Para Medical Jobs in NagarkurnoolA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Paramedical Jobs in Nagarkurnool : నాగర్​కర్నూల్​ జిల్లాలో ఎన్​హెచ్​ఎం ప్రోగ్రామ్​లో వివిధ పారామెడికల్​ పోస్టుల భర్తీకి జిల్లా వైద్యాధికారి నోటిఫికేషన్​ విడుదల చేశారు. మొత్తం 26 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. విద్యార్హతల్లో మెరిట్​, రూరల్​ ఆఫ్​ రిజర్వేషన్​ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా నాగర్​కర్నూల్​ జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

Details of Posts

1. పీడియాట్రిషన్​ (Pediatrician)
2. మెడికల్ ఆఫీసర్ డెంటల్ (Medical Officer Dental)
3. ఫిజియోథెరపిస్ట్ (Physiotherapist)
4. ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్ (Audiologist & Speech Therapist)
5. సైకాలజిస్ట్ (Psychologist)
6. ఆప్టోమెట్రిస్ట్ (Optometrist)
7. ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్​ ఎడ్యుకేటర్​ (Early Interventionist cum Special Educator)
8. సోషల్​ వర్కర్​ (Social Worker)
9. ల్యాబ్ టెక్నీషియన్ (Lab Technician)
10. స్టాఫ్ నర్స్ (Staff Nurse)
11. డెంటల్ టెక్నీషియన్ (Dental Technician)
12.మేనేజర్ (Manager)
13.ఫార్మసిస్ట్ (Pharmacist)
14.ఎంపీహెచ్​ఏ(ఎఫ్​)/ఏఎన్​ఎం (MPHA(F)/ANM)

Posts Wise Details

పీడియాట్రిషన్​ (Pediatrician) :
పోస్టుల సంఖ్య : 01
అర్హతలు : ఎంబీబీఎస్​(MBBS), ఎండీ (పీడియాట్రిషన్) (MD(Paed))లేదా డీసీహెచ్​ (DCH)
జీతం : రూ.లక్ష

మెడికల్ ఆఫీసర్ డెంటల్ (Medical Officer Dental) :
పోస్టుల సంఖ్య : 01
అర్హతలు : బీడీఎస్​ (BDS)
జీతం : రూ.32,500

ఫిజియోథెరపిస్ట్ (Physiotherapist) :
పోస్టుల సంఖ్య : 03
అర్హతలు : బీపీ(BPT)
జీతం : రూ.26,000

ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్ (Audiologist & Speech Therapist) :
పోస్టుల సంఖ్య : 01
అర్హతలు : స్పీచ్​ అండ్​ లాంగ్వేజ్​ పాథాలజీలో డిగ్రీ
జీతం : రూ.28,000

సైకాలజిస్ట్ (Psychologist) :
పోస్టుల సంఖ్య : 01
అర్హతలు : సైకాలజీలో మాస్టర్​ డిగ్రీ / రిహాబిలిటేషన్​లో ఎం.ఫిల్​, మాస్టర్​ డిగ్రీ ఇన్​ సైకాలజీ (రిహాబిలిటేషన్​ సైకాలజిస్ట్​/ క్లినికల్​ సైకాలజిస్ట్​)
జీతం : రూ.26,000

ఆప్టోమెట్రిస్ట్ (Optometrist) :
పోస్టుల సంఖ్య : 01
అర్హతలు : ఆప్టోమెట్రీలో బ్యాచిలర్​ డిగ్రీ లేదా మాస్టర్​ డిగ్రీ
జీతం : రూ.26,000

ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్​ ఎడ్యుకేటర్​ (Early Interventionist cum Special Educator) :
పోస్టుల సంఖ్య : 01
అర్హతలు : డిజేబిలిటీ స్టడీస్​లో ఎమ్మెస్సీ మరియు బీపీటీ/బీఓటీ/ఎంబీబీఎస్​/బీఏఎంఎస్​/బీహెచ్​ఎంఎస్​
జీతం : రూ.28,000

సోషల్​ వర్కర్​ (Social Worker) :
పోస్టుల సంఖ్య : 01
అర్హతలు : మాస్టర్​ ఆఫ్​ సోషల్​ వర్క్​ / సోషల్​ సైన్స్​
జీతం : రూ.19,500

ల్యాబ్ టెక్నీషియన్ (Lab Technician) :
పోస్టుల సంఖ్య : 02
అర్హతలు : ఇంటర్మీడియట్​, డీఎంఎల్​టీ (DMLT) లేదా బీఎస్సీ (ఎల్​టీ) B.Sc(LT)
జీతం : రూ.27,300

స్టాఫ్ నర్స్ (Staff Nurse) :
పోస్టుల సంఖ్య : 05
అర్హతలు : జీఎన్​ఎం (GNM) లేదా బీఎస్సీ (నర్సింగ్​) B.Sc(Nursing)
జీతం : రూ.29,900

డెంటల్ టెక్నీషియన్ (Dental Technician) :
పోస్టుల సంఖ్య : 01
అర్హతలు : ఎస్సెస్సీ, డిప్లొమా ఇన్​ డెంటల్​ టెక్నీషియన్​
జీతం : రూ.20,500

మేనేజర్ (Manager) :
పోస్టుల సంఖ్య : 01
అర్హతలు : మాస్టర్​ ఇన్​ డిజేబిలిటీ రిహాబిలిటేషన్​ అడ్మినిస్ట్రేషన్​
జీతం : రూ.39,000

ఫార్మసిస్ట్ (Pharmacist) :
పోస్టుల సంఖ్య : 02
అర్హతలు : బీ.ఫార్మసీ / డీ.ఫార్మసీ / ఫార్మా-డీ
జీతం : రూ.27,300

ఎంపీహెచ్​ఏ(ఎఫ్​)/ఏఎన్​ఎం (MPHA(F)/ANM) :
పోస్టుల సంఖ్య : 05
అర్హతలు : ఎస్సెస్సీ, ఎంపీహెచ్​ఏ(ఎఫ్​) లేదా ఇంటర్మీడియట్​, వొకేషనల్​ ఎంపీహెచ్​ఏ(ఎఫ్​)
జీతం : రూ.27,300

 Age Limit

పై అన్ని పోస్టులకు  అభ్యర్థుల వయసు జనవరి 01, 2023 నాటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. మాజీ సైనికులకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.

How to Apply

ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు నాగర్​కర్నూల్​ జిల్లా అధికారిక వెబ్ సైట్ (www.nagarkurnool.telangana.gov.in)లో నిర్ణీత ఫార్మాట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి.

అప్లికేషన్ ఫాంకు ఈ కింది సర్టిఫికెట్లు జతచేయాలి.
1. పదో తరగతి (SSC) మెమో
2. ఇంటర్మీడియట్ మెమో
3. అన్ని అర్హత పరీక్షల సర్టిఫికెట్లు
4. అన్ని పరీక్షల మార్కుల మెమోలు
5. సంబంధిత మెడికల్ కౌన్సిళ్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు
6. కులం సర్టిఫికెట్
7. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు (ప్రైవేటులో చదివిన వారు రెసిడెన్స్ సర్టిఫికెట్)
8. దివ్యాంగులు వైకల్య సర్టిఫికెట్
9. మాజీ సైనికులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు
10. అక్నాలెడ్జ్ మెంట్ కార్డ్
ఆ మొత్తం సర్టిఫికెట్లను మే 29, 2023 సాయంత్రం 4 గంటలలోపు నాగర్​కర్నూల్​ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలి. అర్హులైన అభ్యర్థులను జిల్లా కలెక్టర్​ నేతృత్వంలోని కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.

పూర్తి వివరాలకు www.nagarkurnool.telangana.gov.in వెబ్​సైట్​ను సంప్రదించవచ్చు.

Importanat Points

  • ఈ ఉద్యోగాలు పూర్తిగా తాత్కాలికమైనవి.
  • కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం పనిచేయాల్సి ఉంటుంది.

– Paramedical Jobs in Nagarkurnool