BSc Nursing Admissions in Nims : హైదరాబాద్ లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Nizam’s Institute of Medical Sciences-NIMS) 2022 విద్యాసంవత్సరానికి నాలుగు సంవత్సరాల బీఎస్సీ (నర్సింగ్) B.Sc. (Nursing) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కోర్సులో మొత్తం 100 సీట్లు ఉంటాయి. కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Qualification
- ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ 45 శాతం మార్కులతో పాసై ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 40 శాతం మార్కులతో పాసైనా సరిపోతుంది.
- ఇంటర్మీడియట్ లో ఇంగ్లిష్ సబ్జెక్టు కూడా చదివి ఉండాలి.
- రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టేట్ ఓపెన్ స్కూల్, కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ లో సైన్స్,
- ఇంగ్లిష్ సబ్జెక్టులు చదివినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- అభ్యర్థులు మెడికల్లీ ఫిట్ గా ఉండాలి.
- వివాహమైన మహిళలు కూడా దరఖాస్తుకు అర్హులు.
- నిమ్స్ పనిచేస్తున్న రెగ్యులర్ ఇన్-సర్వీస్ అభ్యర్థులకు ఐదు సీట్లు కేటాయిస్తారు.
Reservation Wise Seats
మొత్తం 100 సీట్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం (బీసీ(ఏ)-7శాతం, బీసీ(బీ)-10శాతం, బీసీ(సీ) ఒక శాతం, బీసీ(డీ)-7శాతం, బీసీ(ఈ)4శాతం) కేటాయించారు. దివ్యాంగులకు 5శాతం సీట్లు కేటాయించారు.
ఇందులో 85 శాతం సీట్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు కేటాయిస్తారు. 15 శాతం ఇతర రాష్ట్రాటలకు చెందిన అభ్యర్థులకు కేటాయి.
స్తారు. ఇందులో తెలంగాణ విద్యార్థులకు కూడా అవకాశం ఉంటుంది.
How to Apply
అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు NIMS వెబ్ సైట్ (www.nims.edu.in) ను ఓపెన్ చేసి ముందుగా Register Yourself పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకొన్న తర్వాత అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ వస్తాయి. వాటితో లాగిన్ అయ్యి ఆన్ లైన్ అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి.
ఆన్ లైన్ అప్లికేషన్ ను సబ్మిట్ చేసిన తర్వాత అభ్యర్థులు రూ.700 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/ ఇంటర్నెట్ బ్యాంకింగ్
ద్వారా ఆన్ లైన్ లోనే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
Documents to be Submitted
ఆన్ లైన్ అప్లికేషన్ ను విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ఆ అప్లికేషన్ కు ఈ క్రింది సర్టిఫికెట్లు జతచేయాలి.
1. పదో తరగతి మార్క్స్ మెమో
2. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
3. ఇంటర్మీడియట్ ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్ (టీసీ)
4. స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికెట్స్ (6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు)
5. రెసిడెన్స్ సర్టిఫికెట్
6. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఇన్ సర్వీస్ అభ్యర్థులు)
7. వైకల్య సర్టిఫికెట్ (దివ్యాంగులు)
8. సోషల్ స్టాటస్ సర్టిఫికెట్ (బీసీ (ఈ) అభ్యర్థులు)
పై అన్ని సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్ట్ చేయాలి. ఆ తర్వాత వాటన్నింటినీ అప్లికేషన్ కు జతచేయాలి. ఆ మొత్తం సర్టిఫికెట్లను అగస్టు 4, 2022 సాయంత్రం 5 గంటల లోపు The Associate Dean, Academic-2, 2nd floor, Old OPD Block, Nizam’s Institute of Medical Sciences, Hyderabad-500 082 చిరునామాకు పంపించాలి.
అప్లికేషన్ అందిన తర్వాత ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు. ఒకవేళ అప్లికేషన్ అందినట్టు సమాచారం రాకుంటే వారం రోజుల్లో Associate Dean, Academic-2 కార్యాలయంలో సంప్రదించాలి. లేదా 040-23489189 నెంబర్ కు ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చు.
Selection Procedure
ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఒక్కో జవాబుకు ఒక మార్కు ఇస్తారు. పరీక్ష రెండు గంటలలో రాయాల్సి ఉంటుంది. ప్రశ్నలు ఐదు సబ్జెక్టుల నుంచి ఇస్తారు. బయాలజీ నుంచి 20 ప్రశ్నలు, కెమెస్ట్రీ నుంచి 20 ప్రశ్నలు, ఫిజిక్స్ నుంచి 20 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్ ఫర్ నర్సింగ్ నుంచి 20 ప్రశ్నలు, ఇంగ్లిష్ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. క్వాలిఫై కోసం అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. క్వాలిఫై అయిన అభ్యర్థులను కౌన్సెలింగ్ ఆహ్వానించి అడ్మిషన్లు కల్పిస్తారు.
Course Fee
అడ్మిషన్ ఫీజు: రూ.3,000 (One Time)
సెక్యూరిటీ డిపాజిట్ – రూ.1,000 (One Time)
ట్యూషన్ ఫీజు – ఏడాదికి రూ.31,250 చొప్పున నాలుగు సంవత్సరాలు.
లైబ్రరీ ఫీజు – ఏడాదికి రూ.1,000 చొప్పున నాలుగు సంవత్సరాలు.
పరీక్ష ఫీజు – ఏడాదికి రూ.1.300 చొప్పున నాలుగు సంవత్సరాలు.
రవాణా ఫీజు – ఏడాదికి రూ.1500 చొప్పున నాలుగు సంవత్సరాలు.
అఫిలియేషన్ ఫీజు – ఏడాదికి రూ.1,000 చొప్పున నాలుగు సంవత్సరాలు.
Importanat Dates
ఆన్ లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఆగస్టు 1, 2022
అప్లికేషన్ హార్డ్ కాపీ పంపేందుకు చివరి తేదీ: ఆగస్టు 4, 2022
హాల్ టికెట్స్ డౌన్ లోడ్ : సెప్టెంబర్ 14, 2022
ప్రవేశ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 18, 2022
తాత్కాలిక ఫలితాల వెల్లడి: సెప్టెంబర్ 20, 2022
ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ తేదీ: అక్టోబర్ 10, 2022
– BSc Nursing Admissions in Nims