TSPSC Divisional Accounts Officer Recruitment : తెలంగాణ రాష్ట్రంలోని డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ (Director of Works Accounts) విభాగంలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్-II (Divisional Accounts Officer-DAO (works) Grade-II) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana State Public Service Commission-TSPSC) నోటిఫికేషన్ (Notification No.08/2022) జారీచేసింది. మొత్తం 53 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మల్టీ జోన్-I లో 28 పోస్టులు, మల్టీ జోన్-II లో 25 పోస్టులు ఉన్నాయి. రాత పరీక్షలో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Details of Vacancies
Multi Zone-I
OC(G)-07, (W)-03
EWS(G)-02, (W)-01
BC-A(G)-01, (W)-01
BC-B(G)-01, (W)-01
BC-C(G)-01
BC-D(W)-01
BC-E(W)-01
SC(G)-03, (W)-02
ST(G)-01, (W)-01
PH(W)-01(VH)
Multi Zone-II
OC(G)-06, (W)-03
EWS(G)-01, (W)-01
BC-A(G)-01, (W)-01
BC-B(G)-01, (W)-01
BC-C(G)-01
BC-D(W)-01
BC-E(W)-01
SC(G)-02, (W)-02
ST(G)-01, (W)-01
PH(W)-01(VH)
Qualifications
అభ్యర్థులు సెంట్రల్ యాక్ట్/ స్టేట్ యాక్ట్/ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందిన దేశంలోని ఏదైనా యూనివర్సిటీ/ సంస్థలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
Age Limit
జూలై 01, 2022 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. జూలై 1, 2004 తర్వాత, జూలై 2, 1978కి ముందు జన్మించి ఉండకూడదు.
ఎస్సీ/ఎస్టీ/బీసీ/ ఈడబ్ల్యూఎస్/తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు (05) సంవత్సరాలు, మాజీ సైనికులు, ఎన్సీసీ అభ్యర్థులకు మూడు (03)
సంవత్సరాల సడలింపు ఉంది.
ఆర్టీసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పనిచేసే ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి రారు.
Salary : నెలకు రూ.45,960 నుంచి రూ.1,24,150
Selection Procedure
- ఈ ఉద్యోగాలు రాత పరీక్షలో వచ్చిన మారుల్లో మెరిట్ ఆధారంగా కల్పిస్తారు. రాత పరీక్ష అబ్జెక్టివ్ టైప్ విధానంలో ఉంటుంది.
- కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) లేదా ఆఫ్ లైన్ ఓఎమ్మార్ (OMR) బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు.
- రాత పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1 మరియు పేపర్-1) ఉంటాయి.
- పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సబ్జెక్టుల నుంచి 150 ప్రశ్నలు ఇస్తారు. 150 మార్కులు ఉంటాయి. 150 నిమిషాలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
- పేపర్-2లో అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ (పదో తరగతి స్థాయి) నుంచి 150 ప్రశ్నలు ఇస్తారు. 300 మార్కులు ఉంటాయి. 150 నిమిషాలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
- పేపర్-1 మరియు పేపర్-2 రెండు ప్రశ్నపత్రాలు కూడా ఇంగ్లిష్, తెలుగు భాషలలో ఉంటాయి.
- రాత పరీక్ష అనంతరం మెరిట్ సాధించిన అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఆహ్వానిస్తారు.
- రాత పరీక్ష డిసెంబర్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది.
- హాల్ టికెట్లు పరీక్షకు ఏడు రోజుల ముందు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు.
Application & Examination Fee
ప్రతి అభ్యర్థి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు నిమిత్తం రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు నిమిత్తం రూ.120 చెల్లించాలి. నిరుద్యోగులు ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
How to Apply
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు, TSPSC వెబ్ సైట్ (www.tspsc.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ (One Time Registration-OTR) చేసుకోవాలి. ఇప్పటికే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే టీఎస్పీఎస్సీ ఐడీ (TSPSC ID), డేట్ ఆఫ్ బర్త్ (Date of Birth) తో దరఖాస్తు చేసుకోవచ్చు.
Important Dates
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : ఆగస్టు 17, 2022
ఫీజు చెల్లింపు, దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: సెప్టెంబర్ 06, 2022 (సాయంత్రం 5 వరకు)
– TSPSC Divisional Accounts Officer Recruitment