M Sc Courses in NIN

M Sc Courses in NIN : హైదరాబాద్ లోని జాతీయ పోషకాహార సంస్థ (ICMR-National Institute of Nutrition-NIN) 2022-24 విద్యా సంవత్సరానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశానికి ఎన్-సెట్ 2022 (N-CET 2022 (NIN-Common Entrance Test) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సంస్థ ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధం. అసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష, కౌన్సెలింగ్ ద్వారా కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు.

Courses Details

1. ఎమ్మెస్సీ (అప్లైడ్ న్యూట్రిషన్) M.Sc. (Applied Nutrition)
2. ఎమ్మెస్సీ (స్పోర్ట్స్ న్యూట్రిషన్) M.Sc. (Sports Nutrition)

Number of Seats

ఎమ్మెస్సీ (అప్లైడ్ న్యూట్రిషన్)లో మొత్తం ఇరవై రెండు (22) సీట్లు ఉంటాయి. ఇందులో రెండు ఈడబ్ల్యూఎస్ (Economically Weaker Sections-EWS) కేటగిరీకి కేటాయించారు. కేంద్రం కోటాలో ఒకటి, రాష్ట్ర కోటాలో ఒకటి కేటాయించారు. మిగిలిన 20 సీట్లలో వన్ థర్డ్ (1/3rd) సీట్లు రాష్ట్ర కోటాలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు కేటాయించారు. మిగిలిన సీట్లు కేంద్రం కోటాలో ఇతర రాష్ట్రాల అభ్యర్థులకుకేటాయించారు.
ఎమ్మెస్సీ (స్పోర్ట్స్ న్యూట్రిషన్)లో మొత్తం పదిహేడు (17) సీట్లు ఉంటాయి. ఇందులో రెండు ఈడబ్ల్యూఎస్ (EWS) కేటగిరీకి కేటాయించారు. కేంద్రం కోటాలో ఒకటి, రాష్ట్ర కోటాలో ఒకటి కేటాయించారు. మిగిలిన 15 సీట్లలో ఐదు (05) సీట్లు రాష్ట్ర కోటాలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు కేటాయించారు. ఆ తర్వాత మిగిలిన పది (10) సీట్లు కేంద్రం కోటాలో ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు కేటాయించారు.

Qualification

  • రెండు కోర్సులకు కూడా ఎంబీబీఎస్ (MBBS) చేసిన అభ్యర్థులు అర్హులు.
  • న్యూట్రిషిన్/ఫుడ్ అండ్ న్యూట్రిషన్/అప్లైడ్ న్యూట్రిషన్/న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ లో బీ.ఎస్సీ చేసిన వారు కూడా అర్హులే.
  • హోంసైన్స్/ఫుడ్ సైన్స్/బయోకెమిస్ట్రీ/జువాలజీ లేదా అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్ లేదా క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ లో బీ.ఎస్సీ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • బీ.ఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులు ఎమ్మెస్సీ (అప్లైడ్ న్యూట్రిషన్) కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్, లైఫ్ సైన్స్ (బోటనీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ)లో బీ.ఎస్సీ చేసిన వారు, బీఏఎంఎస్ (BAMS) చేసిన వారు ఎమ్మెస్సీ (స్పోర్ట్స్ న్యూట్రిషన్) కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అభ్యర్థులు సంబంధిత కోర్సులలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
  • ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారు 50 శాతం మార్కులు సాధించినా సరిపోతుంది.
  • ప్రస్తుతం సంబంధిత కోర్సు చివరి సంవత్సరం చదువుతున్నఅభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • కౌన్సెలింగ్ నాటికి డిగ్రీ మెమో, సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

How to Apply

ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు NIN వెబ్ సైట్ (www.nin.res.in) లోకి లాగిన్ అయ్యి స్క్రోల్ అవుతున్న నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత New User పై క్లిక్ చేసి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.3000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2700 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత పేమెంట్ రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ తో అన్ లైన్ అప్లికేషన్ ఓపెన్ చేసి అందులోని వివరాలు నింపాలి. జేపీఈజీ ఫార్మాట్ లో ఫొటో అప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేయాలి. సబ్మిట్
చేసిన ఫాంను డౌన్ లోడ్ చేసుకొని భద్రపరుచుకోవాలి.

Entrance Test Pattern

ప్రవేశ పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. 90 నిమిషాలలో రాయాల్సి ఉంటుంది. పరీక్ష మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. న్యూట్రిషన్ సబ్జెక్టు నుంచి 40 ప్రశ్నలు, బయోకెమిస్ట్రీ నుంచి 20 ప్రశ్నలు, ఫిజియాలజీ నుంచి 20 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్ అప్టిట్యూడ్ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో జవాబుకు ఒక మార్కు ఉంటుంది. అదే విధంగా నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి మూడు తప్పు జవాబులకు ఒక మార్కు కట్ చేస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ లోనే ఉంటుంది. ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను కౌన్సెలింగ్ కు పిలుస్తారు. సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అనంతరం అర్హులైన అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు. నిబంధనలకు లోబడి హాస్టల్ వసతి కూడా కల్పిస్తారు.

Important Dates

దరఖాస్తుకు చివరి తేదీ: 30 జూన్, 2022 (రాత్రి 11:59 గంటల వరకు)
హాల్ టికెట్ల డౌన్ లోడ్: 6 జూలై, 2022 నుంచి
ప్రవేశ పరీక్ష తేదీ: 16 జూలై, 2022 (శనివారం, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4 గంటల వరకు)

చిరునామా
National Institute of Nutrition,
Jamai-Osmania PO., Hyderabad – 500007.
Phone: 40-27197247/223
E-mail: [email protected]

– M Sc Courses in NIN