Admissions in Sircilla FAAA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Admissions in Sircilla FAA : తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Tribal Welfare Residential Educational Institutions Society-TTWREIS) ఆధ్వర్యంలో కొనసాగుతున్న సిరిసిల్లలోని తెలంగాణ ట్రైబల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఫైన్​ ఆర్ట్స్​ అకాడమీ (ఉమెన్​) (TTWR Fine Arts Academy (Women))లో 2023‌‌-24 విద్యా సంవత్సరానికి గాను బీఏ(ఆనర్స్​) ఫ్యాషన్​ డిజైన్​, బీఏ(ఆనర్స్​) ఇంటీరియర్​ డిజైన్​, బీఏ(ఆనర్స్​) ఫొటోగ్రఫీ అండ్​ డిజిటల్​ ఇమేజింగ్​ డిగ్రీ కోర్సుల్లో ఫస్ట్​ ఇయర్​లో ప్రవేశానికి నోటిఫికేషన్​ వెలువడింది. ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్​ మార్కుల్లో మెరిట్​, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

Details of Courses

1. బీఏ(ఆనర్స్​) ఫ్యాషన్​ డిజైన్ (BA (Hons) Fashion Design)
2. బీఏ(ఆనర్స్​) ఇంటీరియర్​ డిజైన్ (BA (Hons) Interior Design)
3. బీఏ(ఆనర్స్​) ఫొటోగ్రఫీ అండ్​ డిజిటల్​ ఇమేజింగ్ (BA (Photography & Digital Imaging)

Number Seats

బీఏ(ఆనర్స్​) ఫ్యాషన్​ డిజైన్ కోర్సులో 60 సీట్లు,  బీఏ(ఆనర్స్​) ఇంటీరియర్​ డిజైన్ కోర్సులో 40 సీట్లు, బీఏ(ఆనర్స్​) ఫొటోగ్రఫీ అండ్​ డిజిటల్​ ఇమేజింగ్ కోర్సులో 20 సీట్లు ఉన్నాయి.

Course Duration

ఈ కోర్సుల వ్యవధి మూడు సంవత్సరాలు ఉంటుంది.

Eligibility

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్ కళాశాలలో 2021-22 విద్యా సంవత్సరంలో ఏదైనా కోర్సులో ఇంటర్మీడియట్​ పూర్తిచేసిన, 2022-23 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్​ పూర్తిచేయబోయే మహిళా అభ్యర్థులు అర్హులు.
  • 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులు కావాలి.
  • జూలై 1 నాటికి 16 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు.
  • ఎన్​సీసీ/గేమ్స్ అండ్​ స్పోర్ట్స్/ఎక్స్-సర్వీస్‌మెన్/అనాథ/ఏఈక్యూకి చెందిన విద్యార్థులకు రిజర్వేషన్ ప్రకారం సంబంధిత కమ్యూనిటీ కోటా కింద ఈ కేటగిరీలన్నింటికీ ఒక్కో కేటగిరీలో సీట్లు కేటాయించబడతాయి.
  • విద్యార్థిని తల్లిదండ్రుల వార్షిక ఆదాయం సంవత్సరానికి పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000 మించకూడదు.
  • ఇందుకు సంబంధించి తహసీల్దార్​ జారీచేసిన సర్టిఫికెట్​ జతపరచవలసి ఉంటుంది.
  • తెలుగు/ఇంగ్లిష్​ రెండు మీడియంలలో చదివిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

