Multi Purpose Health Assistant Jobs : తెలంగాణ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ (Health and Family Welfare department, Government of Telangana – HM&FW)లో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్) (Multi-Purpose Health Assistant (Female) ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణ ప్రభుత్వ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (Government of Telangana, Medical Health Services Recruitment Board-MHSRB) ఆధ్వర్యంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 1,520 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Zone Wise Vacancies
జోన్-1 (కాళేశ్వరం) – 169
జోన్-2 (బాసర) – 225
జోన్-3 (రాజన్న సిరిసిల్ల) – 263
జోన్-4 (భద్రాద్రి) – 237
జోన్-5 (యాదాద్రి) – 241
జోన్-6 (చార్మినార్) – 189
జోన్-7 (జోగులాంబ) – 196
మొత్తం – 1520
Reservation and Zone Wise Vacancies
ఓపీ (OC) – 451
జోన్-1-49, జోన్-2-68, జోన్-3-78, జోన్-4-72, జోన్-5-71, జోన్-6-56, జోన్-7-57
ఈడబ్ల్యూఎస్ (EWS) – 157
జోన్-1-18, జోన్-2-23, జోన్-3-27, జోన్-4-24, జోన్-5-25, జోన్-6-19, జోన్-7-21
బీసీ-ఏ (BC-A) – 113
జోన్-1-14, జోన్-2-16, జోన్-3-20, జోన్-4-17, జోన్-5-19, జోన్-6-14, జోన్-7-13
బీసీ-బీ(BC-B) – 146
జోన్-1-15, జోన్-2-21, జోన్-3-25, జోన్-4-23, Zజోన్-5-23, జోన్-6-18, జోన్-7-21
బీసీ-సీ(BC-C) – 15
జోన్-1-2, జోన్-2-3, జోన్-3-2, జోన్-4-3, జోన్-5-2, జోన్-6-2, జోన్-7-1
బీసీ-డీ(BC-D) – 105
జోన్-1-12, జోన్-2-15, జోన్-3-19, జోన్-4-16, జోన్-516, జోన్-6-14, జోన్-7-13
బీసీ-ఈ (BC-E) – 61
జోన్-1-7, జోన్-2-9, జోన్-3-11, జోన్-4-9, జోన్-5-10, జోన్-6-8, జోన్-7-7
ఎస్సీ(SC) – 222
జోన్-1-25, జోన్-2-33, జోన్-3-38, జోన్-4-35, జోన్-5-35, జోన్-6-27, జోన్-7-29
ఎస్టీ(ST) – 157
జోన్-1-17, జోన్-2-23, జోన్-3-27, జోన్-4-24, జోన్-5-25, జోన్-6-20, జోన్-7-21
స్పోర్ట్స్ (SPORTS) – 28
జోన్-1-3, జోన్-2-4, జోన్-3-5, జోన్-4-4, జోన్-5-5, జోన్-6-3, జోన్-7-4
ఓహెచ్(OH) – 28
జోన్-1-7, జోన్-2-10, జోన్-3-11, జోన్-4-10, జోన్-5-10, జోన్-6-8, జోన్-7-9
Qualifications
అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడిన తేదీ నాటికి మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. తెలంగాణ రాష్ట్ర నర్సెస్ అండ్ మిడ్వైవ్స్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. లేదా ఇంటర్మీడియట్ ఒకేషనల్ మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) శిక్షణ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి మరియు ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం క్లినికల్ శిక్షణ పూర్తి చేసి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన ఆసుపత్రిలో ఒక సంవత్సరం అప్రెంటిస్షిప్ శిక్షణ పూర్తి చేసి ఉండాలి.
Age Limit
ఈ పోస్టులకు అభ్యర్థుల వయసు జూలై 01, 2023 నాటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
మాజీ సైనికులు (Ex-Servicemen), ఎన్సీసీ (N.C.C) అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు (05) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (01) సంవత్సరాల సడలింపు ఉంది.
ఆర్టీసీ ఉద్యోగులు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పనిచేసే ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి రారు.
Scale of Pay
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేలు రూ.31,040 – రూ.95,050 గా నిర్ణయించారు.
Selection Procedure
మొత్తం 100 పాయింట్ల ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతానికి గరిష్ఠంగా 80 మార్కులు కేటాయిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ఆసుపత్రులు, వివిధ కార్యక్రమాలలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన వారికి గరిష్ఠంగా 20 మార్కులు కేటాయిస్తారు.
గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారికి 6 నెలలకు 2.5 పాయింట్లు, గిరిజనేతర ప్రాంతాల్లో పనిచేసిన వారికి 6 నెలలకు 3 పాయింట్లు కేటాయిస్తారు.
కనీసం 6 నెలలు పనిచేస్తేనే ఈ మార్కులు కేటాయిస్తారు. అయితే, ఈ మార్కులకు సంబంధించి సంబంధిత విభాగం హెచ్వోడీ నుంచి సర్టిఫికెట్ తీసుకొని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
How to Apply
ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ పద్ధతిలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు చెందిన వెబ్ సైట్ (https://mhsrb.telangana.gov.in) లోకి లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హతలు, అనుభవనంకు సంబంధించిన సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి.
అలాగే, ఎగ్జామినేషన్ ఫీజు రూ.500 చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజు నిమిత్తం జనరల్ అభ్యర్థులు రూ.200 ఆన్ లైన్ లో చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మాజీ సైనికులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 25, 2023 ఉదయం 10:30 గంటల నుంచి ప్రారంభం అవుతుంది.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 19, 2023 సాయంత్రం 5 గంటల వరకు.
– Multi Purpose Health Assistant Jobs