Long Term IIT CoachingA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Long Term IIT Coaching : హైదరాబాద్​లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Social and Tribal Welfare Residential Educational Institutions Society, Hyderabad) 2023-24 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత లాంగ్​ టర్మ్​ ఐఐటీ కోచింగ్​ (Long Term IIT Coaching) ఇచ్చేందుకు నోటిఫికేషన్​ జారీ చేసింది. బాలికలకు హైదరాబాద్ లోని గౌలిదొడ్డిలో గల తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​, సెంటర్​ ఆఫ్​ ఎక్సలెన్స్ (గల్స్​)​ (Telangana Social Welfare Residential Centre of Excellence -TSWR COE (G))లో శిక్షణ ఇస్తారు. బాలురకు రాజేంద్రనగర్​లోని తెలంగాణ ట్రైబల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్ బాలుర ఐఐటీ స్టడీ సెంటర్​ (Telangana Tribal Welfare Residential (TTWR) IIT Study Centre (B))లో శిక్షణ ఇస్తారు. జేఈఈ మెయిన్స్ – 2023 పర్సంటైల్ మరియు జేఈఈ అడ్వాన్స్‌డ్ – 2023లో పొందిన ప్రిపరేటరీ ర్యాంక్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

Number of Seats

ఎస్సీ విద్యార్థులు – 25 సీట్లు (బాలురు మరియు బాలికలు)
ఎస్టీ విద్యార్థులు – 25 సీట్లు (బాలురు మరియు బాలికలు)

Eligibility

ఇంటర్మీడియట్​లో ఎంపీసీ గ్రూపులో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎస్సీ విద్యార్థులు జేఈఈ మెయిన్స్​-2023లో 70 పర్సంటైల్ సాధించి ఉండాలి.
ఎస్టీ విద్యార్థులు జేఈఈ మెయిన్స్​-2023లో 60 పర్సంటైల్ సాధించి ఉండాలి.
జేఈఈ అడ్వాన్స్‌డ్ – 2023లో ప్రిపరేటరీ ర్యాంక్ పొందిన విద్యార్థులు కూడా అర్హులే.
విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు మించకూడదు.
గతంలో TSWR COE (G), Gowlidoddi, TTWR IIT Study Centre, Rajendranagar లో ఐఐటీ లాంగ్​ టర్మ్​ కోచింగ్​ తీసుకున్న వారు అనర్హులు.

How to Apply

  • ఆసక్తి కలిగిన, అర్హులైన విద్యార్థులు ముందుగా హైదరాబాద్​లో చెల్లుబాటు అయ్యేలా The Secretary TSWREIS లేదా The Secretary TTWREIS పేరిట రూ.200 డీడీ (డిమాండ్​ డ్రాఫ్ట్​) తీయాలి.
  • అనంతరం  www.tgtwgurukulam.telangana.gov.in. లేదా www.tswreis.ac.in వెబ్ సైట్​లలో ఏదైనా ఒకదానిని ఓపెన్ చేసి అందులో నిర్ణీత ఫార్మాట్​లో ఉన్న Application formను డౌన్​ లోడ్​ చేసుకోవాలి.
  • అందులో రీసెంట్​ పాస్​పోర్ట్​ సైజ్​ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి.
  • అలాగే, ఆ అప్లికేషన్​ ఫాంకు కులం, ఆదాయం సర్టిఫికెట్లు, జేఈఈ మెయిన్స్​-2023 స్కోర్ కార్డు జత చేయాలి.
  • ఆ మొత్తం సర్టిఫికెట్లను ఆగస్టు 16, 2023 లోపు TSWR COE (G), Gowlidoddi, Hyderabad లేదా, TTWR IIT Study Centre, Rajendranagar Hyderabadలో అందజేయాలి. లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న Telangana Social Welfare Residential Educational Institutions లలో అందజేయవచ్చు.
  • ఎంపికైన విద్యార్థులకు ఎస్సెమ్మెస్ లేదా ఫోన్​ ద్వారా తెలియజేస్తారు. అలాగే, సంస్థ వెబ్ సైట్ లోనూ పెడతారు.
  • బాలికలకు గౌలిదొడ్డిలోని TSWR COE(G) కాలేజీలో, బాలురకు రాజేంద్రనగర్​లోని TTWR IIT Study Centreలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
  • ఆగస్టు 21, 2023 నుంచి రెండు సెంటర్లలో కోచింగ్​ ప్రారంభిస్తారు.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ : ఆగస్టు 16, 2023

Address of RCO office

విద్యార్థులు ఈ కింది అడ్రస్​లలో కూడా అప్లికేషన్​ ఫాంలు అందజేయవచ్చు.

RCO TSWREIS Hyderabad & Rangareddy East :
RCO TSWREIS, TSWR COE (G) Saroornagar, Hyderabad
Old Sri Chaithanya Mahila Junior Kalashala Metro
piller No. 1570, Sri Ram Nagar, 500060
Phone number : 7032710198

RCO TSWREIS, TSWR COE (B) Shaikpet, Hyderabad
H. No.8-1 Alijapur Road near Khazra enclaves,
500104
Phone number : 7337376176

Yadadri
RCO TSWREIS, TDR polytechnic college, Near railway gate
Bibinagar, Yadadri Bhongir District, 508126
Phone number : 6309058528

Nizamabad
RCO TSWREIS, TSWR COE (G) Dharmaram
Beside ZPHS, Beside Nizam sagar sagar canal,
Dharmaram B, Nizamabad District, 503230
Phone number : 7032710194

Mahabubnagar East
RCO TSWREIS, TSWR COE (B) Jayaprakash Nagar, Devarakonda
Road, Kalwakurthy, Nagarkurnool District, 509324
Phone number : 6309996326

Mahabubnagar West
RCO TSWREIS, H.No. 1-4-103/A11, Kamala Nehru Nagar,
Bayammathota, Mahabubnagar, 509001
Phone number : 8328640116

Medak East
RCO TSWREIS, TSWR COE (G) Mittapally
Velkatur cross road siddipet district, 502375
Phone number : 6309058526

Medak West
RCO TSWREIS, TSWRS/JC (G), Isnapur Opposite Trufflo Hindware,
Bombay Highway, Patancheruvu Sangareddy,
502307
Phone number : 8179427939

Adilabad
RCO TSWREIS, Old Collector camp office
ACC / MCC, Mancherial, 504209
Phone number : 7032710196

Warangal
RCO TSWREIS, RHS Quarter No.A3, Opposite Circuit Guest House,
Old Bus Depo, Hanumakonda, 506001
Phone number : 7032710190

Karimnagar
RCO TSWREIS, H.No. 9-1-128, Near Trinity Junior College Bhagath
Nagar, Karimnagar, 505001
Phone number : 7032710195

Khammam
RCO TSWREIS, IDOC (New Collectorate complex) Venkatayapalem,
Khammam
Phone number : 9989924195

Nalgonda
RCO TSWREIS, RTC Colony Behind Government Hospital Opposite
Raghavendra Appartment, Nalgonda
Phone number : 7032710197

Gowlidoddi
Principal, TSWR COE (G), Gowlidoddi, Hyderabad
Phone number : 9704550228

Rajendranagar
Principal TTWR IIT Study Centre, Rajendranagar Hyderabad.
Phone number : 9948237256

– Long Term IIT Coaching