6th to 8th Admissions in MJPTBCWREISA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

6th to 8th Admissions in MJPTBCWREIS : మహాత్మా జ్యోతిబా ఫూలే వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్ (Mahatma Jyothiba Phule Telangana Backward Classes Welfare Residential Educational Institutions Society‌‌-MJPTBCWREIS) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న బీసీ బాలబాలికల పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికిగాను 6, 7, 8 తరగతులలో (ఇంగ్లిష్​ మీడియం, స్టేట్ సెలబస్​) ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది. ఈ సీట్లకు రాష్ట్రంలోని బీసీ, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఆసక్తి క​లిగిన విద్యార్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Eligibility

6వ తరగతిలో అడ్మిషన్​ కావలసిన విద్యార్థి ఏ జిల్లాలో అయితే అడ్మిషన్​ కోరుకుంటారో ఆ జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్​ లో 2022-23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి.
వయసు ఆగస్టు 31, 2023 నాటికి 12 సంవత్సరాలకు మించకూడదు.
ఎస్సీ, ఎస్టీలకు రెండు (02) సంవత్సరాల మినహాయింపు ఉంది.

7వ తరగతిలో అడ్మిషన్​ కావలసిన విద్యార్థి ఏ జిల్లాలో అయితే అడ్మిషన్​ కోరుకుంటారో ఆ జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్​ లో 2022-23 విద్యా సంవత్సరంలో 6వ తరగతి చదివి ఉండాలి
వయసు ఆగస్టు 31, 2023 నాటికి 13 సంవత్సరాలకు మించకూడదు.
ఎస్సీ, ఎస్టీలకు రెండు (02) సంవత్సరాల మినహాయింపు ఉంది.

8వ తరగతిలో అడ్మిషన్​ కావలసిన విద్యార్థి ఏ జిల్లాలో అయితే అడ్మిషన్​ కోరుకుంటారో ఆ జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్​ లో 2022-23 విద్యా సంవత్సరంలో 7వ తరగతి చదివి ఉండాలి.
వయసు ఆగస్టు 31, 2023 నాటికి 14 సంవత్సరాలకు మించకూడదు.
ఎస్సీ, ఎస్టీలకు రెండు (02) సంవత్సరాల మినహాయింపు ఉంది.

విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2021 -22, 2022-23 విద్యా సంవత్సరాల్లో  కంటిన్యూగా విద్యను అభ్యసించి ఉండాలి. Unified District Information System for Education (UDISE) ఆధారంగా విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు.

Income Limit

విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంరక్షకుల కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000 మించకూడదు.

Entrance Test

  • ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ టైపులో ఉంటుంది.
  • మొత్తం 100 మార్కులు ఉంటాయి.
  • తెలుగు నుంచి 15 ప్రశ్నలు, మ్యాథ్స్​ నుంచి 30 ప్రశ్నలు, సామాన్య శాస్త్రం నుంచి 15 ప్రశ్నలు, సాంఘిక శాస్త్రం నుంచి 15 ప్రశ్నలు, ఇంగ్లిష్​ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు.
  • 5, 6, 7వ తరగతుల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
  • జవాబులను ఓఎంఆర్ షీట్​లో గుర్తించాలి.
  • పరీక్ష ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్​లో ఉంటుంది.
  • పరీక్ష 2 గంటలలో రాయాలి.
  • పరీక్ష కేంద్రం విద్యార్థి సొంత జిల్లాలోనే ఉంటుంది.
  • పరీక్ష కేంద్రం వివరాలు హాల్ టికెట్​లో ఇస్తారు.

