Govt Job

TSPSC Assistant Motor Vehicle Inspectors Recruitment

TSPSC AMVI Recruitment : తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ (Telangana State Transport Department)లో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ (Assistant Motor Vehicle Inspectors-AMVI) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana State Public Service Commission-TSPSC) నోటిఫికేషన్ (Notification No.07/2022) జారీచేసింది. మొత్తం 113 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్షలో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Details of Vacancies

Multi Zone-I
OC(G)-15, (W)-07
EWS(G)-03, (W)-02
BC-A(G)-03, (W)-02
BC-B(G)-02, (W)-02
BC-C(G)-01
BC-D(G)-02, (W)-01
BC-E(G)-01, (W)-01
SC(G)-05, (W)-03
ST(G)-02, (W)-01
Sports(G)-01

Multi Zone-II
OC(G)-16, (W)-08
EWS(G)-04, (W)-02
BC-A(G)-03, (W)-02
BC-B(G)-02, (W)-02
BC-C(G)-01
BC-D(G)-02, (W)-01
BC-E(G)-01, (W)-02
SC(G)-05, (W)-03
ST(G)-02, (W)-02
Sports(G)-01

Qualifications

అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ (Mechanical Engineering) లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ (Automobile Engineering) లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లో మూడేళ్ల డిప్లొమా చేసినవారు కూడా అర్హులే.
అలాగే, హెవీ మోటార్ వెహికిల్స్ (రవాణా వాహనాలు) నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి.

Physical Requirements

పురుషుల ఎత్తు 165 సెం.మీ., ఛాతి 86.3 సెం.మీ. ఉండాలి. గాలి పీల్చినప్పుడు ఛాతి 5 సెం.మీ. విస్తరించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల ఎత్తు 160 సెం.మీ. కంటే తక్కువ ఉండకూడదు. ఛాతి 83.80 సెం.మీ. ఉండాలి. గాలి పీల్చినప్పుడు ఛాతి 5 సెం.మీ. విస్తరించాలి.
మహిళా అభ్యర్థుల ఎత్తు 157.5 సెం.మీ., ఛాతి 82.30 సెం.మీ. ఉండాలి. గాలి పీల్చినప్పుడు ఛాతి 5 సెం.మీ. విస్తరించాలి. ఎస్సీ/ ఎస్టీ మహిళా అభ్యర్థుల ఎత్తు 152.5 సెం.మీ. కంటే తక్కువ ఉండకూడదు. ఛాతి 79.80 సెం.మీ. ఉండాలి. గాలి పీల్చినప్పుడు ఛాతి 5 సెం.మీ. విస్తరించాలి.

Age Limit

జూలై 01, 2022 నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు నుంచి 39 సంవత్సరాల మధ్య ఉండాలి. జూలై 1, 2001 తర్వాత, జూలై 2, 1983 కు
ముందు జన్మించి ఉండకూడదు.
ఎస్సీ/ఎస్టీ/బీసీ/ ఈడబ్ల్యూఎస్/తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు (05) సంవత్సరాలు, మాజీ సైనికులు, ఎన్సీసీ అభ్యర్థులకు మూడు (03)
సంవత్సరాల సడలింపు ఉంది.
ఆర్టీసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పనిచేసే ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి రారు.

Salary : నెలకు రూ.45,960 నుంచి రూ.1,24,150.

Selection Procedure

రాత పరీక్షలో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తారు.
రాత పరీక్షలో రెండు పేపర్లు(పేపర్-1 & పేపర్-2) ఉంటాయి.
పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సబ్జెక్టుల నుంచి 150 ప్రశ్నలు ఇస్తారు. 150 మార్కులు ఉంటాయి. 150 నిమిషాలలో పరీక్ష
రాయాల్సి ఉంటుంది.
పేపర్-2లో ఆటోమొబైల్ ఇంజినీరింగ్ (డిప్లొమా లెవల్) నుంచి 150 ప్రశ్నలు ఇస్తారు. 300 మార్కులు ఉంటాయి. 150 నిమిషాలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
పేపర్-1 ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగు భాషలలో ఉంటుంది.
పేపర్-2 ప్రశ్న పత్రం కేవలం ఇంగ్లిష్ లోనే ఉంటుంది.
రాత పరీక్ష అనంతరం మెరిట్ సాధించిన అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఆహ్వానిస్తారు.
రాత పరీక్ష నవంబర్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది.
హాల్ టికెట్లు పరీక్షకు ఏడు రోజుల ముందు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Application & Examination Fee

ప్రతి అభ్యర్థి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు నిమిత్తం రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు నిమిత్తం రూ.120 చెల్లించాలి. నిరుద్యోగులు ఎగ్జామినేషన్ ఫీజు చెల్లిం
చాల్సిన అవసరం లేదు.

How to Apply

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు, TSPSC వెబ్ సైట్ (www.tspsc.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ (One Time Registration-OTR) చేసుకోవాలి. ఇప్పటికే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే టీఎస్ పీఎస్సీ ఐడీ (TSPSC ID), డేట్ ఆఫ్ బర్త్ (Date of Birth) తో దరఖాస్తు చేసుకోవచ్చు.

Important Dates

ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 05, 2022
ఫీజు చెల్లింపు, దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 05 సెప్టెంబర్, 2022 (సాయంత్రం 5 వరకు)

– TSPSC AMVI Recruitment

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago