Radiographer Posts in Diagnostics Centres : తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్, నారాయణపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కేంద్రాల్లో రేడియోగ్రాఫర్ (Radiographer) ఉద్యోగాల భర్తీకి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ (Commissioner, Health & Family Welfare (chfw) and Mission Director, NHM) నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం నాలుగు కేంద్రాల్లో నాలుగు (04) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Details of Posts
రేడియోగ్రాఫర్ (Radiographer) (మొత్తం పోస్టులు - 04)
ఇవి జోనల్ పోస్టులు. ఈ కింది జిల్లాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
1. నాగర్‌కర్నూల్ (జోన్ -VII (జోగులాంబ గద్వాల్)) - 01
2. నారాయణపేట (జోన్ -VII (జోగులాంబ గద్వాల్)) - 01
3. రంగారెడ్డి (జోన్ -VI (చార్మినార్)) - 01
4. మేడ్చల్ మల్కాజ్గిరి (జోన్ -VI (చార్మినార్)) - 01
Qualifications
డిప్లొమా (Diploma) / బీ.ఎస్సీ(రేడియోగ్రఫీ) B.Sc. (Radiography) /డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ (DMIT) చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.
Remuneration Per Month
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం నెలకు రూ.30,000 చెల్లిస్తారు.
Age Limit
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల 01, జులై 2023 నాటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. మాజీ సైనికులకు (ex-service women) మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ (SC, ST & BC) అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు (Disabled Persons) పది సంవత్సరాల సడలింపు ఉంది.
Selection Criteria
క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ లో అన్ని సంవత్సరాలలో పొందిన మార్కుల శాతం ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. జోన్ వైజ్ మెరిట్ జాబితాను తయారు చేస్తారు. ఎంపిక కూడా జోన్ వైజ్ ఉంటుంది.
How to Apply
అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా https://forms.gle/oXbXzU1MtYi1bbv79 లింక్‌ను ఓపెన్ చేయాలి. అందులో వివరాలన్నీ నింపాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫాం నింపి సబ్మిట్ చేయాలి. అనంతరం ఆ అప్లికేషన్ ఫాంను డౌన్లోడ్ చేసుకోవాలి. దానిపై సంతకం చేసి, దానికి ఈ కింది సర్టిఫికెట్లు జతచేయాలి.
1. ఎస్సెస్సీ మెమో
2. ఇంటర్మీడియెట్ మెమో
3. క్యాస్ట్ సర్టిఫికెట్
4. దివ్యాంగులు, మాజీ సైనికులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు
5. బోనఫైడ్ సర్టిఫికెట్లు (1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు)
6. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికెట్లు
7. ప్రొవిజినల్ సర్టిఫికెట్
8. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
9. ఒకటి రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
పై అన్ని సర్టిఫికెట్లు ఈ కింది అడ్రస్‌లో ( ఆఫీస్ టైంలో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు) అందజేయాలి.
O/o the Commissioner of Health & Family Welfare & Mission Director,
National Health Mission,
4TH Floor, DME Building,
DM&HS Campus, Koti, Hyderabad.
ఆన్లైన్లో దరఖాస్తుల సమర్ఫణకు చివరి తేదీ : 30 మార్చి, 2023, సాయంత్రం 5 గంటల వరకు
సబ్మిట్ చేసిన దరఖాస్తు ఫాం అందజేయడానికి చివరి తేదీ : 31 మార్చి, 2023, సాయంత్రం 5 గంటల వరకు
Important Points
- ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి.
- కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం పనిచేయాలి.
వెబ్ సైట్ : https://forms.gle/fvaXHLb9fSrqf4qg9
– Radiographer Posts in Diagnostics Centres