6th to 8th Admissions in MJPTBCWREIS : మహాత్మా జ్యోతిబా ఫూలే వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్ (Mahatma Jyothiba Phule Telangana Backward Classes Welfare Residential Educational Institutions Society-MJPTBCWREIS) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న బీసీ బాలబాలికల పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికిగాను 6, 7, 8 తరగతులలో (ఇంగ్లిష్ మీడియం, స్టేట్ సెలబస్) ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది. ఈ సీట్లకు రాష్ట్రంలోని బీసీ, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
6వ తరగతిలో అడ్మిషన్ కావలసిన విద్యార్థి ఏ జిల్లాలో అయితే అడ్మిషన్ కోరుకుంటారో ఆ జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్ లో 2022-23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి.
వయసు ఆగస్టు 31, 2023 నాటికి 12 సంవత్సరాలకు మించకూడదు.
ఎస్సీ, ఎస్టీలకు రెండు (02) సంవత్సరాల మినహాయింపు ఉంది.
7వ తరగతిలో అడ్మిషన్ కావలసిన విద్యార్థి ఏ జిల్లాలో అయితే అడ్మిషన్ కోరుకుంటారో ఆ జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్ లో 2022-23 విద్యా సంవత్సరంలో 6వ తరగతి చదివి ఉండాలి
వయసు ఆగస్టు 31, 2023 నాటికి 13 సంవత్సరాలకు మించకూడదు.
ఎస్సీ, ఎస్టీలకు రెండు (02) సంవత్సరాల మినహాయింపు ఉంది.
8వ తరగతిలో అడ్మిషన్ కావలసిన విద్యార్థి ఏ జిల్లాలో అయితే అడ్మిషన్ కోరుకుంటారో ఆ జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్ లో 2022-23 విద్యా సంవత్సరంలో 7వ తరగతి చదివి ఉండాలి.
వయసు ఆగస్టు 31, 2023 నాటికి 14 సంవత్సరాలకు మించకూడదు.
ఎస్సీ, ఎస్టీలకు రెండు (02) సంవత్సరాల మినహాయింపు ఉంది.
విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2021 -22, 2022-23 విద్యా సంవత్సరాల్లో కంటిన్యూగా విద్యను అభ్యసించి ఉండాలి. Unified District Information System for Education (UDISE) ఆధారంగా విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు.
విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంరక్షకుల కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000 మించకూడదు.
రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో ఆయా గురుకుల పాఠశాలల్లో 6, 7, 8 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లు వివరాలు మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPTBCWREIS) వెబ్సైట్ (https://mjpabcwreis.cgg.gov.in/) లో ఉంచారు. విద్యార్థులు ముందు వాటిని పరిశీలించాలి. ఆ తర్వాత ఆసక్తి కలిగిన అర్హులైన విద్యార్థులు మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPTBCWREIS) వెబ్సైట్ (https://mjpabcwreis.cgg.gov.in/)ను ఓపెన్ చేయాలి. అందులో MJPTBCW RJC/RDC & BACKLOG CET – 2023 పై క్లిక్ చేయాలి. అందులో Notification – MJPTBCW VI-VIII CLASS-2023 పక్కన ఉన్న Online Payment పై క్లిక్ చేయాలి. అందులో వివరాలన్నీ నింపి రూ.100 ఫీజు ఆన్లైన్లోనే చెల్లించాలి.
ఫీజు చెల్లించిన తర్వాత జర్నల్ నంబర్ వస్తుంది. దానిని నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్లీ వెనక్కి వచ్చి Online Application పై క్లిక్ చేయాలి. అందులో జర్నల్ నెంబర్, పేమెంట్ డేట్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, ఫొటో, సంతకం స్కాన్ చేసి అప్లోడ్ చేసి Next పై క్లిక్ చేయాలి. అప్పు అప్లికేషన్ ఫాం వస్తుంది. అందులోని వివరాలన్నీ నింపి, సంబంధిత సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి. ఆన్లైన్లో దరఖాస్తును పంపిన తరువాత కాపీని ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి.
దరఖాస్తు చేసుకొనే సమయానికి విద్యార్థి వద్ద కుల ధ్రువీకరణ, ఆదాయ ధృవీకరణ, ప్రత్యేక కేటగిరి ధృవీకరణ, స్టడీ, బోనఫైడ్ సర్టిఫికెట్, పుట్టిన తేదీ తదితర సర్టిఫికెట్లు (ఒరిజినల్) పొంది యుండాలి. ఒకవేళ దరఖాస్తు సమయానికి లేని లేకపోయినా అడ్మిషన్ సమయానికైనా తీసుకోవాలి.
దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు మహాత్మా జ్యోతిబాఫూలే వెనకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయం, రూం. నెం. 206, 2వ అంతస్తు, డి. ఎస్. ఎస్. భవన్ మాసాబ్ ట్యాంక్, హైదరాబాద్, ఫోన్ నెం.040-23328266, 23322377 ను సంప్రదించి పరిష్కారం పొందవచ్చు.
– 6th to 8th Admissions in MJPTBCWREIS
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…