Para Medical Jobs in SSBA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Para Medical Jobs in SSB : న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs, Government of India)కు చెందిన సశస్త్ర సీమా బల్​ (ఎస్​ఎస్​బీ) (Sashastra Seema Bal-SSB) అసిస్టెంట్​ సబ్​ ఇన్​స్పెక్టర్​ (పారా మెడికల్​) (Assistant Sub-Inspector (Combatised Para-Medical Staff) )పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఫార్మాసిస్ట్​ (Pharmacist), రేడియోగ్రాఫర్(Radiographer)​, ఆపరేషన్​ థియేటర్​ టెక్నీషియన్ (Operation Theatre Technician)​, డెంటల్​ టెక్నీషియన్​ (Dental Technician) పోస్టుల భర్తీకి ప్రకటన విదుల చేసింది. ఇవి గ్రూప్​-సీ నాన్​ గెజిటెడ్​ పోస్టులు. రాత పరీక్ష, ఫిజికల్​ స్టాండర్ట్​ టెస్ట్​, మెడికల్​ టెస్ట్​ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన మహిళ, పురుష అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Vacancies

మొత్తం పోస్టులు – 30
1. ఏఎస్​ఐ (ఫార్మాసిస్ట్​) – 07 (ఓబీసీ – 01, ఎస్టీ – 02, ఎస్సీ – 04)
2. ఏఎస్​ఐ (రేడియోగ్రాఫర్​​) – 21 (అన్​రిజర్వుడ్​ – 10, ఈడబ్ల్యూఎస్​ – 02, ఓబీసీ – 05, ఎస్టీ – 01, ఎస్సీ – 03)
3. ఏఎస్​ఐ (ఆపరేషన్​ థియేటర్​ టెక్నీషియన్​​​) – 01 (అన్​రిజర్వుడ్)
4. ఏఎస్​ఐ (టెంటల్​​ టెక్నీషియన్​​​) – 01 (అన్​రిజర్వుడ్)

Eligibility

ఏఎస్​ఐ (ఫార్మాసిస్ట్​) :
సైన్స్​ గ్రూపులో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఫార్మసిలో డిగ్రీ లేదా డిప్లొమా పాసై ఉండాలి.
ఫార్మాసిస్ట్​గా రిజిస్ట్రేషన్​ చేసుకొని ఉండాలి.

ఏఎస్​ఐ (రేడియోగ్రాఫర్​​) :
సైన్స్​ గ్రూపులో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
రేడియో డయాగ్నోసిస్​లో రెండు సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
స్టేట్​ గవర్నమెంట్​ లేదా సెంట్రల్​ గవర్నమెంట్​కు చెందిన హాస్పిటల్​లో రేడియోలాజికల్​ డిపార్ట్​మెంట్​లో ఒక సంవత్సరం పనిచేసి ఉండాలి.

ఏఎస్​ఐ (ఆపరేషన్​ థియేటర్​ టెక్నీషియన్​​​) :
సైన్స్​ గ్రూపులో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆపరేషన్​ థియేటర్​ టెక్నీషియన్​లో డిప్లొమా లేదా ఆపరేషన్​ థియేటర్​ అసిస్టెంట్​ కమ్​ సెంట్రల్​ స్టెరైల్​ సప్లై అసిస్టెంట్​ ట్రైనింగ్​లో సర్టిఫికెట్​ కోర్సు చేసి ఉండాలి.
ఆపరేషన్​ థియేటర్​ టెక్నీషియన్​గా రెండు సంవత్సరాలు పనిచేసి ఉండాలి.

ఏఎస్​ఐ (టెంటల్​​ టెక్నీషియన్​​​) :
సైన్స్​ గ్రూపులో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
రెండు సంవత్సరాల డెంటల్​ హైజినిస్ట్​ డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
డెంటల్​ టెక్నీషియన్​గా ఒక సంవత్సరం పనిచేసి ఉండాలి.

Salary

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,200 నుంచి రూ.92,300 చెల్లిస్తారు.

Age Limit

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ, ఎక్స్​సర్వీస్​మెన్​ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుంది.

How to Apply

ఆన్​లైన్​లోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. సశస్త్ర సీమా బల్​ (ఎస్​ఎస్​బీ) వెబ్​సైట్​ (www.ssbrectt.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలతో పాటు ఫొటో, సంతకం అప్​లోడ్​ చేయాల్సి ఉంటుంది. అలాగే, అన్​రిజర్వుడ్​, ఈడబ్ల్యూఎస్​, ఓబీసీ అభ్యర్థులు ఎగ్జామినేషన్​ ఫీజు నిమిత్తం రూ.100లు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్​సర్వీస్​మెన్​ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంప్లాయిమెంట్​ న్యూస్​లో ఈ ఉద్యోగాల ప్రకటన వెలువడిన 30 రోజులలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఎంప్లాయిమెంట్​ న్యూస్ ను గమనిస్తూ ఉండాలి.

– Para Medical Jobs in SSB