How to Apply

  • ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా The Secretary, TTWREIS, Gurukulam పేరిట, State Bank of India ,DSS bhavan ,Masab Tank Hyderabad లో చెల్లుబాటు అయ్యేలా రూ.300 డీడీ తీయాలి.
  • ఆ తర్వాత www.ttwrdcs.ac.in లేదా https://tgtwgurukulam.telangana.gov.in వెబ్​ సైట్​ను ఓపెన్​ చేయాలి.
  • అందులో Online applications are invited from female candidates all over Telangana for admission into first year 1 st year Under Graduate Courses of B A ( Fashion Design, B A ( Interior Design B A ( Hons)(Photography Digital Imaging. CLICK HERE TO APPLY పై క్లిక్​ చేయాలి.
  • దాంట్లో ప్రాస్పెక్టస్​తో పాటు అప్లికేషన్​ ఫాం ఉంటుంది. దానిని డౌన్​లోడ్​ చేసుకొని అందులో రీసెంట్​ పాస్ట్​పోర్ట్​ సైజ్​ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి.
  • అందులోనే Fill & submit the GOOGLE FORM : https://forms.gle/aTyihBMxBY2Hep9Q8 అని  ఉంటుంది.
  • అందులో https://forms.gle/aTyihBMxBY2Hep9Q8 లింక్​పై క్లిక్​ చేయాలి. దానిలోని వివరాలన్నీ నింపి సబ్మిట్​ చేయాలి.
  • అనంతరం  డౌన్​లోడ్​ చేసుకున్న అప్లికేషన్​ ఫాంకు ఇంటర్మీడియట్​ మెమో, ఎస్సెస్సీ మెమో, కులం సర్టిఫికెట్​, ఆదాయం సర్టిఫికెట్​, ఆధార్​కార్డ్​ జిరాక్స్​, రెండు పాస్ పోర్ట్​ సైజ్​ ఫొటోలు, రెండు సెట్ల జిరాక్స్​ కాపీలు జతచేయాలి. అన్ని సర్టిఫికెట్లపై సంతకం చేయాలి.
  • వాటన్నింటినీ మే 14, 2023 లోపు The Principal, TTWRDC (W), Siricilla, Lakshmipur Road, Tangelapally-505405, Rajanna Sircilla (Dist) చిరునామాకు పంపించాలి. పోస్టు ద్వారా పంపవచ్చు. లేదా నేరుగా వెళ్లి అందజేయవచ్చు.
  • ఇంటర్మీడియట్​ ఫలితాలు విడుదలైన తర్వాత స్పాట్​ కౌన్సెలింగ్​ నిర్వహిస్తారు.
  • అర్హులైన అభ్యర్థులను స్పాట్​ కౌన్సెలింగ్​కు పిలుస్తారు. ఎస్​ఎంఎస్​ లేదా ఈ‌‌-మెయిల్​ ద్వారా తెలియజేస్తారు. కౌనెసలింగ్​ తర్వాత అడ్మిషన్లు కల్పిస్తారు.
  • ఎంపికైన విద్యార్థులు అడ్మిషన్ సమయంలో ఈ కింది సర్టిఫికెట్‌లు ఒరిజినల్‌ మరియు ఒక సెట్ జిరాక్స్‌ తీసుకెళ్లాలి.
    1) కుల ధృవీకరణ పత్రం
    2) ఆదాయ ధ్రువీకరణ పత్రం
    3) బదిలీ సర్టిఫికెట్ (టీసీ)
    4) బోనఫైడ్ సర్టిఫికెట్
    5) మార్కుల షీట్ / ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్
    6) ఆధార్ కార్డ్
    7) పాస్‌పోర్ట్ ఫోటోలు ఐదు
    8) ఆరోగ్యశ్రీ/ రేషన్ కార్డ్

Important Points

  • సిరిసిల్లలోని ఫైన్ ఆర్ట్స్ అకాడమీ మొదటి ప్రభుత్వ ఫైన్ ఆర్ట్స్ కోర్సుల కళాశాల.
  • ఇందులో ఉచితంగా బోధిస్తారు.
  • ఈ కాలేజీ హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగుతోంది.
  • తెలంగాణలోని అన్ని జిల్లాల మహిళా అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఈ కోర్సులను ఇంగ్లిష్​ మీడియంలోనే బోధిస్తారు.
  • పూర్తి వివరాల కోసం 9121174434 నెంబర్​ను సంప్రదించవచ్చు.

– Admissions in Sircilla FAA