Jobs in Suryapet Medical College

Jobs in Suryapet Medical College : డైరెక్టోరేట్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సూర్యాపేట మెడికల్ కాలేజీ/ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో (Government Medical College/General Hospital)లో పనిచేయడానికి అర్హులైన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి. ఎంపికైన అభ్యర్థులు ఏడాదికాలం పనిచేయాల్సి ఉంటుంది. లేదా ఖాళీలను పదోన్నతులు, రెగ్యులర్ ఉద్యోగులతో నింపేవరకు ఏది ముందైతే అది. ప్రస్తుతం ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు భవిష్యత్తులో చేపట్టబోయే ప్రభుత్వ ఉద్యోగాలలో ఎలాంటి ప్రయోజనం కల్పించరు.

Posts Details

Professor

పోస్టు పేరు: ప్రొఫెసర్ (Professor)
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
విభాగం: ఆప్తాల్మాలజీ (Ophthalmology)
జీతం: నెలకు రూ.1,90,000

Associate Professor

పోస్టు పేరు: అసోసియేట్ ప్రొఫెసర్ (Associate Professor)
పోస్టుల సంఖ్య: పదకొండు (11)
విభాగాలు: బయోకెమిస్ట్రీ(Biochemistry)-01, ఫార్మాకాలజీ(Pharmacology)-01, మైక్రోబయాలజీ(Microbiology)-01, ఫోరెన్సిక్ మెడిసిన్(Forensic Medicine)-01, కమ్యూనిటీ మెడిసిన్ (Communtiy Medicine)-01, జనరల్ మెడిసిన్ (General Medicine)-03, పీడియాట్రిక్స్ (Pediatrics)-01, ట్యుబర్కులోసిస్ అండ్ రెస్పిరేటరీ(Tuberculosis & Respiratory)-01, అనెస్తియాలజీ (Anesthesiology)-01.
జీతం: నెలకు రూ.1,50,000

Assistant Professor

పోస్టు పేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor)
పోస్టుల సంఖ్య: అరు (06)
విభాగాలు: బయోకెమిస్ట్రీ(Biochemistry)-01, ఫాథాలజీ (Pathology)-01, ఫోరెన్సిక్ మెడిసిన్(Forensic Medicine)-02, కమ్యూనిటీ మెడిసిన్ (Communtiy Medicine)-02.
జీతం: నెలకు రూ.1,25,000

Tutors

పోస్టు పేరు: ట్యూటర్స్ (Tutors)
పోస్టుల సంఖ్య: తొమ్మిది (09)
జీతం: నెలకు రూ.55,000

Eligibility

ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు సంబంధిత విభాగాలలో ఎండీ లేదా ఎంఎస్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అలాగే, సంబంధిత విభాగాలలో టీచింగ్ అనుభవం తప్పనిసరి. ట్యూటర్ ఉద్యోగాల కోసం ఎంబీబీఎస్ తో పాటు టీచింగ్ అనుభవం ఉండాలి. యవసు 65 సంవత్సరాలు మించకూడదు. ఇదే క్యాడర్ లో తెలంగాణలోని ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. ఎంపికైన అభ్యర్థులుకు ఏడాదిలో ముప్పై (30) రోజులు సెలవులు ఇస్తారు.

How to Apply

ఆసక్తికలిగిన అర్హులైన అభ్యర్థులు సూర్యాపేట మెడికల్ కళాశాల వెబ్ సైట్ (www.gmcsuryapet.org) లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానికి తమ విద్యార్హతలు, అనుభవం, కేటగిరీకి సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ సెట్ ను జతచేయాలి. వాటిని సీల్డ్ కవర్ లో 08 జూన్ 2022లోపు ది ప్రిన్సిపాల్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, అమరవాడి నగర్, సూర్యాపేట -508213 చిరునామాకు రిజిస్టర్ పోస్టు లేదా స్పీడ్ పోస్టు ద్వారా పంపించాలి. లేదా వ్యక్తిగతంగా వెళ్లి అయినా అందజేయవచ్చు.

Selection Criteria

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న రూల్ ఆఫ్ రిజర్వేషన్, విద్యార్హతల్లో మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులలో ఎండీ, ఎంఎస్, డీఎన్ బీ పీజీ డిగ్రీకి 70 మార్కులు, పోస్ట్ ఎండీ, ఎంఎస్, డీఎన్ బీ టీచింగ్ అనుభవానికి 20 మార్కులు, ఇండెక్సుడ్ జర్నల్స్ కు 10 మార్కులు కేటాయిస్తారు.

Important Dates

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 08, 2022
ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ: జూన్ 14, 2022
ఇంటర్వ్యూ నిర్వహించు స్థలం: ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ మెడికల్ కళాశాల, సూర్యాపేట.

– Jobs in Suryapet Medical College