Sub Inspector Jobs in ITBPF : భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (Indo Tibetan Border Police Force-ITBPF) తాత్కాలిక ప్రాతిపదికన సబ్ ఇన్ స్పెక్టర్ (ఓవర్ సీర్) (Sub Inspector (Overseer)) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవి గ్రూప్-బీ, నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్ట్రీరియల్) పోస్టులు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.
Pay Scale
Level-6 in the Pay Matrix. రూ.35,400 – 1,33,630 (7వ CPC ప్రకారం)
Reservation Wise Vacancies
- మొత్తం పోస్టులు – 37
- అన్ రిజర్వుడ్ (Un Reserved-UR) – 08 (పురుషులు-07, మహిళలు-01)
- ఎస్సీ (SC) – 06 (పురుషులు-05, మహిళలు-01)
- ఎస్టీ (ST) – 02 (పురుషులు)
- ఓబీసీ (OBC) – 18 (పురుషులు-15, మహిళలు-03)
- ఈడబ్ల్యూఎస్ (EWS) – 03 (పురుషులు-03)
- పై పోస్టుల సంఖ్య పెరగవచ్చు. తగ్గవచ్చు. పోస్టుల సంఖ్యలో మార్పులను ఎప్పటికప్పుడు ITBPF రిక్రూట్మెంట్ వెబ్ సైట్ (www.recruitment.itbpolice.nic.in.) లో పొందుపరుస్తారు.
Age Limit
అభ్యర్థుల వయసు ఆగస్టు 14, 2022 నాటికి 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆగస్టు 15, 2022కు ముందు జన్మించిన వారు అర్హులు కాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్ క్రిమీలేయర్), ఎక్స్ సర్వీస్ మెన్, ఇతర రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
Education Qualifications
మెట్రిక్యులేషన్ పూర్తిచేసి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ లో సివిల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా చేసిన వారు అర్హులు.
How to Apply
ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ పద్ధతిలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ పద్ధతిలో చేసిన దరఖాస్తులు స్వీకరించరు. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు ITBPF వెబ్ సైట్ (www.recruitment.itbpolice.nic.in.) లోకి లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవాలి. దర ఖాస్తు చేసే ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ITBPF రిక్రూట్మెంట్ వెబ్ సైట్ (www.recruitment.itbpolice.nic.in.) లో మాత్రమే పొందుపరుస్తారు. కాబట్టి అభ్యర్థులు సమాచారం కోసం తరచూ వెబ్ సైట్ ను చూస్తుండాలి.
అభ్యర్థులు అన్ లైన్ అప్లికేషన్ ఫాం నింపే సమయంలో ప్రస్తుతం మనుగడలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ ను మాత్రమే ఇవ్వాలి.
ఈ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వాటికి మాత్రమే పంపిస్తారు.
ఆన్ లైన్అ ప్లికేషన్ ప్రక్రియ జూలై 16, 2022 నుంచి ప్రారంభం అవుతుంది.
Selection Procedure
దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులకు రిక్రూట్ టెస్టుల కోసం అడ్మిట్ కార్డులు వెబ్ సైట్ లో పెడతారు. అభ్యర్థులు వెబ్ సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవాలి. అనంతరం ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంటేషన్, డిటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించిన తర్వాత అభ్యర్థు లను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : జూలై 16, 2022 (మధ్యాహ్నం 12 గంటల నుంచి)
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 14, 2022 (రాత్రి 11:29 గంటల వరకు)
Website : www.recruitment.itbpolice.nic.in.
– Sub Inspector Jobs in ITBPF