Selection Process

  • అర్హులైన విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మార్కుల్లో మెరిట్​, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరి (అనాథ), అభ్యర్థి కోరిన పాఠశాల ప్రాధాన్యతల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
  • పాత జిల్లాల ప్రాతిపదికన పరీక్ష నిర్వహించి సీట్లు కేటాయిస్తారు.
  • బీసీ(ఏ) విద్యార్థులకు 15 శాతం సీట్లు, బీసీ(బీ) విద్యార్థులకు 25 శాతం, బీసీ(సీ) విద్యార్థులకు 3 శాతం, బీసీ(డీ) విద్యార్థులకు 17 శాతం, బీసీ(ఈ) విద్యార్థులకు 10 శాతం, ఎస్సీ విద్యార్థులకు 15 శాతం, ఎస్టీ విద్యార్థులకు 17 శాతం, ఎంబీసీ విద్యార్థులకు 5 శాతం, ఈబీసీ, ఇతరులకు 2 శాతం, అనాథలకు 3 శాతం సీట్లు కేటాయిస్తారు.
  • ఎంపికలో సమానమైన ర్యాంకు ఒకరికంటే ఎక్కువమందికి వచ్చినప్పుడు పుట్టిన తేదీ, గణితం  మరియు పరిసరాల విజ్ఞానం (ఎన్విరాన్​మెంటల్​ సైన్స్​)లో పొందిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు.
  • ఏదైనా రిజర్వేషన్ కేటగిరీలో విద్యార్థులు లేకుంటే ఆ రిజర్వేషన్ ఖాళీలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం తదుపరి రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు కేటాయిస్తారు.
  • ప్రత్యేక కేటగిరీలకు సంబంధించిన (అనాథ) ఖాళీలు మిగిలితే ఆ ఖాళీలను తదుపరి రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు మెరిట్ ప్రాతిపదికన కేటాయిస్తారు.

How to Apply

రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో ఆయా గురుకుల పాఠశాలల్లో 6, 7, 8 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లు వివరాలు మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPTBCWREIS) వెబ్​సైట్​ (https://mjpabcwreis.cgg.gov.in/) లో ఉంచారు. విద్యార్థులు ముందు వాటిని పరిశీలించాలి. ఆ తర్వాత ఆసక్తి క​లిగిన అర్హులైన విద్యార్థులు మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPTBCWREIS) వెబ్​సైట్​ (https://mjpabcwreis.cgg.gov.in/)ను ఓపెన్​ చేయాలి. అందులో MJPTBCW RJC/RDC & BACKLOG CET – 2023 పై క్లిక్​ చేయాలి. అందులో Notification – MJPTBCW VI-VIII CLASS-2023 పక్కన ఉన్న Online Payment పై క్లిక్​ చేయాలి. అందులో వివరాలన్నీ నింపి రూ.100 ఫీజు ఆన్​లైన్​లోనే చెల్లించాలి.

ఫీజు చెల్లించిన తర్వాత జర్నల్​ నంబర్​ వస్తుంది. దానిని నోట్​ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్లీ వెనక్కి వచ్చి Online Application పై క్లిక్​ చేయాలి. అందులో జర్నల్​ నెంబర్​, పేమెంట్​ డేట్​, డేట్​ ఆఫ్​ బర్త్​ ఎంటర్​ చేసి, ఫొటో, సంతకం స్కాన్​ చేసి అప్​లోడ్​ చేసి Next పై క్లిక్​ చేయాలి. అప్పు అప్లికేషన్​ ఫాం వస్తుంది. అందులోని వివరాలన్నీ నింపి, సంబంధిత సర్టిఫికెట్లు అప్​ లోడ్​ చేయాలి. ఆన్లైన్లో దరఖాస్తును పంపిన తరువాత కాపీని ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి.

Required Certificates

దరఖాస్తు చేసుకొనే సమయానికి విద్యార్థి వద్ద కుల ధ్రువీకరణ, ఆదాయ ధృవీకరణ, ప్రత్యేక కేటగిరి ధృవీకరణ, స్టడీ, బోనఫైడ్ సర్టిఫికెట్, పుట్టిన తేదీ తదితర సర్టిఫికెట్లు (ఒరిజినల్) పొంది యుండాలి. ఒకవేళ దరఖాస్తు సమయానికి లేని లేకపోయినా అడ్మిషన్​ సమయానికైనా తీసుకోవాలి.

దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు మహాత్మా జ్యోతిబాఫూలే వెనకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయం, రూం. నెం. 206, 2వ అంతస్తు, డి. ఎస్. ఎస్. భవన్ మాసాబ్ ట్యాంక్, హైదరాబాద్, ఫోన్ నెం.040-23328266, 23322377 ను సంప్రదించి పరిష్కారం పొందవచ్చు.

  • ఆన్​లైన్​ దరఖాస్తులకు చివరి తేదీ : ఏప్రిల్​ 20, 2023
  • ప్రవేశ పరీక్ష తేదీ : మే​ 10, 2023, ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు

– 6th to 8th Admissions in MJPTBCWREIS