TSPSC Divisional Accounts Officer Recruitment : తెలంగాణ రాష్ట్రంలోని డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ (Director of Works Accounts) విభాగంలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్-II (Divisional Accounts Officer-DAO (works) Grade-II) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana State Public Service Commission-TSPSC) నోటిఫికేషన్ (Notification No.08/2022) జారీచేసింది. మొత్తం 53 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మల్టీ జోన్-I లో 28 పోస్టులు, మల్టీ జోన్-II లో 25 పోస్టులు ఉన్నాయి. రాత పరీక్షలో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Multi Zone-I
OC(G)-07, (W)-03
EWS(G)-02, (W)-01
BC-A(G)-01, (W)-01
BC-B(G)-01, (W)-01
BC-C(G)-01
BC-D(W)-01
BC-E(W)-01
SC(G)-03, (W)-02
ST(G)-01, (W)-01
PH(W)-01(VH)
Multi Zone-II
OC(G)-06, (W)-03
EWS(G)-01, (W)-01
BC-A(G)-01, (W)-01
BC-B(G)-01, (W)-01
BC-C(G)-01
BC-D(W)-01
BC-E(W)-01
SC(G)-02, (W)-02
ST(G)-01, (W)-01
PH(W)-01(VH)
అభ్యర్థులు సెంట్రల్ యాక్ట్/ స్టేట్ యాక్ట్/ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందిన దేశంలోని ఏదైనా యూనివర్సిటీ/ సంస్థలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
జూలై 01, 2022 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. జూలై 1, 2004 తర్వాత, జూలై 2, 1978కి ముందు జన్మించి ఉండకూడదు.
ఎస్సీ/ఎస్టీ/బీసీ/ ఈడబ్ల్యూఎస్/తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు (05) సంవత్సరాలు, మాజీ సైనికులు, ఎన్సీసీ అభ్యర్థులకు మూడు (03)
సంవత్సరాల సడలింపు ఉంది.
ఆర్టీసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పనిచేసే ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి రారు.
Salary : నెలకు రూ.45,960 నుంచి రూ.1,24,150
ప్రతి అభ్యర్థి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు నిమిత్తం రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు నిమిత్తం రూ.120 చెల్లించాలి. నిరుద్యోగులు ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు, TSPSC వెబ్ సైట్ (www.tspsc.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ (One Time Registration-OTR) చేసుకోవాలి. ఇప్పటికే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే టీఎస్పీఎస్సీ ఐడీ (TSPSC ID), డేట్ ఆఫ్ బర్త్ (Date of Birth) తో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : ఆగస్టు 17, 2022
ఫీజు చెల్లింపు, దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: సెప్టెంబర్ 06, 2022 (సాయంత్రం 5 వరకు)
– TSPSC Divisional Accounts Officer Recruitment
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…