Project Scientist Jobs in NIRDPRA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Project Scientist Jobs in NIRDPR : హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో గల నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (National Institute of Rural Development and Panchayati Raj-NIRDPR), సెంటర్ ఫర్ జియో ఇన్ఫర్మేటిక్స్ అప్లికేషన్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ (Centre for Geo-informatics Application in Rural Development-CGARD) కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్ సైంటిస్ట్ (Project Scientist) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Advt No.22/2022) జారీ చేసింది. మొత్తం 22 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Details of Posts

1. ప్రాజెక్ట్ సైంటిస్ట్ (వెబ్ అప్లికేషన్స్ ప్రొడక్ట్స్, సర్వీసెస్)
Project Scientist (Web Applications Products and services-WAPS)
2. ప్రాజెక్ట్ సైంటిస్ట్ (సిస్టమ్స్ అండ్ నెట్ వర్క్స్ మేనేజ్మెంట్)
Project Scientist (Systems and Networks Management-SNM)
3. ప్రాజెక్ట్ సైంటిస్ట్ (మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్)
Project Scientist (Mobile Application Development-MAD)
4. ప్రాజెక్ట్ సైంటిస్ట్ (జీఐఎస్ అనాలిసిస్)
Project Scientist (GIS Analysis-GIS)
5. ప్రాజెక్ట్ సైంటిస్ట్ (రిమోట్ సెన్సింగ్ బేస్డ్ అనాలిసిస్)
Project Scientist (Remote Sensing based Analysis-RS)

Project Scientist-WAPS

పోస్టు పేరు: ప్రాజెక్ట్ సైంటిస్ట్ (వెబ్ అప్లికేషన్స్ ప్రొడక్ట్స్, సర్వీసెస్)
పోస్టుల సంఖ్య: ఆరు (06) (అన్ రిజర్వుడ్ (UR)-15, ఓబీసీ(OBC)-01)
విద్యార్హతలు: CSE/IT లో BE/B Tech లేదా CSE/IT లో MSc (65 శాతం మార్కులతో ఫస్ట్ క్లాస్ లో పాసై ఉండాలి).
అనుభవం: సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్, డిప్లాయ్ మెంట్, మేనేజ్మెంట్ లో కనీసం మూడు (03) సంవత్సరాల అనుభవం ఉండాలి. రిమోట్ సెన్సింగ్, GIS, AI/ML/DL లో పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. NRSC, షాద్ నగర్ లో సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్, డెప్లాయ్ మెంట్, మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.50,000

Project Scientist-SNM

పోస్టు పేరు: ప్రాజెక్ట్ సైంటిస్ట్ (సిస్టమ్స్ అండ్ నెట్ వర్క్స్ మేనేజ్మెంట్)
పోస్టుల సంఖ్య: రెండు (02)
విద్యార్హతలు: CSE/IT/ECE లో BE/B Tech లేదా CSE/IT/ECE లో MSc (65 శాతం మార్కులతో ఫస్ట్ క్లాస్ లో పాసై ఉండాలి).
అనుభవం: సిస్టమ్స్ అండ్ నెట్ వర్క్స్ మేనేజ్మెంట్ లో కనీసం మూడు (03) సంవత్సరాల అనుభవం ఉండాలి. రిమోట్ సెన్సింగ్, GIS పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. NRSC, షాద్ నగర్ లో సిస్టమ్స్ అండ్ నెట్ వర్క్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను పర్యవేక్షించాలి.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.50,000

Project Scientist-MAD

పోస్టు పేరు: ప్రాజెక్ట్ సైంటిస్ట్ (మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్)
పోస్టుల సంఖ్య: రెండు (02)
విద్యార్హతలు: CSE/IT/ECE/Electronics లో BE/B Tech లేదా CSE/IT/ECE/Electronics/Telematics లో MSc (65 శాతం మార్కులతో ఫస్ట్ క్లాస్ లో పాసై ఉండాలి).
అనుభవం: మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, టెస్టింగ్, డెప్లాయ్ మెంట్, మేనేజ్మెంట్ లో కనీసం మూడు (03) సంవత్సరాల అనుభవం ఉండాలి. రిమోట్ సెన్సింగ్, GIS పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం నెలకు రూ.50,000

Project Scientist-GIS

పోస్టు పేరు: ప్రాజెక్ట్ సైంటిస్ట్ (జీఐఎస్ అనాలిసిస్)
పోస్టుల సంఖ్య ఆరు (16) (అన్ రిజర్వుడ్(UR)-15, ఓబీసీ (OBC)-01)
విద్యార్హతలు: Geo-Informatics/ Geomatics/ Remote Sensing లో M Tech లేదా Geo-Informatics/ Geomatics/ Remote
Sensing లో M Sc/BE (65 శాతం మార్కులతో ఫస్ట్ క్లాస్ లో పాసై ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో రెండు (02) సంవత్సరాల అనుభవం ఉండాలి. రిమోట్ సెన్సింగ్, GIS పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం నెలకు రూ.50,000

Project Scientist-RS

పోస్టు పేరు: ప్రాజెక్ట్ సైంటిస్ట్ (రిమోట్ సెన్సింగ్ బేస్డ్ అనాలిసిస్)
పోస్టుల సంఖ్య ఆరు (06) (అన్ రిజర్వుడ్(UR)-15, ఓబీసీ (OBC)-01)
విద్యార్హతలు: Agricultural Sciences/ Forestry/ Geography/Environmental Sciences లో MSc. (65 శాతం మార్కులతో ఫస్ట్ క్లాస్ లో పాసై ఉండాలి).
అనుభవం: RS/ GIS లో రెండు (02) సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం నెలకు రూ.50,000

How to Apply

ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు ముందుగా రూ.300 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
NIRD&PR పేరిట హైదరాబాద్ లో చెల్లుబాటు అయ్యేలా డీడీ(డిమాండ్ డ్రాఫ్ట్) తీయాలి.
జనరల్/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు చెల్లించాల్సిన అవసరం లేదు.
అనంతరం అభ్యర్థులు NIRD&PR వెబ్ సైట్ (http://career.nirdpr.in/) ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆ తర్వాత సబ్మిట్ చేసిన దరఖాస్తు ఫాంను ప్రింట్ తీసుకొని, దానికి డీడీని జతచేయాలి.
డీడీ వెనక అభ్యర్థి పూర్తి పేరు, అప్లికేషన్ నెంబర్ రాయాలి.
దరఖాస్తు ఫాం, డీడీని National Institute Of Rural Development & Panchayati Raj, Rajendranagar, Hyderabad -500 030. చిరునామాకు పంపించాలి.
ఈ ఉద్యోగ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాలు వెబ్ సైట్ లో మాత్రమే పెడతారు. వ్యక్తిగతంగా తెలియజేయరు. కాబట్టి అభ్యర్థులు సంస్థ
వెబ్ సైట్ ను తరచూ చూస్తుండాలి.

– Project Scientist Jobs in NIRDPR