Clinical Genetics Course in IGHGDA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Clinical Genetics Course in IGHGD : హైదరాబాద్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డీసీజెస్ (ఐజీహెచీడీ) (Institute of Genetics and Hospital for Genetic Diseases-IGHGD) క్లినికల్ జెనెటిక్స్: డయాగ్నస్టిక్స్ అండ్ మేనేజ్మెంట్ సర్టిఫికెట్ (Clinical Genetics: Diagnostics and Management) కోర్సులో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University-OU) నోటిఫికేషన్ జారీ చేసింది. అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ కోర్సుకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Eligibility

గుర్తింపు పొందిన యూనివర్సిటీలో మెడిసిన్, డెంటిస్ట్రీ, జెనెటిక్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, జువాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మసీ, నర్సింగ్ లో గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు అర్హులు. కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.

Selection Procedure

దరఖాస్తుల పరిశీలన అనంతరం అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.

Course Details & Seats

ఈ కోర్సు వ్యవధి ఆరు (06) నెలలు. ఈ కోర్సులో మొత్తం 20 సీట్లు ఉంటాయి. ఈ కోర్సులో థియరీ, ప్రాక్టికల్ ట్రెయినింగ్, ప్రాజెక్ట్ వర్క్ ఉంటాయి.

Theory
థియరీలో ఈ క్రింది అంశాలు ఉంటాయి.

  • అడ్వాన్సుడ్ టెక్నిక్స్ ఇన్ మెడికల్ జెనెటిక్స్
  • బయో కెమికల్ అండ్ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ జెకెటిక్ డిసీజెస్
  • పేరెంటల్ డయాగ్నసిస్ అండ్ జెనెటిక్ కౌన్సెలింగ్

Practicals
ప్రాక్టికల్స్ లో ఈ క్రింది అంశాలు ఉంటాయి.

  • 3D/4D ఆల్ట్రాసోనోగ్రఫీ (TIFFA,Fetal 2D Echo)
  • ఇంటర్వెన్షన్ ప్రొసీజర్ (Amniocentesis, CVS)
  • లింఫోసైట్ కల్చర్
  • కార్యోటైపింగ్
  • ఫ్లోరోసెంట్ ఇన్ సిటు హైబ్రిడైజేషన్ (FISH)
  • క్రోమోజోమల్ మైక్రోఅరే
  • క్లినికల్ ఎక్సోమ్ అనాలిసిస్ (NGS)
  • క్లినికల్ ప్రోటీమ్ అనాలిసిస్ (Lc-MS/MS)
  • రెస్ట్రక్షన్ ఫ్రాగ్మెంట్ లెంగ్త్ పాలిమార్ఫిజం (RFLP)
  • హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రొమటోగ్రఫీ (HPLC)
  • ఎంజైమ్ లింక్ ఇమ్యూనోసార్బెంట్
  • కామెట్ అస్సే
  • న్యూ బార్న్ స్క్రీనింగ్
  • కేస్ స్టడీస్ (క్లినికల్ ఎవల్యూషన్ పెడిగ్రీ అనాలసిస్, రిస్క్ అసెస్మెంట్)
  • సైకలాజికల్ అసెస్మెంట్
  • జెనెటిక్ కౌన్సెలింగ్
  • PCR, ARMS-PCR, Multiplex PCR

Project work

  • ప్రాజెక్టు వర్క్ అభ్యర్థి ఎంచుకున్న అంశంలో చేయవచ్చు.

థియరీ అండ్ ప్రాక్టికల్స్ కు 300 మార్కులు ఉంటాయి. ప్రాజెక్ట్ వర్క్ కు 100 మార్కులు ఉంటాయి. ఇందులో అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ దర్వారా సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుంది.

Fee Structure

ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్సు. ఈ కోర్సుకు ఎంపికైన అభ్యర్థులు అడ్మిషన్ సమయంలో రూ.30,000 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు డీడీ రూపంలో చెల్లించాలి. హైదరాబాద్ లో జాతీయ బ్యాంకులలో చెల్లుబాటు అయ్యేలా The Director, Institute of Genetics, OU. Begumpet, Hyderabad పేరిట డీడీ తీయాల్సి ఉంటుంది.

How to Apply

ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు ముందుగా రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు డీడీ రూపంలో చెల్లించాలి. హైదరాబాద్ లో జాతీయ బ్యాంకులలో చెల్లుబాటు అయ్యేలా The Director, Institute of Genetics, OU, Begumpet, Hyderabad పేరిట డీడీ తీయాల్సి ఉంటుంది. అనంతరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డీసీజెస్, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ వెబ్ సైట్ (www.instituteofgenetics-ou.org / www.osmania.ac.in) లలో నిర్ణీత ఫార్మాట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి.
అప్లికేషన్ ఫాంలో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించి, అందులోని వివరాలన్నీ నింపాలి, అదే విధంగా ఆ అప్లికేషన్ ఫాంకు గెజిటెడ్ అధికారి చేత అటెస్ట్ చేయించిన విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, కులం సర్టిఫికెట్ (ఎస్సీ/ ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు) జిరాక్స్ కాపీ, స్టాంప్ అంటించిన సెల్ఫ్ అడ్రస్ ఎనవలప్ కవర్ జతచేసి వాటన్నింటినీ ఈ క్రింది అడ్రస్ కు పంపించాలి.
The Director.
Institute of Genetics and Hospital for Genetic Diseases,
Osmania University, Begumpet, Hyderabad – 500016,
Telangana
Phone: 040-23403681

Job Opportunities

ఈ కోర్సును విజ‌య‌వంతంగా పూర్తి చేసిన అభ్య‌ర్థుల‌కు జాతీయ మ‌రియు అంత‌ర్జాతీయ రిసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్లలో, ఆసుప‌త్రులలో, స్పెషాలిటీ క్ల‌నిక్ ల‌లో, డ‌యాగ్న‌స్టిక్ సెంట‌ర్ల‌లో ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తాయి.

Important Dates

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఆగస్టు 25, 2022
ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: ఆగస్టు 27, 2022
కోర్సు ప్రారంభం: సెప్టెంబర్ 01, 2022

పూర్తి వివరాల కోసం ఈ కింది చిరునామాలలో సంప్రదించవచ్చు.

Dr. B. Vijaya Lakshmi
Director (I/C)
Institute of Genetics & Hospital for Genetic Diseases, O.U., Begumpet, Hyderabad – 16
Ph: 8331997340
Email : [email protected]

Course Co-ordinators
Dr. A. Venkateshwari
Associate Professor
E-mail: [email protected]
&
Dr. G. Deepika
Assistant Professor
E-mail: [email protected]

– Clinical Genetics Course in IGHGD