Faculty SR Jobs in Nims : హైదరాబాద్ లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Nizam’s Institute of Medical Sciences-NIMS) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈఐసీయూ (eICU) పైలట్ ప్రాజెక్టులో ఈఐసీయూ స్పోక్స్ (eICU Spokes) లో ఫ్యాకల్టీ/ అసిస్టెంట్ ప్రొఫెసర్ (Faculty/Assistant Professor), సీనియర్ రెసిడెంట్ (Senior Resident) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (SRC/AC-4/564/2021) జారీ చేసింది. మొత్తం ఐదు (05) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Posts & Vacancies
ఫ్యాకల్టీ/ అసిస్టెంట్ ప్రొఫెసర్ (Faculty/Assistant Professor) - 02
సీనియర్ రెసిడెంట్ (Senior Resident) - 03
Qualification and Experience
ఫ్యాకల్టీ/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అనెస్తీషియాలజీ లేదా జనరల్ మెడిసిన్ లేదా ఎమర్జెన్సీ మెడిసిన్లో ఎండీ చేసిన వారు అర్హులు. అలాగే, సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి.
సీనియర్ రెసిడెంట్ పోస్టులకు అనెస్తీషియాలజీ లేదా జనరల్ మెడిసిన్ లేదా ఎమర్జెన్సీ మెడిసిన్లో ఎండీ చేసిన వారు అర్హులు. అలాగే, సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
Salary per Month
ఫ్యాకల్టీ/ అసిస్టెంట్ ప్రొఫెసర్ – రూ.1,30,000
సీనియర్ రెసిడెంట్ - రూ.80,000
How to Apply
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు నిమ్స్ వెబ్సైట్ (https://nims.edu.in/) ను ఓపెన్ చేసి అందులో ఎడమ వైపున స్క్రోల్ అవుతున్న ఆప్షన్లలో Recruitment of Faculty and the Senior Residents in eICUs Pilot Project under the Department of Anaesthesiology and Intensive Care పై క్లిక్ చేయాలి. అందులో Download పై క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఓపెన్
అవుతుంది. అందులో దిగువ భాగంలో అప్లికేషన్ ఫాం ఉంటుంది. దానిని ప్రింట్ తీసుకొని అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి. అలాగే, దానికి విద్యార్హతలు, అనుభవంనకు సంబంధించిన సర్టిఫికెట్లు జతచేయాలి. ఆ మొత్తం సర్టిఫికెట్లను ఓ ఎనవలప్ కవర్లో పెట్టి ఆ కవర్పైన ఏ పోస్టుకు అప్లై చేస్తున్నది రాయాలి. ఆ కవర్ను ఈ కింది అడ్రస్ కు పోస్టు ద్వారా గానీ, నేరుగా వెళ్లి గానీ మే 08, 2023 సాయంత్రం 4 గంటలలోపు అందజేయాలి.
The Dean,
Nizam’s Institute of Medical Sciences,
Panjagutta, Hyderabad – 500082, TS.
దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులైన వారిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఫోన్ ద్వారా సమాచారం ఇస్తారు.
Importanat Points
- ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి. కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం పనిచేయాల్సి ఉంటుంది.
- ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి భవిష్యత్తులో నిమ్స్ చేపట్టబోయే రెగ్యులర్ ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి ప్రయోజనం కల్పించరు.
- దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారికి ఇంటర్వ్యూ తేదీ, సమయం, స్థలం ఫోన్ ద్వారా తెలియజేస్తారు.
- ఇంటర్వ్యూకు అలాగే, జాయినింగ్ కోసం వచ్చే సమయంలో టీఏ, డీఏలాంటివి ఇవ్వరు.
- అభ్యర్థులు సొంత ఖర్చులతో హాజరు కావాల్సి ఉంటుంది.
– Faculty SR Jobs in Nims