Jobs in ICMR NIN : భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని ఆరోగ్య పరిశోధన విభాగం (Department of Health Research, Ministry of Health and Family Welfare, Government of India)లో హైదరాబాద్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(Indian Council of Medical Research – ICMR), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (National Institute of Nutrition – NIN)లో ప్రాజెక్ట్ కన్సల్టెంట్ (అడ్మినిస్ట్రేషన్) Project Consultant (Administration), ప్రాజెక్ట్ కన్సల్టెంట్ (అకౌంట్స్) Project Consultant (Accounts) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం మూడు (03) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు.
Details of Posts
1. Project Consultant (Administration) – 02 Posts (Unreserved-UR)
2. Project Consultant (Accounts) – 01 Posts (Unreserved-UR)
Qualification
Project Consultant (Administration) :
ప్రాజెక్ట్ కన్సల్టెంట్ (అడ్మినిస్ట్రేషన్) ఉద్యోగాలకు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి.. అడ్మినిస్ట్రేషన్‌లో 10 సంవత్సరాల పని అనుభవం ఉన్నవారు అర్హులు. ఎంబీఏ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ పోస్టుకు అడ్మినిస్ట్రేషన్‌లో 10 సంవత్సరాల పని అనుభవం రిటైర్డ్ ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Project Consultant (Accounts) :
ప్రాజెక్ట్ కన్సల్టెంట్ (అకౌంట్స్) ఉద్యోగాలకు కామర్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి.. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ లో 10 సంవత్సరాల పని అనుభవం ఉన్నవారు అర్హులు. ఎంబీఏ లేదా ఎం.కామ్ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ పోస్టుకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌లో 10 సంవత్సరాల పని అనుభవం రిటైర్డ్ ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Salary
పై ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60,000 జీతం చెల్లిస్తారు.
Age Limit
ఈ పోస్టులకు 70 సంవత్సరాల లోపు అర్హులైన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
How to Attend Interview
అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు హైదరాబాద్‌లోని ICMR – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) కు చెందిన వెబ్సైట్ (https://www.nin.res.in/) నుంచి దరఖాస్తు ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. ముందుగా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అందులో Careers పైన క్లిక్ చేయాలి. అందులో Download Application Form for all posts పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో రీసెంట్ పాస్ట్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి. దానికి అన్ని విద్యార్హతలు, అనుభవంనకు సంబంధించిన జిరాక్స్ సర్టిఫికెట్లు జతచేయాలి. వాటన్నింటితో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని ఇంటర్వ్యూ నిర్వహించే రోజు ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల మధ్య దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.
Important Points
- పై పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి. కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థి కనీసం ఒక సంవత్సరం పాటు పని చేయాల్సి ఉంటుంది.
- మధ్యలో మానేస్తే తీసుకున్న జీతం తిరిగి చెల్లించాలి.
- ఎంపికైన అభ్యర్థులు ICMR నిధులతో “డైట్ అండ్ బయోమార్కర్ సర్వే ఇన్ ఇండియా (DABS-I)” పేరుతో చేపట్టే పాన్ ఇండియా స్టడీకోసం పనిచేయాల్సి ఉంటుంది.
- ఎంపికైనవారి వివరాలు ICMR-NIN మరియు ICMR వెబ్సైట్లలో పెడతారు.
- వ్యక్తిగతంగా ఇ-మెయిల్ లేదా ఫోన్ ద్వారా తెలియజేయరు.
- ఇంటర్వ్యూకు హాజరయ్యే వారికి టీఏ, టీఏ లాంటివి ఇవ్వరు.
- అభ్యర్థులు తమ సొంత ఖర్చులతో హాజరు కావాలి.
Interview Schedule
Date : 20.03.2023
Time : 9:30 AM to 11:30 AM
Venue :
ICMR – NationalInstitute of Nutrition,
Jamai Osmaia Post, Tarnaka,
Hyderabad-500007, Telangana State.
– Jobs in ICMR NIN