Senior Resident Jobs in AIIMS

Senior Resident Jobs in AIIMS : తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ లో గల ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (All India Institute of Medical Sciences-AIIMS) సీనియర్ రెసిడెంట్ (Senior Resident-SR) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (AIIMS/BBN/DEAN/SR/2022/610) జారీ చేసింది. ఆరు విభాగాలలో పది (10) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Posts & Vacancies

1. అనెస్తీషియా (Anesthesia) – 02
2. జనరల్ మెడిసిన్ (General Medicine) – 02
3. జనరల్ సర్జరీ (General Surgery) – 01
4. అబ్ స్టెట్రిక్స్ – గైనకాలజీ (Obstetrics and Gynecology) – 02
5. అర్థోపెడిక్స్ (Orthopedics) – 01
6. పీడియాట్రిక్స్ (Pediatrics) – 02
(ఓబీసీ(OBC)-04, ఎస్సీ(SC)-3, ఈడబ్ల్యూఎస్ (EWS)-2, అన్ రిజర్వుడ్(UR)-1)

Pay Scale: నెలకు రూ.67,700 + ఇతర అలవెన్సులు.

Qualification

సంబంధిత విభాగాలలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ ఇనిస్టిట్యూట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ (MD/MS/DM/M.ch/DNB) చేసినవారు అర్హులు. ఎమెర్జెన్సీ మెడిసిన్ లో MD/DNB చేసిన వారు జనరల్ మెడిసిన్/ అనెస్తీషియా విభాగంలో సీనియర్ రెసిడెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Age Limit

జూలై 27, 2022 నాటికి జనరల్ అభ్యర్థుల వయసు 45 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మూడు (03), బెంచ్-మార్క్ డిజేబిలిటీ (జనరల్) అభ్యర్థులకు పది (10), బెంచ్-మార్క్ డిజేబిలిటీ (ఓబీసీ) అభ్యర్థులకు పదమూడు (13), బెంచ్-మార్క్ డిజేబిలిటీ (ఎస్సీ/ఎస్టీ) అభ్యర్థులకు పదిహేను (15) సంవత్సరాల వయసు సడలింపు ఉంది.

Selection Procedure

దరఖాస్తు చేసిన అభ్యర్థుల సంఖ్య పోస్టుల సంఖ్య కంటే మూడు రెట్లు ఎక్కువ ఉంటే రాత పరీక్ష నిర్వహిస్తారు. తక్కువగా ఉంటే ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తారు.

Application Fee

అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనే ముందు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. బ్యాంక్ అఫ్ బరోడాకు చెందిన బీబీనగర్ ఎయిమ్స్ బ్రాంచ్ (Bank Name: Bank of Baroda, Branch: AIIMS Bibinagar, Account Holder Name: AlIMS Bibinagar, Account No.66120100000006, IFSC Code: BARB0(Zero)DBCHND) లో అప్లికేషన్ ఫీజు జమ చేయాలి.
జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ.1,500, ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్లూఎస్ అభ్యర్థులు రూ.1,200 చెల్లించాలి. దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

How to Apply

ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు AIIMS Bibinagar వెబ్ సైట్ లో (www.aiimsbibinagar.edu.in/) నోటిఫికేషన్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను ప్రింట్ తీసుకొని దానిలోని వివరాలన్నీ పూర్తిగా నింపాలి. అనంతరం అప్లికేషన్ ఫాంతో పాటు అప్లికేషన్ ఫీజు చెల్లించిన రిసిప్ట్, పుట్టిన తేదీ సర్టిఫికెట్, ఎస్సెస్సీ అండ్ హెచ్ఎస్ఎస్సి పాస్ సర్టిఫికెట్, ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికెట్, ఇంటర్న్ షిప్ కంప్లీషన్ సర్టిఫికెట్, MD/MS/DNB/DM/M.ch డిగ్రీ సర్టిఫికెట్, UG/PG రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, కులం సర్టిఫికెట్ [email protected] ఈ-మెయిల్ కు పంపించాలి.

Interview Dates & Times

అనెస్తీషియా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ : 28 జూలై 2022 (ఉదయం 9గంటలకు)
ఆబ్ స్టెట్రిక్స్ – గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్ : 29 జూలై 2022 (ఉదయం 9గంటలకు)

Interview Venue:
Auditorium,
Second Floor,
AIIMS Bibinagar-508126.

Important Points

  • ఇవి పూర్తిగా తాత్కాలికమైన పోస్టులు.
  • ఎంపికైన అభ్యర్థులు మూడు (03) సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది.
  • భారతీయ పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు మెయిల్ చేసిన అప్లికేషన్ ఫాం, అప్లికేషన్ ఫీజు రిసిప్ట్, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని వెళ్లాలి.
  • అభ్యర్థులు ప్రస్తుతం మనుగడలో ఉన్న ఈ-మెయిల్, ఫోన్ నెంబర్ నే అప్లికేషన్ ఫాంలో ఇవ్వాలి.
  • ఈ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాలు మీరు ఇచ్చిన ఈ-మెయిల్, ఫోన్ నెంబర్ కే పంపిస్తారు. కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదు.

దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 27, 2022

Website – wdsc.telangana.gov.in

– Senior Resident Jobs in AIIMS