాయి వాటితో పార్ట్-బీలో ఆన్ లైన్ అప్లికేషన్ నింపి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 10, 2022 నుంచి ప్రారంభం అవుతుంది.

Important Points

అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తులో ఇచ్చిన వివరాలనే ప్రాతిపదికగా తీసుకుంటారు.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు అకాడమిక్/టెక్నికల్ క్వాలిఫై సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, పుట్టిన తేదీ, కులం తదితర ధ్రువీకరణ పత్రాలు గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించి సమర్పించాల్సి ఉంటుంది.
మరొక నెట్ ఇంటర్వ్యూ సమయంలో అందజేయాలి.

Important Dates

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : ఆగస్టు 10, 2022
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 25, 2022 (రాత్రి 11:55 గంటల వరకు)
హాల్ టికెట్ల డౌన్ లోడ్: సెప్టెంబర్ 05, 2022 నుంచి..
రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్ 25, 2022

– TS High Court Jobs