Admissions in Basara RGUKTA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.
Admissions in Basara RGUKT : తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బాసరలో గల రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (Rajiv Gandhi University of Knowledge Technologies-RGUKT) (Basara IIIT)  2023-24 విద్యా సంవత్సరానికి గాను ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీ.టెక్ ప్రోగాం (6-Year Integrated B. Tech Program)లో ప్రవేశాలకు షెడ్యూల్​ జారీ చేసింది. జూన్​ 1వ తేదీన నోటిఫికేషన్​ విడుదల చేయనుంది. జూన్​ 5వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Eligibility

  • 2022‌‌-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫస్ట్ అటెంప్ట్ లో పాసైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అర్హులు.
  • భారతీయ పౌరసత్వం కలిగి ఉండి ఇతర దేశాలలో చదువుకుంటున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • గ్లోబల్ కేటగిరీలో దరఖాస్తు చేసుకొన్న తెలంగాణ విద్యార్థులు కూడా జనరల్ కేటగిరీగా పరిగణించబడతారు.

Admission Procedure

  • 2023–24 విద్యాసంవత్సరంలో 1500 అడ్మిషన్లను కల్పిస్తారు. ఈడబ్ల్యూఎస్​ కేటగిరీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా మరో 150 సీట్లు ఉంటాయి.
  • విద్యార్థులు 10వ తరగతిలో సాధించిన గ్రేడ్ పాయింట్ ఆవరేజ్ (GPA)లో మెరిట్, మరియు ప్రతి సబ్జెక్టులో పొందిన గ్రేడ్ ఆధారంగా, అలాగే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు.
  • ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ స్కూళ్లతో పాటు నాన్ రెసిడెన్షియల్ సర్కారు స్కూళ్లలో చదివిన విద్యార్థులకు 10వ తరగతిలో సాధించిన జీపీఏకి అదనంగా 0.4 స్కోర్ జోడిస్తారు.
  • మొత్తం సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణ రాష్ట్ర (లోకల్) విద్యార్థులకు కేటాయిస్తారు.
  • మిగిలిన 15 శాతం సీట్లు అన్ రిజర్వుడ్ కేటగిరీకి కేటాయిచేస్తారు.
  • వీటిని మెరిట్ ఆధారంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.
  • జీపీఏ పాయింట్లు సేమ్ వచ్చిన స్టూడెంట్లకు మ్యాథ్స్ లో వచ్చిన గ్రేడ్ ఆధారంగా, ఆ తర్వాత సైన్స్, ఇంగ్లిష్, సోషల్ సబ్జెక్టుల్లో వచ్చిన జీపీఏ ఆధారంగా సీట్లు అలాట్ చేస్తారు.
  • అప్పటికీ సేమ్ మార్కులుంటే పుట్టిన తేదీ ఆధారంగా సీనియర్​లకు​ అవకాశం ఇస్తారు.

Application Fee

దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ విద్యార్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450, ఇతర రాష్ట్రాలు, గ్లోబల్ విద్యార్థులు రూ.1,500, ఎన్​ఆర్​ఐ, ఇంటర్నేషనల్ విద్యార్థులు వంద యూఎస్ డాలర్లు చెల్లించాలి.

Last Date

  • జనరల్ కేటగిరీ విద్యార్థులు జూన్ 19లోగా అప్లై చేసుకోవాలి.
  • దివ్యాంగులు, స్పోర్ట్స్, ఎన్​సీసీ కేటగిరీ విద్యార్థులు జూన్​ 24వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
  • సెలెక్షన్​ లిస్టును జూన్​ 26న ప్రకటిస్తారు. జులై 1 నుంచి కౌన్సెలింగ్ ఉంటుంది.
  • అప్లికేషన్​ ప్రక్రియ ప్రారంభం కాగానే జూన్​ 1వ తేదీన హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేస్తారు.
  • ఫోన్​ నెంబర్లు ఇస్తారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఆ నెంబర్లకు ఫోన్​ చేసి నివృత్తి చేసుకోవచ్చు.
– Admissions in Basara RGUKT