8th Class Admissions in RIMC : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో గల రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (Rashtriya Indian Military College-RIMC) లో జూలై-2023 టర్మ్ కు 8వ తరగతిలో ప్రవేశానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana State Public Service Commission-TSPSC) నోటిఫికేషన్ (Notification No. 05/2022) జారీ చేసింది. రాత పరీక్ష, వైవా వోస్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి కాలేజీలో అడ్మిషన్లు కల్పిస్తారు.
Eligibility
ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్న విద్యార్థులు, 7వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.
Age Limit
జూలై 01, 2023 నాటికి విద్యార్థుల వయసు పదకొండున్నర సంవత్సరాలకు తక్కువ ఎక్కువ ఉండకూడదు. పదమూడు (13) సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. జూలై 02, 2010కి ముందు, జనవరి 01, 2012 తర్వాత జన్మించి ఉండకూడదు.
Scheme of Examination
Written Examination
రాత పరీక్ష డిసెంబర్ 03, 2022న (శనివారం) ఉంటుంది.
గణితం, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్ సబ్జెక్టులలో పరీక్ష నిర్వహిస్తారు.
గణితం పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటుంది.
జనరల్ నాలెడ్జ్ పరీక్ష మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉంటుంది.
ఇంగ్లిష్ పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు ఉంటుంది.
Viva Voce
రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని మాత్రమే వైవా వోస్ కు పిలుస్తారు.
వైవా వోస్ లో మేధస్సు (Intelligence), వ్యక్తిత్వం (Personality), కమ్యూనికేషన్ నైపుణ్యాలు (Communication skills) తదితర అంశాలలో ప్రశ్నలు అడుగుతారు.
వైవా వోస్ నిర్వహించే తేదీ, స్థలం తర్వాత తెలియజేస్తారు.
Medical Examination
రాత పరీక్ష, వైవా వోస్ లో అర్హత సాధించిన విద్యార్థులకు సమీపంలోని మిలిటరీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
నిబంధనల మేరకు ఫిట్ గా ఉన్న విద్యార్థులకు మాత్రమే రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో అడ్మిషన్లు కల్పిస్తారు.
నిబంధనలలో వైద్య పరీక్షలు ఒక భాగం మాత్రమే. వైద్య పరీక్షలకు హాజరైన అందరికీ ప్రవేశాలు కల్పించరు.
ఈ ప్రవేశాలకు సంబంధించిన అన్ని వివరాలు రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ వెబ్ సైట్ లోనే పొందుపరుస్తారు.
విద్యార్థులు తరచూ వెబ్ సైట్ ను పరిశీలిస్తూ ఉండాలి.
తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు రాత పరీక్ష హైదరాబాద్ లో ఉంటుంది.
Annual Fee
వార్షిక ఫీజు జనరల్ (General) విద్యార్థులకు రూ.77,500, ఎస్సీ, ఎస్టీ (SC/ST) విద్యార్థులకు రూ.63,900 ఉంటుంది.
అడ్మిషన్ సమయంలో వార్షిక ఫీజుతో పాటు రూ.30 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
కాలేజీలో విద్యార్థి చదువు పూర్తై వెళ్లిపోయేప్పుడు ఈ ఫీజు తిరిగి ఇచ్చేస్తారు.
Procedure to Obtain Application forms
ప్రాస్పెక్టస్-కమ్-అప్లికేషన్ ఫాం, పాత ప్రశ్నపత్రాల బుక్ లెట్ ను రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ నుంచి రెండు పద్ధతులలో పొందవచ్చు.
Online Payment
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ వెబ్ సైట్ (www.rimc.gov.in) లోకి లాగిన్ కావాలి.
జనరల్ (General) విద్యార్థులు రూ.600, ఎస్సీ/ఎస్టీ (SC/ST) విద్యార్థులు రూ.555 ఆన్ లైన్ లో చెల్లించాలి.
ఫీజు అందిన తర్వాత ప్రాస్పెక్టస్-కమ్-అప్లికేషన్ ఫాం, పాత ప్రశ్నపత్రాల బుక్ లెట్ ను స్పీడ్ పోస్ట్ ద్వారా విద్యార్థి ఇంటికి పంపిస్తారు.
By Demand draft
డీడీ (Demand draft) పంపించి కూడా ప్రాస్పెక్టస్-కమ్-అప్లికేషన్ ఫాం, పాత ప్రశ్నపత్రాల బుక్ లెట్ ను తెప్పించుకోవచ్చు.
“The Commandant RIMC Dehradun” పేరిట State Bank of India, Tel Bhavan, Dehradun. (Bank Code: 01576), Uttarakhand లో చెల్లుబాటు అయ్యేలా జనరల్ విద్యార్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.555 డీడీ తీయాలి.
ప్రాస్పెక్టన్-కమ్-అప్లికేషన్ ఫాం, పాత ప్రశ్నపత్రాల బుక్ లెట్ పంపించాలని అభ్యర్ధన పత్రం రాసి, డీడీతో పాటు కుల ధ్రువీకరణ పత్రంను The Rastriya Indian Military College, Garhi Cantt, Dehradun. Uttarakhand, PIN-248003 చిరునామాకు పంపించాలి.
విద్యార్థి చిరునామా, పిన్ కోడ్, ఫోన్ నెంబర్ స్పష్టంగా, పెద్ద అక్షరాలలో (Capital Letters) రాయాలి.
పోస్టల్ జాప్యానికి రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ బాధ్యత వహించదు.
Documents to be Submitted
స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికి వచ్చిన దరఖాస్తు ఫాంకు ఈ క్రింది సర్టిఫికెట్లు జత చేయాలి.
1. బర్త్ సర్టిఫికెట్ (Birth Certificate) (మున్సిపాలిటీ/గ్రామ పంచాయతీ జారీ చేసినది)
2. నివాస ధ్రువీకరణ పత్రం (Domicile Certificate)
3. ఎస్సీ/ఎస్టీ సర్టిఫికెట్ (SC/ST Students)
4. విద్యార్థి ప్రస్తుతం చదువుతున్న పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థి పుట్టిన తేదీ, తరగతిని ధ్రువీకరిస్తూ జారీ చేసిన సర్టిఫికెట్ జతచేయాలి. దానిపై విద్యార్థి ఫొటో కూడా ఉండాలి. ఇది ఒరిజినల్ సర్టిఫికెట్ అందజేయాలి.
5. విద్యార్థి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ. రెండు వైపులా ఉండాలి.
6. రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు
How to Apply
స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికి వచ్చిన దరఖాస్తు ఫాంకు పైన సూచించిన ధ్రువీకరణ పత్రాలను జతచేసి అక్టోబర్ 15, 2022 లోపు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, నాంపల్లి, హైదరాబాద్ – 500001 (Telangana State Public Service Commission, Nampally, Hyderabad-500003) చిరునామాకు పంపించాలి. డెహ్రాడూన్ లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీకి పంపించకూడదు.
– 8th Class Admissions in RIMC